BigTV English

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.


ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులకు అభినందనలు తెలిపారు. ప్రజలు కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తయి 12వ ఏటలోకి అడుగుపెడుతోంది.

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధికాభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతినబూనారు.అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనతో అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు.

ALSO READ: జూన్ ఐదున కేబినెట్ భేటీ, రాజీవ్ యువ వికాసం స్కీమ్‌పై చర్చ

తక్కువ సమయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల జీవనవిధానం మెరుగయ్యేలా పాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అటు శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మిగతా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

 

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×