BigTV English

Los Angeles Protests: రగిలిపోతున్న లాస్ ఏంజిల్స్.. ట్రంప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే?

Los Angeles Protests: రగిలిపోతున్న లాస్ ఏంజిల్స్.. ట్రంప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే?

Los Angeles Protests: లాస్ ఏంజిల్స్ రగిలిపోతోంది. అక్రమ వలసదారులంటూ పెద్ద ఎత్తున చెకింగ్స్ నడుస్తుండడంతో.. వీటికి వ్యతిరేకంగా అంతా రోడ్డెక్కుతున్నారు. ఇదెక్కడి దబాయింపు అంటున్నారు. ట్రంప్ వైఖరిపై గరంగరం అవుతున్నారు. కార్లు తగలబెడుతున్నారు. అరెస్ట్ చేసి వెనక్కు పంపితే యుద్ధమే అంటున్నారు. ఇంతకీ లాస్ ఏంజిల్స్ రగడ ఎటువైపు దారి తీయబోతోంది? నేషనల్ గార్డ్స్ ను ట్రంప్ ఎందుకు రంగంలోకి దింపారు?


మొన్నటిదాకా కార్చిచ్చులు.. ఇప్పుడు ఈ ఆగ్రహజ్వాలలు.
క్షణక్షణం.. భయం భయం.. అన్నట్లుగా సీన్ ఉందక్కడ.
ఓవైపు వలసదారులు.. ఇంకోవైపు నేషనల్ గార్డ్స్..
సై అంటే సై .. ఢీ అంటే ఢీ..
రాళ్ల దాడులు.. పెప్పర్ స్ప్రేలు..
అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిందే అని గార్డ్స్..
వెళ్లేదే లేదని వలసదారులు..
మధ్యలో అరెస్టులు.. డిటెన్షన్ సెంటర్ల దగ్గర ఉద్రిక్తతలు ఇదీ సంఘర్షణ..
మ్యాటర్ చూస్తే అంతా నివురుగప్పిన నిప్పులాగే ఉంది.
ఎవరూ వెనక్కు తగ్గట్లేదు. తాడో పేడో చూసుకుందామంటున్నారు.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. మరింత దూకుడు పెంచారు.

కనీసం రోజుకు 3 వేల మంది అక్రమ వలసవాదులను పట్టుకుని.. అరెస్ట్ చేయడమే లక్ష్యం అంటున్నారు. అందుకోసం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ – ICE ని మరింత బలోపేతం చేశారు.


లాస్ ఏంజిల్స్ లో 130కి పైగా దేశాల నుంచి వలసదారులు

లాస్ ఏంజిల్స్ కౌంటీలో 130కి పైగా దేశాల నుంచి వలసదారులు ఉన్నారంటే.. అక్కడ డామినేషన్ ఎవరిది పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ట్రంప్ బాధ. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికాలో స్థిరపడడం ఏంటని అనుకుంటున్నారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే అమెరికానే కబ్జా చేసేస్తారన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే అందరినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.

బలగాలతో వచ్చి, గన్స్ ఎక్కుపెట్టడంతో ఆందోళన

లాస్ ఏంజిల్స్, అమెరికాలో రెండో అతిపెద్ద నగరం. ఇక్కడ జూన్ 6 నుంచి అల్లర్లు, నిరసనలతో హోరెత్తుతోంది. ఈ అల్లర్లకు ముఖ్య కారణం యు.ఎస్. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టిన ఆకస్మిక తనిఖీలే. ఈ డిపార్ట్‌మెంట్ అక్రమ వలసదారులను అరెస్టు చేస్తోంది. అయితే సాదాసీదాగా వచ్చి ఉంటే బాగుండేది. కానీ బలగాలతో వచ్చి, గన్స్ ఎక్కుపెట్టి చెకింగ్ చేయడంతో స్థానికంగా భయాందోళనలను పెంచాయి. దీంతో ఏదో జరగబోతోందని ఊహించిన వలసదారులంతా రోడ్డెక్కారు. నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారాయి.

ఆర్మీ ఆపరేషన్ స్టైల్ లో వలసదారులపై ఎటాక్స్

జూన్ 6న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. లాస్ ఏంజిల్స్‌లోని పలు ప్రాంతాలలో అక్రమ వలసదారులను గుర్తించి.. అరెస్టు చేయడానికి ఆర్మీ ఆపరేషన్ స్టైల్‌లో ఎటాక్స్ చేశారు. ఈ దాడులు క్లాత్ గోడౌన్లు, వెస్ట్‌లేక్‌లోని హోమ్ డిపో స్టోర్లు, డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని డ్రెస్ హోల్‌సేలర్ అయిన అంబియన్స్ అప్పారెల్, అలాగే ఇతర డే-లేబర్ సెంటర్లలో జరిగాయి. ICE ప్రకారం ఈ దాడుల్లో వందమందికి పైగా అరెస్ట్ అయ్యారు. అక్రమ వలసదారులకు నాయకత్వం వహించే యూనియన్ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ స్టైల్ ఆపరేషన్, బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్, రైఫిల్స్, ఇలాంటివన్నీ ఆపరేట్ చేయడంతో స్థానికుల్లో భయాందోళన పెరిగింది. అందుకే వలసదారులంతా తిరగబడ్డారు. ఇంకేముంది.. ఇదిగో ఇవే టియర్ గ్యాస్ ప్రయోగాలు, ఉద్రిక్తతలు, కార్లకు నిప్పు.

పారామౌంట్, కాంప్టన్‌ కు వ్యాపించిన ఆందోళనలు

లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ వెలుపల.. వందలాది మంది గుమిగూడుతున్నారు. డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లో మొదలైన నిరసనలు నేషనల్ గార్డ్ రావడం, ఆ తర్వాత లాటినోలు ఎక్కువగా ఉండే పారామౌంట్, పొరుగున ఉన్న కాంప్టన్‌కు వ్యాపించాయి. జూన్ 6న ప్రారంభమైన నిరసనలు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్, ICE అధికారులతో ఆందోళనకారుల ఘర్షణలకు దారి తీశాయి. జూన్ 7న పారామౌంట్, కాంప్టన్ ప్రాంతాల్లో ఫెడరల్ దళాలతో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో నిరసనకారులు కార్లకు నిప్పు పెట్టడం, పోలీసు గుర్రాలపై దాడులతో హింసాత్మక ఘటనలకు దారి తీసింది.

రంగంలోకి.. 2 వేల మంది నేషనల్ గార్డ్స్

లాస్ ఏంజిల్స్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2 వేల మంది నేషనల్ గార్డ్‌ను లాస్ ఏంజిల్స్‌లో మోహరించారు. ఈ చర్యపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా విమర్శించారు. దీన్ని రాష్ట్ర సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్య అని, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారన్నారు.

టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్‌ల వాడకం

నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్‌లను వాడుతున్నారు. అక్రమంగా ప్రవేశించి అల్లర్లు చేస్తున్న వారిని చెదరగొడుతున్నారు. అల్లర్లు లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్‌లేక్, పారామౌంట్, కాంప్టన్ వంటి ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికులు, ముఖ్యంగా వలస సంఘాలు, ఈ దాడులు తమ వాళ్లను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. అయితే ఈ నిరసనలు హింసాత్మకంగా మారడం, నేషనల్ గార్డ్ మోహరించడం, పోలీసుల చర్యలు, మరోవైపు డెమొక్రాట్ల విమర్శలతో గరంగరం అవుతున్నాయి.

నేషనల్ గార్డ్స్ రావాలంటే గవర్నర్ అనుమతి ఉండాల్సిందేనా?

హింసాత్మక వ్యక్తుల్ని అడ్డుకుంటాం. కట్టడి చేస్తాం.. అసలు ఇల్లీగల్ మైగ్రంట్స్ ను తరిమికొడుతాం.. బలగాలను అమెరికా అంతటా దింపుతాం.. ఇదీ ట్రంప్ మాట. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దబాయించడమేంటంటున్నారు. పైగా బైడెన్ పాలన మాదిరిగా స్మూత్‌గా డీలింగ్ ఉండబోదంటూ.. ఘాటుగానే చెప్పేస్తున్నారు. సమాచారం చెప్పకుండా నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజిల్స్‌లో దింపడంపై కాలిఫోర్నియా గవర్నర్ సీరియస్‌గా రియాక్ట్ అయితే.. ఆయన్ను కూడా ట్రంప్ కడిగి పారేశారు. ఇంతకీ నేషనల్ గార్డ్స్ రావాలంటే గవర్నర్ అనుమతి ఉండాల్సిందేనా?

అక్రమ వలసదారులపై ట్రంప్ మరింత కఠినం

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన రెండో టర్మ్‌లో.. అక్రమ వలసలపై మరింత కఠినంగా మారిపోయారు. అందులో భాగంగానే రోజూ వేలాది మందిని అరెస్ట్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పటికే బర్త్‌ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేయడం, హెబియస్ కార్పస్ హక్కును సస్పెండ్ చేయడం వంటి చర్యలను ప్రకటించారు. ఇవి కాస్తా వలసదారుల్లో ఆందోళనను మరింత పెంచాయి. అయితే తాజాగా లాస్ ఏంజిల్స్ లో ఇల్లీగల్ మైగ్రంట్స్‌ను గుర్తించేందుకు సెన్సిటివ్ లొకేషన్స్ అంటే స్కూళ్లు, చర్చిల్లోనూ చెకింగ్స్ చేశారంటున్నారు. ఇది ICE విధానాలకు వ్యతిరేకం. అయినప్పటికీ ట్రంప్ ఒత్తిడితో ఇవన్నీ జరుగుతున్నాయంటున్నారు.

నేషనల్ గార్డ్స్ ను దింపడంపై అభ్యంతరం

వీటికి తోడు నేషనల్ గార్డ్స్ ను కూడా రంగంలోకి దింపారు. నిజానికి రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకుని ఈ బలగాలను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. అయితే ప్రకృతి విపత్తులు, తిరుగుబాట్లు, అల్లర్లు జరిగినప్పుడు, రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కానప్పుడు వంటి అత్యవసర సమయాల్లోనే అధ్యక్షుడు నేరుగా ఈ ట్రూప్స్ ను పంపొచ్చు. అయితే ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లో 2 వేల మంది ప్రత్యేక బలగాలను మోహరించడంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ గరంగరం అవుతున్నారు. రాష్ట్ర సార్వభౌమాధికారంపై దాడిగా విమర్శించారు.

ఇమ్మిగ్రేషన్ అరెస్టులపై రియాక్టైన కమలా హారిస్

1965లో నాటి అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ అలబామాలో పౌర హక్కుల మార్చ్‌ జరిగినప్పుడు గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్‌ను చివరిసారిగా యాక్టివేట్ చేశారు. ఈ ఎపిసోడ్ పై ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌, లాస్‌ ఏంజెల్స్ మేయర్‌ కరెన్‌ బాస్‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరని, ఈ విషయం అందరికీ తెలుసు అని, అందుకే ఫెడరల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుందని రాసుకొచ్చారు. యూఎస్‌ చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా నిరసనలు జరగడమేంటన్నది రిపబ్లికన్ల ప్రశ్న. అంతే కాదు.. లాస్ ఏంజిల్స్‌లో హింసాత్మక వ్యక్తులు ఉన్నారని, వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు ట్రంప్. బైడెన్ పాలనలో ఉన్నట్లుగా అమెరికాను ముక్కలు చేయనివ్వబోమన్నారు.

లాస్ ఏంజిల్స్ లో వలసదారులకు డెమొక్రాట్లు

ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, కాలిఫోర్నియా గవర్నర్ ది డెమొక్రాట్ పార్టీ. అందుకే ఈ పొలిటికల్ డైలాగ్ వార్ నడుస్తోంది. అటు లాస్ ఏంజిల్స్‌లో నివాసం ఉంటున్న మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ ఎపిసోడ్ పై రియాక్ట్ అయ్యారు. ఇమ్మిగ్రేషన్ అరెస్టులు, గార్డుల మోహరింపు భయాందోళనను, విభజనను వ్యాప్తి చేసే అజెండాతో ఉన్నాయన్నారు. ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను కాపాడటానికి నిలబడే వారికి తాను మద్దతు ఇస్తున్నాన్నారు. అదీ మ్యాటర్ లాస్ ఏంజిల్స్ లో వలసదారులకు డెమొక్రాట్లు మొదటి నుంచి సపోర్టివ్‌గా ఉంటూ వచ్చారు. కానీ ట్రంప్ అలా కాదు. ఒక్కొక్కన్ని దేశం నుంచి తరిమేస్తానంటున్నారు.

లాస్ ఏంజిల్స్ లో 130 దేశాల నుంచి వలసలు

నిజానికి లాస్ ఏంజిల్స్‌లో కార్లు తగలబెట్టడం, టియర్ గ్యాస్ ప్రయోగం ఇలాంటివి జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సిటీకి 130 దేశాల నుంచి వలసదారులున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. లాస్ ఏంజిల్స్ కౌంటీలో అతిపెద్ద వలసవాదులు మెక్సికో వాళ్లే. సుమారు 31.9% మంది మెక్సికన్ వాళ్లు ఇక్కడ ఉంటున్నారు. ఇక 6 శాతం మంది ఎల్ సాల్వడోర్ దేశానికి చెందిన వాళ్లు. ఈ దేశం చాలా డేంజరస్. క్రైమ్ కంట్రీ అది. అక్కడి పరిస్థితులు భరించలేక ఇలా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుండొచ్చు.

గ్వాటెమాల దేశస్తులు 3.6% మంది

గ్వాటెమాల దేశస్తులు 3.6% మంది ఉన్నారు. డౌన్‌టౌన్ సమీపంలోని ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆసియా దేశాల నుంచి లాస్ ఏంజిల్స్ వచ్చిన వలసదారులలో ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలో ఫిలిపినో సంఘం అతిపెద్ద విదేశీ సంఘాలలో ఒకటి. అటు చైనీస్ వలసదారులు, ముఖ్యంగా మాంటెరీ పార్క్ వంటి చోట్ల చాలానే ఉన్నారు. 2024 డేటా ప్రకారం సుమారు 50 వేల మంది చైనీస్ వలసదారులు మెక్సికో బార్డర్ ద్వారా యుఎస్‌లోకి ప్రవేశించారు.

లాస్ ఏంజిల్స్ లో 30.50 లక్షల వసలదారులు

వెనిజులాకు చెందిన వలసదారుల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. వీరు ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా యుఎస్‌లోకి వలస వస్తున్నారు. ఇలా చెబుతూ వెళ్తే లాస్ ఏంజిల్స్ కౌంటీలో 130కి పైగా దేశాల నుంచి వలసదారులు ఉన్నారు. అర్మేనియా, ఇరాన్, కొరియా, జపాన్, కంబోడియా, థాయ్‌లాండ్, లెబనాన్, శ్రీలంక వంటి దేశాల నుంచి ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే లాస్ ఏంజిల్స్ కౌంటీలో సుమారు 30 లక్షల 50 వేల మంది దాకా ఇమిగ్రంట్స్ ఉన్నారు.

41% మంది ఆసియా నుంచి వచ్చినవారే

ఇది కౌంటీ జనాభాలో మూడింట ఒక వంతు. వలసదారులలో 49% మంది లాటిన్ అమెరికా నుంచి, 41% మంది ఆసియా నుంచి వచ్చినవారున్నారు. యుఎస్‌లో కోటీ పది లక్షలు ఇల్లీగల్ మైగ్రంట్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటున్నారు. అందుకే అక్కడ తిరుగుబాట్లు ఎక్కువవుతున్నాయి. స్థానిక అమెరికన్ల కంటే వలసదారులు ఎక్కువైతే తిరుగుబాట్లే ఉంటాయి. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్నది అదే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×