Gundeninda GudiGantalu Today episode june 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు వల్ల పెద్ద ఆర్డర్ రావడంతో మీనా గుడికి వెళ్తుంది. అక్కడ దైవ దర్శనం చేసుకుంటుంది. బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉన్న మౌనికను చూస్తుంది. మౌనిక నువ్వేంటి ఇక్కడ ఒక్కదానికి వచ్చావా ఏమైంది అని మీనా ఆరా తీస్తుంది. మీనాన్ని చూడగానే మౌనిక కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకుంటుంది. ఏమైంది మౌనిక ఎందుకు బాధపడుతున్నావ్ ఆ సంజయ్ ఏమైనా అన్నాడా నీకు ఏమన్నా అయితే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు ఏమైంది చెప్పు అని నేను అడుగుతుంది.. ఏం లేదు వదిన ఇంట్లో వాళ్ళని చూడకూడదని ఆయన కండిషన్ పెట్టాడు కదా ఒకసారి మిమ్మల్ని చూసే లోపల నాకు అన్ని నాతుకోలేకపోయాను అని కవర్ చేస్తుంది మౌనిక.. అన్నయ్య అంటేనే ఆయన కోపం తప్ప మిగతా ఏమీ లేదు వదినా. అందుకే నన్ను పుట్టింటికి కూడా పంపించట్లేదు అని మౌనిక అంటుంది. మీ అన్నయ్య గురించి నీకు బాగా తెలుసు కదా 24 ఏళ్లు కలిసి పెరిగావు. మీ అన్నయ్య కోపం వల్ల మా తమ్ముడు చెయ్యి విరగొట్టాడు. తన వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఆయనతో కూడా కూర్చొని మాట్లాడితే సమస్య సాల్వ్ అవుతుంది కదా అని మీనా అంటుంది. సరే ఇక నేను పెద్ద ఆర్డర్ వచ్చింది మనుషుల్ని తీసుకొని వెళ్ళాలి అని మీరే చెప్పేసి వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనిక కోసం ఊరంతా గాలిస్తూ ఉంటాడు సంజయ్.. ఇది చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది చచ్చిపోయిందా లేక అవమానం తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. బాలు ఎంజాయ్ కనిపించడంతో ఏమైంది ఎవరి కోసం వెతుకుతున్నాడని ఆరా తీస్తాడు. సంజు పై అనుమానంతో బాలు ఒక వ్యక్తిని అడిగితే అతను ఒక అమ్మాయిని వెతుకుతూ వచ్చాడని నిజం చెప్తాడు. మౌనికకు ఏమైంది అసలు ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అంటూ భయంతో కంగారు పడుతూ మౌనిక వాళ్ళ ఇంటికి బాలు వస్తాడు. సువర్ణను అడుగుతాడు. ఈ దుర్మార్గులు ఏం చేశారో చెప్పండమ్మా మీకు మాత్రమే తెలుసు ఉంటుంది అని అంటాడు.. మీరు ఇలా చెప్తేనే నిజం చెప్పరు కానీ అని మెడ మీద కత్తి పెట్టి నిజం చెప్పమని సంజయ్ ని అడుగుతాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన మౌనిక అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. నువ్వు కనిపించలేదని వీడు ఫోటో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు..
అందుకే నీకు ఏదైనా అయిందేమో అని నేను టెన్షన్ పడుతూ వచ్చేసానమ్మ అని మౌనికతో బాలు అంటాడు. నీకు మౌనిక నాకేం కాలేదు అన్నయ్య నిన్న బయటకి ట్రిప్ కి వెళ్దామని మాట్లాడుకున్నాం దాంట్లో ఇద్దరం చిన్న గొడవపడ్డాము.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉదయాన్నే గుడికి వెళ్లాను. మరి నీ ఫోన్ కి ఏమైంది అని బాలు అడుగుతాడు.. ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నయ్య చూసుకోలేదు అని అంటుంది. బయటికి వెళ్దామని మౌనిక బాలుని బయటకు తీసుకెళ్తుంది.. నిజంగా నీకు ఏమీ కాలేదు కదా మౌనిక అని బాలు అడుగుతాడు. నాకు ఏమీ కాలేదు అన్నయ్య నేను గుడికి వెళ్లాను అక్కడ వదిన కూడా కనిపించింది.
నువ్వేదో పెద్ద ఆర్డర్ ఇప్పిచ్చావంట కదా.. గుడిలో దండం పెట్టుకొని ఆర్డర్ ను మొదలు పెట్టాలని చెప్పింది వదిన చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అనేసి అంటుంది. అయితే నిజంగానే నువ్వు బాగున్నావు కదా అని బాలు మరీ మరీ అడుగుతాడు. మౌనిక నేను చాలా బాగున్నాను నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు అనేసి అంటుంది. బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి మనోజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు.. అయితే అప్పుడే రోహిణికి అప్పచ్చిన గుణ మనుషులు అక్కడ కనిపించి దారుణంగా అవమానిస్తారు.
నువ్వు మన మధ్య ఏ దాపరికలు లేకుండా ఉండాలని అనుకున్నావు.. కానీ ఇప్పుడేమో ఇలా దాస్తున్నావా అని మనోజ్ రోహిణిని అరుస్తాడు.. దానికి రోహిణి నువ్వు దాచిన 40 లక్షలతో పోలిస్తే ఇదేం పెద్ద మ్యాటర్ కాదు లేని మనోజ్ ని అవమానిస్తుంది. ఇక మనోజ్ హర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. రోహిణి ప్రభావతికి ఫేస్ ప్యాక్ వేస్తుంది. రాత్రి అంతా అలానే ఉంటే బాగుంటుందని చెప్తుంది. అనుకోకుండా రాత్రి కరెంటు పోవడంతో ప్రభావతిని చూసి అందరూ దయ్యమని భయపడతారు.. రాత్రిపూట ఇలాంటి ప్రయోగాలు ఏంటి అని అందరూ కంగారుపడుతూ ఉండడం చూసి సత్యం అంటాడు. నీ ఫేస్ ప్యాక్ లు పిచ్చి తో పిల్లల్ని భయపడతావని సత్యం ప్రభావతి పై అరుస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..