Gundeninda GudiGantalu Today episode july 30 th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఈ పూల కొట్టు నువ్వు తీసేసి ఒక ఐడియా నా దగ్గర ఉంది ఆంటీ అని అంటుంది. ఏంటమ్మా ఐడియా ని ప్రభావతి అడుగుతుంది. కార్పొరేషన్ వాల్ల పర్మిషన్ తీసుకోవాలి. వీళ్లు తీసుకోలేదనుకుంటా మనము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ షాప్ ని తీసేస్తారు అని అంటుంది. అది విన్న ప్రభావతి సంతోషపడుతుంది. పూల కొట్టు పోతుంది మీనా నా గుప్పెట్లో ఉంటుంది అని కలలు కంటుంది.. మీనా నీకు ఇక ముందు ఉంటుంది. అప్పుల కొట్టు చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. దాన్నే లేకుండా చేసేస్తా అని ప్రభావతి సంతోషపడుతుంది.. రోహిణి రివేంజ్ తిరుతుంది. మీనాకు కన్నీళ్లు తప్పలేదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే…ప్రభావతి మాత్రం కామాక్షిని ఆపుతూ ఉంటుంది. కొట్టు ఇంటి దగ్గర ఉంటే ఎవరు పరువు పోయింది ఆ మనోజ్ గాడు ఆడుకోవడం మా చీటీ పట్టుకొచ్చే వాళ్ళందరూ చూశారు నాతో అన్నారు కూడా అని అంటుంది. నువ్వేం బాధపడకు మీనా ? నీ పూలు కొట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తుందిలే అని కామాక్షి వెళ్లిపోతుంది.. కానీ మీనా మాత్రం బాధ పడుతూనే ఉంటుంది. మీనా దగ్గరికి భోజనం తీసుకెళ్లిన బాలు ఇంకా దాని గురించే బాధపడుతున్నావా? ఎవరో నువ్వంటే ఇష్టం లేనివాళ్లే ఇలా చేశారు నువ్వేం బాధపడకు అని అంటాడు. నాకు నేను గుర్తింపు తెచ్చుకోవడానికి అదొక్కటే కారణం. అదే లేకుండా పోవడంతో నాకు చాలా బాధగా ఉంది అని మీనా అంటుంది.
నువ్వు ఇలా సంపాదించడం ఓర్వలేకే ఎవరో కావాలనే ఇలా చేశారు. ఆ దేవుడనేవాడు ఉంటే కచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు అని బాలు అంటాడు.. ఇక ఉదయం లేవగానే ప్రభావతి మీనా అని గట్టిగా కేకలు వేస్తుంది. మీనా కిందికొచ్చి ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. ఏంటి బారెడు పొద్దున ఇంకా లేవలేదు.. ఎందుకింత ఆలస్యమైంది అని అడుగుతుంది. పూల కొట్టు పోయినందుకు బాధగా అనిపించింది రాత్రి నిద్ర పట్టలేదు లేటుగా పడుకున్నాను అందుకే లేటుగా లేచాను ఇప్పుడు ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది.
పూల కొట్టున్నప్పుడు ఏమి పని చేసే దానివి కాదు.. నిన్నటి నుంచి ఎక్కడి అంట్లు అక్కడే ఉన్నాయి. పని అంతా అలానే ఉంది. ఏం లేవగానే కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు అని అరుస్తుంది. కాఫీ నేను ఇవ్వకపోతే మీకు ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఆమె కాఫీ పెట్టేస్తుంది కదా అని అడుగుతుంది. నేనేమీ పార్కులో పడుకోలేదు గుడి ముందర అడక్కు తినలేదు కదా అత్తయ్య ఒకరోజు లేట్ అయితే ఏం కాదు కదా అని మనోజ్ ని ఉద్దేశించి మీనా అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు నా భార్య ఏ పని చేయదు నీ ఇద్దరు కోడలు అడిగి చేయించుకో అని అంటాడు.
మీనా పరిస్థితిని చూసి రాజేష్ దగ్గరికి వెళ్లి పూల కొట్టు పెట్టించాలిరా అని అంటాడు.. అయితే ముందు కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏమైందో కనుక్కోవచ్చు కదా అని రాజేష్ అంటాడు. అది కూడా చేశాను రా. ముందర పెట్టడానికి కుదరదేమో అందుకే ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. బాలు వాళ్ళ ఫ్రెండ్ తన భార్య ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఇంకా రాలేదు అని ఫోన్ చేస్తుంది. మీనా చేత కూడా పూలు ఇంటికి పంపిస్తే ఎలా ఉంటుంది అని బాలు ఆలోచిస్తాడు. ఈ ఐడియా చాలా బాగుందిరా.. మరి బండి కావాలి కదా అని అంటారు. బండిని కొందాము నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయని అంటారు.
Also Read:అనుష్క ‘ఘాటి ‘ మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?
అయితే ముందు బండిని చూసొద్దాం అని వెళ్తాడు. అక్కడ మీనాకు నచ్చిన రంగు బండి దొరకపోవడంతో ఏదో ఒక బండిని సెలెక్ట్ చేస్తాడు బాలు.. ఆ అయితే ఇంకొక 10000 కావాలని అడుగుతాడు. ఒక ముసలాయనొచ్చి నా ఇంటిలో రౌడీలున్నారు. అది ఖాళీ చేయిస్తే నేను మీకు ఆ 10000 ఇస్తానని అంటాడు.. బాలు ఆ రౌడీ దగ్గరికి వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..