Gundeninda GudiGantalu Today episode june 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. పూలమాలన్నీ అనుకున్న టైంలో కల్లా ముందే పూర్తి చేయాలని బాలు మీనా అనుకుంటారు. ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ మాలల్ని పూర్తి చేసే పనిలో ఉంటారు. మధ్యలో బాలు అందరికీ నెద్దమ్మత్తు వస్తుందని ప్లేట్ పట్టుకొని గట్టిగా సౌండ్ చేస్తాడు. ఏంట్రా ఈ గోల అంటే అందరూ నిద్రమత్తులో ఉన్న నాన్న నిద్రమత్తులో ఉంటే పూలు ఎలా కడతారు అని ఇలా చేశానని బాలు అంటాడు. ఇప్పుడు నిద్రమత్తు అందరికీ వదిలిందా అని బాలు అడుగుతాడు. ఈ నిద్రమత్తు పోవాలంటే సరదాగా కాసేపు పాటలు పాడుకోవాలని సత్యం అంటాడు. పూలు కడుతూ పూల పై సరదాగా పాటలు పాడుతారు. ప్రభావతి మాత్రం తన డ్యాన్స్ తో మెప్పిస్తుంది. కామాక్షి ప్రభావతికి పెద్ద క్లాస్ పీకుతుంది. ప్రభావతి మాత్రం మీనా పై సెటైర్లు వేస్తూనే ఉంటుంది. మొత్తానికి మాలలని పూర్తి చేసే పనిలో అందరూ నిమగ్నమైపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ వెళ్లి పడుకున్న కూడా మీనా మాత్రం మాలలు కట్టాలని అలానే కూర్చొని మాలలు కడుతూ ఉంటుంది. బాలు చైర్ లో నిద్రపోతూ ఉంటాడు. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే మీనా మాలలు కట్టడం చూసి బాలు కాసేపైన నిద్రపోవచ్చు కదా.. ఒక్కదానివే పూలు కడుతూ కూర్చున్నావా ఇలా అయితే ఎలా అనేసి అడుగుతాడు. నేను డబ్బులు కోసం కట్టలేదండి మీరు ఇచ్చిన మాట కోసమే కష్టపడుతున్నాను అంతే అని మీనా సమాధానం చెబుతుంది. ఆ మాట వినగానే బాలు భార్యపై ప్రేమతో మురిసిపోతాడు. భార్య కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయిన బాలు మీనా కోసం స్పెషల్ టీ ని పెట్టుకొని తీసుకొస్తాడు.
ఇద్దరు కలిసి మొత్తానికి మాలల్ని అనుకున్న టైం కన్నా ముందే పూర్తి చేసి ఓ టెంపోల్లో లోడ్ చేసి పంపించాలని అనుకుంటారు.. ఉదయం అంత సిద్ధం చేసి మాలల్ని ఒక టెంపోకెక్కిస్తారు. ఆ టెంపో డ్రైవర్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం చూసి బాలు సెటైర్లు వేస్తాడు . పక్కనే ఉన్న మీనా దానికి కౌంటర్లు ఇస్తుంది.. మొత్తానికైతే ఆటోలో మాలల్ని లోడ్ చేసి డ్రైవర్ ని వీరబాబు దగ్గరికి తీసుకెళ్లమని చెప్తారు. తను మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుకుంటూ ఆటోని ముందుకు తీసుకెళ్తాడు. ఆటోలో లోడ్ చేయడం దగ్గరనుంచి గుణ మనుషులు ఫాలో అవుతూ ఉంటారు.
పూల ఆటో బయలుదేరగానే మరో ఇద్దరు రౌడీలకు కాల్ చేసి బండి వస్తుంది రెడీగా ఉండండి అని అంటారు. గుణ మనుషులు పూల ఆటోను ఫాలో అవుతారు. ఆటో నడుపుతున్న డ్రైవర్ చెవిలో బ్లూ టూత్ పెట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ గమ్యానికి వెళ్తూఉంటాడు. దారిలోనే ఆ ఇద్దరు రౌడీలు బండి మీద ఫాలో అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక ఆటోను ఆపి వెనక టైర్ పంచర్ అయ్యిందని అన్నాచూసుకోండి వెళ్లి చెప్తారు. బ్యాక్ టైర్ పంచర్ అయ్యింది చూసుకో’ అని చెప్పి ముందుకు వెళ్లిపోతారు. దాంతో ఆ ఆటో డ్రైవర్ ఆగి దిగి వెనుక టైర్ చూసేందుకు ఆటో వెనక్కి వెళ్తాడు. ఆటో డ్రైవర్‌తో అబద్దం చెప్పిన రౌడీ.. ఆటో దగ్గరకు వెళ్లి ఆటోతో సహా పూల మాలాలను ఎత్తుకొని వెళ్ళిపోతారు.
వెంటనే తేరుకున్న ఆటో డ్రైవర్ బాలుకు ఫోన్ చేసి చెప్తాడు. పక్కనే మీనా కూడా షాక్ అవుతూ వింటుంది. పక్కనే ఉన్న బాలు ఫ్రెండ్ అశోక్ కంగారుగా ఫోన్ తీసుకుని.. రేయ్ బాలు.. మాలలు లేకపోతే మన ప్రాణాలే పోతాయిరా అంటూ అరుస్తాడు. అశోక్ చెప్పిన మాటలు ని బాలు సీరియస్ గా తీసుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన గుణ మాత్రం బాలు టెన్షన్ పడటం చూస్తే నాకు చాలా సరదాగా ఉంది ఇన్నాళ్లకు నా రివెంజ్ తీర్చుకున్నాను అంటూ సంతోషపడుతుంటాడు..
మీనా పాలు ఇద్దరు పూల ఆటో కోసం వీధులన్నీ తిరుగుతూ టెన్షన్ పడుతుంటారు.. ఒకచోట ఆగి బాలు మీనా ఆటో గురించి అడుగుతారు. అయితే మీనండి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే మనకు చెప్తారు కదా అని సలహా ఇస్తుంది. దాంతో బాలు కార్ డ్రైవర్లకు సంబంధించిన వాట్స్అప్ గ్రూపులో ఆ మెసేజ్ ని పెడతాడు. అందరూ ఆ మెసేజ్ ను చూసి బాలు ఏంటి ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు. నిజంగానే ఇంత సీరియస్ అని డ్రైవర్ల అందరూ ఆ టెంపో కోసం వెతుకుతారు.
ఒక ఆటో డ్రైవర్ బాలు పెట్టిన టెంపో ఇదే అని బాలుకు వెంటనే ఇంఫర్మేషన్ ఇస్తాడు. డ్రైవర్ల అందరూ ఆ టెంపోను చూసి దాని వెనకాలే ఫాలో అవుతారు.. బాలు కి లైవ్ లొకేషన్ పెడతారు. మొత్తానికి పూలమాలలున్న ఆ ఆటోని కనిపెడతారు. డ్రైవర్ ని పట్టుకుని చితక్కొడతాడు బాలు. వాడి గురించి తర్వాత మాలలు మండపానికి చేరుకోవాలని రాజేష్ చెప్పడంతో బాలు ఆటోని మండపానికి తీసుకెళ్తాడు. గుణ ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..