OTT Movie : ఒక సింగిల్ మదర్ తన అనారోగ్యంతో బాధపడే కూతురు కోసం జీవితంలో పోరాడుతూ ఉంటుంది. అయితే ఒక రోజు ఆమె జీవితాన్ని తలకిందులు చేసే సంఘటనలు జరుగుతాయి. ఒక్కో సంఘటన ఆమెను అనూహ్యమైన ఒక దారిలోకి నడిపిస్తుంది. ఒక చిన్న తప్పు ఆమెను ఒక భయంకరమైన గొలుసులో చిక్కుకునేలా చేస్తుంది. అక్కడ ఆమె నేరస్థురాలిగా ముద్రపడుతుంది. చివరికి ఆమె ప్రేమించే కూతురిని కాపాడటానికి ఆమె ఎంత దూరం వెళ్తుంది? అనేది స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ జనీయా విల్ట్‌కిన్సన్ (తారాజీ పి. హెన్సన్) అనే సింగిల్ మదర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె అనారోగ్యంతో బాధపడే తనకూతురు ఆరియా (గాబ్రియెల్ ఇ. జాక్సన్)తో కలిసి ఒక పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. జనీయా రెండు ఉద్యోగాలు చేస్తూ, అప్పులు, అపార్ట్‌మెంట్ అద్దె, ఆరియా యొక్క వైద్య ఖర్చులను భరిస్తూ కష్టపడుతుంది. ఒక రోజు ఉదయం ఆరియా తన స్కూల్ లంచ్ డెట్ కోసం $40 అవసరమని చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. లేకపోతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమెను బహిరంగంగా అవమానిస్తుందని చెబుతుంది. జనీయా ఈ విషయంలో బాధపడుతూనే, ఆరియాను స్కూల్‌కు తీసుకెళ్లి, తన గ్రాసరీ స్టోర్ ఉద్యోగానికి వెళ్తుంది. ఆమె బయటకు వెళ్లే ముందే ఇంటి ఓనర్ అద్దె చెల్లించకపోతే ఖాళీ చేయమని బెదిరిస్తాడు. ఇవన్నీ గాక ఆమె పనిచేసే స్టోర్‌లో, ఒక కస్టమర్‌తో గొడవ, ఆమె బాస్ రిచర్డ్ నిర్లక్ష్య వైఖరి ఆమెపై ఒత్తిడిని మరింత పెంచుతాయి.
ఈ క్రమంలో ఆమె జీతం కోసం స్టోర్ లో ఎదురుచూస్తుంటుంది. ఇంతలో ఇద్దరు దొంగలు ఆయుధాలతో వచ్చి స్టోర్‌ను దోచుకుంటారు. ఒక దొంగ ఆరియా బ్యాగ్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దానిలో ఆమె కూతురుకి సంబంధించిన మందులు ఉన్నాయి. ఆత్మరక్షణలో, జనీయా దొంగ గన్‌ను లాగి, అతన్ని కాల్చి చంపుతుంది. ఆమె బాస్ ఆమెను దొంగతో కలిసి పనిచేసిందని ఆరోపిస్తాడు. దీనితో ఆమె ఆవేశంలో అతన్ని కూడా కాల్చి చంపుతుంది. భయాందోళనలో ఆమె తన రక్తంతో నిండిన పే-చెక్‌ను తీసుకుని బ్యాంక్‌కు పరుగెత్తుతుంది.
ఆమె తన ID ని కంగారులో తీసుకురావడం మరచిపోతుంది. అందువల్ల బ్యాంక్‌లో ఆమె చెక్‌ను క్యాష్ చేయలేకపోతుంది. నిరాశలో ఉన్న ఆమె గన్‌ను బయటకు తీసి బ్యాంక్ సిబ్బందిని బెదిరిస్తుంది. వాళ్ళు సైలెంట్ గా అలారం ట్రిగ్గర్ ఆన్ చేస్తారు. బ్యాంక్ మేనేజర్ నికోల్ (షెర్రీ షెపర్డ్), డిటెక్టివ్ రేమండ్ (టియానా టేలర్), ఒక మాజీ ఆర్మీ నెగోషియేటర్, జనీయాతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తారు.ఈ సంఘటన ఒక హాస్టేజ్ సిచుయేషన్‌గా మారుతుంది. చివరికి జనీయా ఈ నేరం నుంచి బయట పడుతుందా ? తన కూతురి కోసం ఏం చేస్తుంది ? ఆమె జీవితం ఎలా టర్న్ అవుతుంది ? అనే విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్… జీ5 లో దుమ్మురేపుతున్న బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్ట్రా’ (Straw). ఈ సినిమాకి టైలర్ పెర్రీ దర్శకత్వం వహించారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీకి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది. ఇందులో తారాజీ పి. హెన్సన్ (జనీయా విల్ట్‌కిన్సన్), షెర్రీ షెపర్డ్ (నికోల్), టియానా టేలర్ (డిటెక్టివ్ రేమండ్), గ్లిన్ టర్మన్ (రిచర్డ్), సిన్‌బాద్, రాక్‌మండ్ డన్‌బర్, మైక్ మెర్రిల్, ఆష్లీ వెర్షర్ వంటి నటులు నటించారు.