Gundeninda GudiGantalu Today episode june 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అప్పు తీసుకోవడం పై ప్రభావతి సీరియస్ అవుతుంది. మీనాను డబ్బుల గురించి గట్టిగానే అడుగుతుంది. కానీ అది మీనా డబ్బులు మీకు అవసరం లేదు అని అనగానే ప్రభావతి సైలెంట్ అవుతుంది. సత్యం మీనా పొదుపు గల అమ్మాయి ఎప్పుడూ డబ్బులని వృధా చేయదు ఇది గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది అని ప్రభావతికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోజ్ ఇంటికి రాగానే హడావిడిగా అందరిని పిలుస్తాడు. ప్రభావతి సత్యం ఏమైంది అని అడుగుతారు.. మీకో గుడ్ న్యూస్ అంటాడు. అందర్నీ పిలుస్తాడు..బాలు సెటైర్స్ వేస్తుంటాడు. నువ్వు చెప్పురా అంటుంది ప్రభావతి. రోహిణి ఏం చేసిందో తెలుసా అని మనోజ్ అంటే నువ్వు నాన్న డబ్బు కొట్టేసినట్టు పార్లలమ్మ నీ డబ్బు కొట్టేసిందా అని అడుగుతాడు.. నేను చెప్పేది వినరా అని మనోజ్ అంటాడు. రోహిణి వచ్చి అసలు నిజాన్ని చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ అప్పటికే పార్లర్ గురించి ఇంట్లో లీక్ చేస్తాడు.రోహిణి మన పార్లర్ ని ఫ్రాంచైజీకి ఇచ్చింది , క్వీన్ బ్యూటీ పార్లర్ తో మన పార్లర్ కలిపేసింది. ఆ పార్లర్ కి అమ్మపేరు తీసేశారు ఇప్పుడు అంటాడు. అంతే షాక్ అవుతుంది ప్రభావతి. ఇదిగో రోహిణి వచ్చింది కదా తాను చేసిన గొప్ప పని ఏంటో తన నోటితోనే చెబుతుందని మనోజ్ రోహిణి అడ్డంగా ఇరికిచ్చేస్తాడు. బాలు హమ్మయ్య ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలో అనుకున్నాను మొత్తానికైతే ఇలా దొరికిపోయింది అని సంతోషంగా ఫీల్ అవుతాడు.. రోహిణి నువ్వు చేసిన మంచి పని ఏంటో నువ్వే అందరితో చెప్పు అని మనోజ్ అనగానే రోహిణి ముందుగా ప్రభావతికి క్షమాపణ చెప్తుంది. పార్లర్ పేరు మార్చిన విషయాన్ని మీకు ముందు నేను చెబుదామని అనుకున్నాను.. మన బ్రాండ్ ని ఇంకా బిల్డ్ చేసుకున్న తర్వాత మళ్లీ మన పేరుని మనం పెట్టుకోవచ్చు అని రోహిణి చెప్తుంది.. అయితే రోహిణి చెప్పిన మాటని ప్రభావతి మొదటగా విన్నట్లే అనుకుంటుంది.
మీనా ఇదేంటండి చిన్న తప్పు చేసిన అత్తయ్య అందరిని కడిగి పడేస్తుంది కదా.. ఇప్పుడేంటి రోహిణి తన పేరు మీద ఉన్న పార్లర్ పేరుని తీసేసింది కదా.. ఒక్క మాట కూడా అనలేదు ఏంటి అని అంటుంది. దానికి బాలు అప్పుడే ఏమైంది మీనా సునామీ వచ్చే ముందర వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలానే. మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు కచ్చితంగా ఇది పెద్ద రచ్చ చేస్తుంది అని అనగానే రూమ్ లోంచి కేకలు వినిపిస్తాయి. ప్రభావతి దగ్గరికి వెళ్లిన రోహిణి క్షమించండి అత్తయ్య మీకు చెప్పకుండా ఇలాంటి పని చేయడం నాదే తప్పు. నీకు చెబుదామనుకున్నాను కానీ మర్చిపోయాను అని రోహిణి ఏదో కుంటి సాకు చెప్తుంది. నా పేరు మీద ఉన్న పార్లర్ ని తీయాల్సిన అవసరం నీకేంటి అసలు నీకు ఎవరిచ్చారు అధికారం అని రోహిణి పై సీరియస్గా అరుస్తుంది.
ప్రభావతి గొంతు పట్టుకోవడంతో రోహిణి షాక్ అవుతుంది. పార్లర్కి నా పేరు పెట్టుకున్నామని నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతుంది. రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తన మాటే నెగ్గాలని అరుస్తుంది. మలేషియా తెలివితేటలు నా దగ్గర చూపించకు అని ప్రభావతి అంటుంది. ఇదొక్కటే దాచావా ఇంకేదైనా దాచావా అని ప్రభావతి రోహిణిని అడుగుతుంది. ఇంకేదైనా దాచావంటే ముందే చెప్పు ఇంకొకసారి ఇలాంటివి నా దగ్గరకు వస్తే నేను అస్సలు సహించను ఏం చేస్తానో నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది..
రోహిణి పార్లర్కి తన పేరు మార్చిన అన్న విషయం తెలిస్తేనే నన్ను ఇంతగా అనింది. ఒకవేళ నాకు పెళ్లయి కొడుకు ఉన్నాడు అని తెలిస్తే ఇంకేం చేస్తుందో అని భయపడుతుంది. అటు మీనా కారు కండిషన్ చెక్ చేయడానికి బాలుని రాజేష్ తో అక్కడ తీసుకు రమ్మని చెప్తుంది.. కారుని చెక్ చేసి బాలు అంతా బాగుంది చాలా స్మూత్ గా వెళుతుంది అని అంటాడు. మీనా ఆ కారుని బాలుకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటుంది.. అయితే ఉదయం లేవగానే మీనా హడావిడిగా రెడీ అవుతుంది బాలు కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని అంటుంది. ఏమైంది అని బాలు టెన్షన్ పడతాడు. ఆటో దొరికితే గుడికొస్తానని మొక్కుకున్నాను.. భర్త పక్కన లేకుండా భార్య గుడికి వెళ్తే అది అసంపూర్ణంగానే ఉంటుంది. మీనాతో వాదించలేక బాలు మీనా తో గుడికి వెళ్తాడు. అక్కడ అంతా హడావిడి చూసి బాలుకి ఏం జరుగుతుందో అర్థం కాదు.. అయితే చివరికి ఆ కారు మీనా నీకోసం గిఫ్ట్ గా ఇచ్చిందని అక్కడ వాళ్ళు చెప్పడంతో బాలు సంతోషంతో షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..