BigTV English

Gundeninda GudiGantalu Today episode: చెల్లెలి కోసం రక్తం చిందించిన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా..

Gundeninda GudiGantalu Today episode: చెల్లెలి కోసం రక్తం చిందించిన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా..

Gundeninda GudiGantalu Today episode march 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజయ్ ఆ బాలు ఉంటే మేము రాలేమండి ఆ బాలు లేకుండా ఉంటేనే వస్తాము మిరే ఆలోచించుకోండి అని నీలకంఠ మంటాడు. ఇక దానికి ప్రభావతి వాడి చెల్లెలి సంతోషం కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడు కదా మీరు వచ్చే టైంకి వాళ్ళ ఇంట్లో ఉండండి అన్నయ్యగారు అని అంటుంది సరే అమ్మ మేము వస్తాము లెండి అని నీలకంఠ మాటిస్తాడు ఇక ప్రభావతి వెళ్తూ వెళ్తూ మొన్న మౌనిక ఇంటికి వచ్చింది మీరు ఆరోజు వచ్చిందే బాగుండేది అల్లుడుగారు అనేసి మౌనిక ను అడ్డంగా ఇరికిస్తుంది.. సత్యం బయటికి వెళ్ళగానే ప్రభావతిని తిడతాడు. డబ్బులు ఇచ్చి వాడే ఫంక్షన్ చేయాలని అంత హడావిడి చేస్తుంటే నువ్వు ఇప్పుడు వాడు రాడు అనేసి అంటున్నావు నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావ్ అతను కన్నతల్లివేనా లేదా రాక్షసి అనేసి ప్రభావతిని సత్యం తిడతాడు. మౌనికనే చూసుకుంటున్నావ్ అని ప్రభావతికి సత్యం క్లాస్ పీకుతాడు. సంజు మౌనిక దగ్గరికి వెళ్లి భర్తని ఇలా కూడా మోసం చేస్తారని నాకు తెలియదు ఇంతలా మోసం చేసావా ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా జరగదు నీ పుట్టింటి వాళ్ళు జీవితాంతం కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అది కదా నాకు కావాల్సింది అంటూ మౌనికకి వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ప్రభావతిని తిడతాడు అసలు నువ్వు తల్లివా లేక రాక్షసివ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కొంచమైన నీకు బుద్ధుందా అంటూ సత్యం అంటాడు. నా కూతురు ఫంక్షను సవ్యంగా జరగాలంటే ఆ బాలు గాడు ఉండకూడదు అది మీరు చెప్తారా లేదా నన్ను చెప్పమంటారా? నేను ఏమి వాణ్ని శాశ్వతంగా వదిలిపెట్టి పొమ్మని చెప్పలేదు ఆ ఫంక్షన్ వరకు వెళ్ళిపొమ్మని చెప్తున్నాను అని ప్రభావతి అంటుంది.. బాలు మాత్రం ఈ ఫంక్షన్ కి డబ్బులు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఇంకా కొన్ని ట్రిప్పులు ఎక్కువగా వేసుకోవాలని అనుకుంటాడు.

చెల్లి మౌనిక తాళి మార్చే ఫంక్షన్ కు కావాల్సిన డబ్బును సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నాడు. అందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. తాను కూడబెట్టిన డబ్బులకు ఇంకా అవసరం పడటంతో డే అండ్ నైట్ కారు డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. తిండి, నిద్ర మానేసి నాన్ స్టాప్ గా రైడ్స్ కొడుతూనే ఉంటాడు. రెండు అరటిపండ్లు తిని కడపునింపుకోవడమే కాకుండా… చెల్లి ఫంక్షన్ ఘనంగా చేయాలనే తపనలో తనకు గాయాలైనా పట్టించుకోడు. బాలు అంత కష్టపడుతుంటే మీనా కూడా చూసి తట్టుకోలేకపోతుంది. భర్త రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఎంతో టెన్షన్ పడుతుంది. బాలు మాత్రం ఫోన్ కూడా మాట్లాడకుండా రైడ్స్ కొడుకుతూ డబ్బులు సంపాదించే లక్ష్యంలో మునిగిపోతాడు.. మొత్తానికి బాలు అనుకున్న విధంగా అధికంగా ట్రిప్పులు వేసుకొని ఇంట్లో ఫంక్షన్ కి కావాల్సిన డబ్బులు ని అరేంజ్ చేస్తాడు.


రాత్రి సత్యం ప్రభావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు బాలు ఈ ఫంక్షన్ కి లేకుండా వెళ్లాలని మీరే చెప్పాలి అది అర్థమవుతుందని ప్రభావతి సత్యంతో అంటుంది కానీ సత్యం మాత్రం అదే ఎలా అని ఆలోచిస్తున్నాను నా వల్ల అయితే కావడం లేదు అని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను అని అంటుంది అప్పుడే మీనా వస్తుంది. ఇది వచ్చింది ఏంటి ఇప్పుడు ఈయన మనసుని మార్చేస్తుందేమో అసలు బాలు గాడు ఉంటే ఈ ఫంక్షన్ జరగదు అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది.

ఏమైంది మీనా ఈ టైంలో ఇంకా నిద్ర పోలేదా అని సత్యం అడుగుతాడు. లేదు మావయ్య ఆయన ఇంకా రాలేదు చెల్లెలి ఫంక్షన్ కోసం డబ్బులు సరిపోట్లేదని ట్రిపుల్ వేసుకొని అక్కడ తిరుగుతున్నట్టు ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోకి బాలు ఇంట్లోకి వస్తాడు. ఏమైందిరా ఇంత ఆలస్యమైంది అంటే చెల్లెలు ఫంక్షన్ కాదు నాన్న అంత డబ్బులు నేనే చూసుకోవాలి కదా తాళి ఆర్డర్ ఇచ్చేసాను బట్టలు అవి మీరే తెచ్చుకోండి క్యాటరింగ్ చెప్పేసాను ఫుడ్ ఇంట్లో చేయాల్సిన పనేలేదు మొత్తం వాళ్ళు తెచ్చిస్తారు అని బాలు తాను చేసిన పనులు గురించి చెప్తూ ఉంటాడు.

ప్రభావతి మాత్రం అర్ధరాత్రి అయిన కొడుకు ఇంటికి రాకపోయినా ఏమాత్రం దిగులు చెందదు. హాయిగా పడుకున్నట్టు నటిస్తుంది. బాలును ఫంక్షన్ లో అస్సలు ఉండొద్దని సత్యం ఎప్పుడు చెబతాడా? అనే ధ్యాసలో ఉంటుంది. ఇక కొడుకు బాలు నిద్రహారాలు మాని పనిచేస్తున్నాడని తెలుసుకొని సత్యం ఎంతో బాధపడుతాడు. పైగా బాలుకే ఫంక్షన్ లో ఉండొద్దని చెప్పడం తనకు శిక్షగానే భావిస్తున్నట్టు లోలోపల కుమిలిపోతాడు. ఇక ఈలోగా బాలు తిరిగి ఇంటి వస్తాడు. తనకోసం ఎదురుచూస్తున్న తండ్రి, భార్య మీనాను చూసి ఎందుకు ఇంకా పడుకోలేదని అని అడుగుతారు. చెల్లి ఫంక్షన్ ను ఘనంగా చేయడానికి కాస్తా ఓవర్ టైమ్ డ్యూటీ చేశానని, అందుకే ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయ్యిందని బదులిస్తాడు.

ఈ క్రమంలో బాలు చేతికి గాయం తగిలినట్టు మీనా గమనిస్తుంది.. ఇది చిన్న గాయమని మీరంటున్నారు కానీ ఇది చాలా పెద్దగాయమండి అని అనగానే నాకు అస్సలు ఓపిక లేదు నేను వెళ్లి ఫ్రెష్ అవుతాను నాకు అన్నం తీసుకురావని మీ నాకు చెప్పి బాలు లోపలికి వెళ్ళిపోతాడు. చెయ్యి నొప్పితో బాధపడుతున్న బాలుకు మీనా అన్నం తినిపిస్తుంది. మీరు చెల్లెలు కోసం ఎంత చేస్తున్నారు? రేపు ఎవరైనా ఏదైనా అంటే మీరు కోపంతో రెచ్చిపోతారు. అది మాత్రం తగ్గించుకోండి అని మీనా అంటుంది. భార్య చెప్తే వినకుండా ఉంటారా అని బాలు సెటైర్ వేస్తాడు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో.. బాలు ఫంక్షన్ హడావిడి చేస్తాడు. సత్యం బాలు కి నిజం చెప్తాడా లేదా అన్నది చూడాలి..

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×