Gundeninda GudiGantalu Today episode june 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి పార్లర్కి వెళ్తుంటే ప్రభావతి ఆపుతుంది. నువ్వు ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇస్తుంటావు. కానీ కొందరు ఉన్నారు కూరగాయలకు కానీ, సరుకులకు కానీ.. ఏ దానికి డబ్బులు ఇవ్వరు పైగా నా పేరు పెట్టుకున్నారు అంటూ ఎద్దేవా చేసి మాట్లాడుతుంది. ఇది విన్న మీనా పైకి గదిలోకి వెళ్లి డబ్బులు లెక్కపెట్టి కిందకి వస్తుంది. ప్రభావతి రోహిణి ఇద్దరూ డబ్బులు ఇస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మీనా అన్ని అప్పచెప్పి డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ కోసమైనా కారు నమ్మారు కదా అన్న.. ఇప్పుడు ఆటోతో కష్టపడుతున్నాడు.. కారును కొనిద్దామని అనుకుంటున్నానని అనగానే వాళ్లంతా సంతోష పడతారు. మీనా రాజేష్ దగ్గరకు వెళ్లి బాలుకు సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది. కారకు కావాల్సిన అమౌంట్ ను సర్దుకొని రావాలి అని అనుకుంటుంది. సుమతి సలహా మేరకు అప్పు ఇచ్చే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాకు ప్రభావతి అప్పు ఇవ్వడానికి వచ్చిన మనిషి దురుసుగా ప్రవర్తిస్తాడు. వెటకారంగా సమాధానం చెప్పడంతో ప్రభావతికి కోపం పెరుగుతుంది. ఆ చక్రపాణి మీనా చేత సంతకం పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. మీనా ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్తుంది. మనోజ్ రోహిణి కోసం పార్లర్ కి వెళ్తాడు. అక్కడున్న అమ్మాయితో రోహిణి పిలవమని అడుగుతాడు.. రోహిణి వచ్చే లోపల విజ్జి ఇది ప్రభావతి పార్లర్ కాదని తెలిస్తే మీ ఆయన ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు అని చెప్పగానే రోహిణి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఏంటి మనోజ్ నువ్వు ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది.
ఏం లేదు రోహిణి ఇట్టే వచ్చాను అందుకే చూద్దామని వచ్చాను అని అంటాడు.. ఈ పార్లర్ పేరు ప్రభావతి ఉండాలి కదా ఇప్పుడేంది క్వీన్స్ పార్లర్ అని ఉంది.. పార్లర్ అమ్మేసావా లేకపోతే ఏమైనా జరిగిందా అని ఆరా తీస్తాడు.. ఈ విషయాన్ని నేనే ముందుగా చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. ఇలా వచ్చి తెలుసుకుంటావనుకోలేదు అని రోహిణి మనోజ్ కి పెద్ద స్టోరీ చెప్తుంది. ఎక్కువ డబ్బులు పాపులాటి రావాలని ప్రాంచైజ్ కి ఇచ్చానని అబద్ధం చెప్తుంది. మనోజ్ అది నిజమే అని నమ్ముతాడు. మంచి పని చేసావు నీకు కూడా తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయని రోహిణిని మెచ్చుకుంటాడు.
ప్రభావతి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఈరోజు ఎలాగైనా సరే తేల్చ పడేయాలి అంటూ సీరియస్ గా ఉంటుంది. బాలు ఇంట్లోకి రావడం చూసి ప్రభావతి బాలుని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. నేను నీతో మాట్లాడాలి. ఒక ముఖ్యమైన విషయం నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాలి అంటూ బాలుని నిలదీస్తుంది. ఇంట్లోకి వచ్చిన సత్యంని కూడా ఆపి మీతో కూడా నేను ఈ విషయాన్ని గట్టిగా అడగాలనుకుంటున్నాను అని ప్రభావతి అంటుంది. ఏమైంది ప్రభ ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావ్. దీని గురించి నువ్వు మాట్లాడాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు.
ఈ పూల కొట్టు ఓనర్ ఉంది కదా మీనా మొన్న వచ్చిన డబ్బులు ఇంటికి ఇవ్వడానికి వెళ్ళింది అని ప్రభావతి అంటుంది. అప్పుడే రవి శృతి అక్కడికి వచ్చి అది మీనా డబ్బులు ఏమైనా చేసుకోవచ్చు కదా ఆంటీ అని శృతి అంటుంది. దాని కష్టార్జితం ఇస్తే పర్వాలేదు కానీ ఎక్స్ట్రాగా అప్పు తీసుకొని మరి వెళ్లి ఇచ్చేస్తుంది అని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇంట్లోకి వచ్చిన మీనా ను గట్టిగా నిలదీసి అడుగుతుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏమి దోచిపెట్టడానికి వెళ్లలేదు. నాకు వేరే పని ఉండి అప్పు తీసుకున్నాను అని మీనా అనగానే ప్రభావతి అంత అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నిస్తుంది.. అదేంటో రేపు మీకే తెలుస్తుంది లేండి అని మీనా అంటుంది.
రవి, శృతి, సత్యం, బాలు అందరూ కూడా మీనాకు సపోర్ట్ చేస్తారు.. అయితే మీనా నేనేమీ తప్పు చేయట్లేదు మీరు తప్పు చేశానని అనుకుంటున్నారా అని బాలుని అడుగుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని పాలు అంటాడు. వాళ్లు భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉన్నారు ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆంటీ అని శృతి అడుగుతుంది. మొన్న వాడు కారును అమ్మేసిన డబ్బులు ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఇది పూల కొట్టు మీద వచ్చిన డబ్బుల్ని ఏం చేసిందో చెప్పట్లేదు అని ప్రభావతి సీరియస్ అవుతుంది. ఇక అందరూ మౌనంగా ఉండిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో రోహిణి ను మనోజ్ అడ్డంగా ఇరికిస్తాడు.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..