Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మ చాలా రోజుల తర్వాత ఎఫ్‌ఎం ఆఫీసుకు వెళ్లి ప్రోగ్రాం చేస్తుంది. ఇంట్లో నుంచి ఫ్రోగ్రాం వింటున్న పిల్లలు, నిర్మల, శివరాం ఎగ్జైంటింగ్‌గా ఫీలవుతుంటారు. మనోహరి మాత్రం టెన్షన్ పడుతుంది. అమ్ము హ్యాపీగా ఏయ్ ఫస్ట్ కాల్ ఎప్పుడూ అమ్మ చేసేది కదా..? ఇప్పుడు ఫస్ట్ కాల్ మనం చేద్దామా అంటుంది. అంజు సూపర్ ఐడియా అని ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది. కనెక్ట్ అయిందా అని అమ్ము అడగ్గానే.. అవ్వలేదని డల్లుగా చెప్తుంది అంజు. దీంతో అమ్ము కూడా డల్లుగా అయ్యో ఇన్ని రోజుల తర్వాత తను ఫ్రోగ్రాం చేస్తే ఫస్ట్ కాల్ చేయలేకపోయాము.. అని బాధపడుతుంది. అంజు మాత్రం ఫస్ట్ కాల్ ఎవరిది కనెక్ట్ అయిందో అంటుంది.
మరోవైపు మిస్సమ్మ ఇప్పుడు ఫస్ట్ కాల్ ఎవరు చేశారో చూద్దాం అంటూ కాల్ లిప్ట్ చేసి హలో అంటుంది. అనామిక కాల్ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ అనామిక మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. దీంతో మిస్సమ్మ హలో ఎవరు మాట్లాడుతున్నారు. నా మాట మీకు అని అడుగుతుండగానే.. హలో చెల్లి అని పిలుస్తుంది అనామిక. దీంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంట్లో వింటున్న అందరూ షాక్ అవుతారు. మనోహరి, గుప్త అనామిక దగ్గరకు పరుగెత్తుకెళ్తారు. మిస్సమ్మ ఎమోషనల్‌గా అక్కా అని పిలుస్తుంది. మీరేనా ఎలా ఉన్నారు. ఎక్కడు ఉన్నారు. అసలు ఏమై పోయారు అని అడుగుతుంది. దీంతో అనామిక నేను ఎక్కడికి వెళ్లాను చెల్లి. ఎప్పుడూ నీతోనే ఉన్నాను కదా..? నీకు తోడుగా ఉంటున్నాను కదా..? అని చెప్తుంది. రేడియో అనామిక వాయిస్ విన్న పిల్లలు షాక్ అవుతారు. అంజు ఇది అమ్మ వాయిసే కదా అని అమ్ము అడగ్గానే.. అంజు అవును అమ్ము అసలు చనిపోయిన అమ్మ ఎలా మాట్లాడుతుంది. అని చెప్తుంది. రూంలో ఉన్న శివరాం.. అసలు ఏం జరుగుతుంది నిర్మల. అరుంధతి ఎలా ఫోన్ చేసి మాట్లాడుతుంది అని అడుగుతాడు.
మరోవైపు పైన గుప్త అనామిక శరీరంలోంచి వెంటనే ఆరు ఆత్మ బయటకు వచ్చేలా చేయాలని మంత్రం వేస్తుంటాడు. మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నారు అక్కా నాతో ఉండటం ఏంటి..? అసలు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడగ్గానే.. నేను హైదరాబాద్ లోనే అని చెప్పబోతుంటే ఇంతలో అరుంధతి వచ్చి ఫోన్ లాక్కుంటుంది. వెంటనే కట్ చేస్తుంది. అమర్ ఎమోషనల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో అమ్ము భయంగా అంజలి అసలు ఇది అమ్మ వాయిసేనా..? లేక మనకు అలా అనిపిస్తుందా…? అని అడగ్గానే అంజు లేదు అమ్ము ఇది అమ్మ వాయిసే.. నాకు అమ్మ వాయిస్ తెలియదా..? ఎలా ఎఫ్‌ఎంలకు వచ్చిందో తెలియదు కానీ ఇది కచ్చితంగా అమ్మ వాయిసే అంటుంది. ఆనంద్ కూడా బాధగా అమ్మ వాయిస్ కూడా కన్ఫీజ్ అవుతున్నం. అమ్మ మనకు ఎంత దూరం అయిందో ఇప్పుడు తెలస్తుంది అక్కా అంటాడు. మరోవైపు పైన రూంలో అనామిక ఏమైంది మనోహరి గారు ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు అని అడుగుతుంది. అంత సౌండ్ పెట్టుకుని ఎఫ్‌ఎం వింటున్నావు. పిల్లలు డిస్టర్బ్ అవ్వరా అని చెప్పి వెళ్లిపోతుంది. వెంటనే అక్కడే ఉన్న గుప్త ఆరును పిలుస్తుంటాడు. కానీ గుప్త మాటలు ఆరుకు వినిపించవు.
ఫ్రోగ్రాం కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చిన మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. అమర్ షాకింగ్‌గా ఇంటికి వెళ్దాం పద భాగీ అని చెప్పగానే సరే అంటుంది. మరోవైపు పిల్లలు కిందకు వచ్చి ఎఫ్‌ఎంలో అమ్మ వాయిస్ విన్నామని శివరాం, నిర్మలకు చెప్తారు. ఇంతలో పై నుంచి వచ్చిన అనామిక చనిపోయిన మేడం వాయిస్ విన్నారా..? అని అడుగుతుంది. శివరాం అవునని చెప్తాడు. దీంతో వీళ్లను ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకున్న మనోహరి అదంతా మీ భ్రమ అని ఎందుకంటే ఆ ఫోన్ చేసింది నేనే కాబట్టి అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
తర్వాత మార్కెట్‌కు వెళ్లి వస్తున్న రాథోడ్ లోకి గుప్త ప్రవేశిస్తాడు. వెంటనే అనామిక దగ్గరకు వెళ్లి నీ అవసరం భాగీకి వచ్చిందని వెంటనే రమ్మని అనామికను మిస్సమ్మ దగ్గరకు తీసుకెళ్తాడు. మిస్సమ్మ తాళి బొట్టుకు వెనక భాగంలో సమస్య ఉంది కాస్త చూడు అని చెప్తాడు. సరేనని అనామిక, మిస్సమ్మ దగ్గరకు వెళ్లి తాళి చూస్తుంటే.. ఇంతలో మనోహరి వస్తుంది. వెంటనే మంత్రగాడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?