Ahmedabad plane crash: విధి రాతను ఎవరూ తప్పించలేదు. ఆ సమయంలో ఎక్కడున్నా తన వద్దకు తీసుకుపోతుంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని విషయంలో కూడా అదే జరిగింది. లండన్ టూర్‌ని ఆయన రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. మూడోసారి ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 242 మంది మృత్యువాతపడ్డారు. మృతుల డెడ్‌బాడీలకు ఆసుపత్రుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదిలాఉండగా ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. లండన్ వెళ్లేందుకు ఆయన రెండుసార్లు తన టూర్‌ని క్యాన్సిల్ చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు గురువారం (జూన్ 12)జరిగిన విమాన ప్రమాదంలో రూపాని ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
లండన్‌లో ఉన్న కూతురు, భార్యని కలిసేందుకు మాజీ సీఎం గురువారం లండన్ కు పయనమయ్యారు. వచ్చేటప్పుడు లండన్ నుంచి భార్యను తీసుకురావాలని భావించారట. ఇందుకు కారణాలు లేకపోలేదు. పంజాబ్ లోని లుథియానా అసెంబ్లీకి ఉప ఎన్నికల కారణాలు రెండుసార్లు ఆయన టూర్ వాయిదా పడినట్టు చెబుతున్నాయి.
ALSO READ: బరువు తక్కువ ఇంధన వినియోగం ఎక్కువ, ఘోరానికి కారణం ఇదేనా?
తొలుత జూన్ ఒకటిన భార్యతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉంది. అనుకోకుండా ఆయన పర్యటన వాయిదా పడింది. చివరకు భార్యను లండన్‌కు పంపించారు. జూన్ 5న మరోసారి తన లండన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి లుధియానాలో ఉండిపోవాల్సి వచ్చింది.
మాజీ సీఎం విజయ్ రూపానీ తన అదృష్ట సంఖ్య 1206 గా భావించేవారు. ఆయన సొంత వాహనాలకు అదే నంబర్ ఉండేదని జాతీయ మీడియా వెల్లడించింది. గురువారం విమానం ప్రమాదం నెల, డేటు అదే నెంబర్‌తో కావడంతో అదృష్ట సంఖ్య చివరకు దురదృష్టంగా మారిందని అంటున్నారు కొందరు నేతలు.
జూన్ 9న పంజాబ్ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఆయన లండన్ వెళ్తున్నట్లు అక్కడి నేతలకు తెలిపారు. రూపానీ ఇక లేరన్న విషయాన్ని తాము నమ్మలేకపోతున్నామని పంజాబ్ బీజేపీ ఉపాధ్యక్షుడు సుభాష్ శర్మ తెలిపారు.
విజయ్ రూపాని మృతిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడారు. ఆయన మరణం పార్టీకి తీరని విషాదంగా ప్రస్తావించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా తదితరులు రూపానీ మృతికి సంతాపం తెలిపారు.