OTT Movie : కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌లో పెద్దగా ఆకట్టుకోక పోయినా, ఓటీటీలో దూసుకుపోతుంటాయి. ఒక మలయాళం ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో బోల్తా కొట్టి, ఓటీటీలో మంచి వ్యూస్ సంపాదించింది. ఈ చిత్రం వయనాడ్‌లో పోలీసులను హత్యలు చేస్తూ, క్లూ వదిలే ఒక గ్యాంగ్‌ని ఛేదించే డిటెక్టివ్ జోషి మాథ్యూ ప్రయాణాన్ని ఆసక్తికరంగా చూపిస్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే …
మనోరమమాక్స్ లో స్ట్రీమింగ్
ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ‘అస్త్ర’ సినిమాకి అజాద్ అలవిల్ దర్శకత్వం వహించారు. అమిత్ చక్కలక్కల్, సుహాసిని కుమారన్, సెంథిల్ కృష్ణ, సుధీర్ కరమాన, కలభవన్ షాజోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 2025 జూలై 18 నుంచి మనోరమమాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : కూతురితో తండ్రి పాడు పనులు… లేపేసి జైలుకెళ్తే అక్కడ అంతకన్నా దారుణం… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే
స్టోరీవయనాడ్‌లోని సుల్తాన్ బాతరీలో 48 గంటల వ్యవధిలో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు, ఒక మిస్టీరియస్ గ్యాంగ్ చేతిలో దారుణంగా హత్యకు గురవుతారు. క్రైమ్ సీన్‌లో రక్తంతో గీసిన బాణం గుర్తును వదులుతారు. ఇది పోలీసులకు ఒక సవాల్‌గా మారుతుంది. ఈ కేసును సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ జోషి మాథ్యూ (అమిత్ చక్కలక్కల్) అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. జోషి, తన టీమ్‌తో కలిసి, ఈ హత్యల వెనుక మోటివ్, బాణం గుర్తు సింబాలిజంను కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో వయనాడ్ ఫారెస్ట్ విజువల్స్, జోషి డిటెక్టివ్ స్కిల్స్, విట్‌నెస్ ఇంటరాగేషన్స్ తో సస్పెన్స్ గా నడుస్తుంది. మరోవైపు గ్యాంగ్ సభ్యులు జోషిని టెన్షన్‌లో ఉంచుతారు.
ఈ బాణం గుర్తు ఒక రివెంజ్ సింబల్‌గా, గ్యాంగ్ లీడర్‌కి సంబంధించిన గత కథతో లింక్ అవుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా హత్యకు గురైన పోలీసులు ఒకమ్మాయిని పోలీస్ జీపులోనే వేధిస్తారు. ఆమె స్పృహ లేని టైమ్ లో ఒకరితరువాత ఒకరు క్రూరత్వం ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ హాఫ్‌లో కేసు కాంప్లెక్స్ అవుతుంది. ఓక సోషల్ అన్‌రెస్ట్, లోకల్ గ్రూప్‌లతో కనెక్షన్స్ బయటపడతాయి. జోషి ఈ గ్యాంగ్‌ని ట్రాప్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఇక క్లైమాక్స్‌లో స్టోరీ ట్విస్ట్‌లతో ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది. ఈ గ్యాంగ్ పోలీసులను ఎందుకు చంపుతారు ? ఈ గ్యాంగ్ ఎవరు ? బాణం గుర్తును క్లూ గా ఎందుకు వదులుతున్నారు ? జోషి ఈ కేసుకి ముగింపు ఇస్తాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.