Gundeninda GudiGantalu Today episode November 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా సత్యంకు జ్యూస్ ఇస్తుంది. ప్రాణాలమీద వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం జ్యుస్ లు ఇస్తున్నావా అని ప్రభావతి నిప్పులు పోసుకుంటుంది. సత్యం తల్లి ఫోన్ చేసి.. అతని యోగక్షేమాలను అడుగుతుంది. తనకు రోజు పీడ కలలు వస్తున్నాయని, తనకు ఆందోళనగా ఉందని చెబుతోంది. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం సెట్ అయిందని సత్యం చెబుతాడు. అయితే.. దీపావళి పండుగకు ఇంటికి రమ్మని సత్యం తల్లి పిలుస్తుంది. కానీ ప్రభావతి రాలేమని చెబుతోంది. తాను రవికి మంచి పిల్లను చూసానని, ఒకసారి ఆ అమ్మాయిని చూడ్డానికి రమ్మని, దీపావళి కూడా అందరం కలిసి చేసుకోవచ్చని చెబుతోంది. తాము సంక్రాంతికి ఎలాగో వస్తామని, ఇప్పుడు అనవసరంగా ఖర్చులు ఎందుకని సత్యం సర్ది చెబుతాడు.. ఇక బామ్మ ప్రభావతి పై సెటైర్స్ వేస్తుంది. మీ అమ్మకు మీనా గురించి నిజం చెబుతాను అని అంటుంది. కానీ వద్దని చెబుతారు. అందరు వస్తామని చెబుతారు. ఇక పార్వతి ఇంటికి వస్తుంది. మీనాను, అల్లుడును దీపావళికి రమ్మని పిలుస్తుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా వాళ్ళ అమ్మ పార్వతి ఇంటికి వస్తుంది.. ఇంటికి ఎందుకు వచ్చారు అని ఆడుతుంది. పార్వతి భయపడుతుంది. అల్లుడు, కూతురుని పండుగకు రమ్మడంతో సత్యం సంతోష పడ్డాడు. అది ఆనవాయితీ, మన సంప్రదాయం. దాంట్లో తప్పేముందమ్మ.. తప్పకుండా తాను బాలు,మీనాలను పండుగకు పంపిస్తానని సత్యం మాటిస్తాడు. దీంతో బాలు .. ఇరకాటంలో పడతాడు. తనకు వెళ్లడం ఇష్టం లేకుండా..తన తండ్రి ఫీల్ అయితాడేమోననీ.. వస్తానని చెబుతాడు. దీంతో మీనా తల్లి సంతోషపడుతుంది.. నాన్నకు ఆరోగ్యం బాగోలేదని అందుకే ఒప్పుకున్న అని అంటాడు బాలు. ఇక రోహిణి ఈవిడ రావడం ఏంటి నాకు ఫిట్టింగ్ పెట్టిందేంటి అని రోహిణి మదన పడుతుంది. ఇక ప్రభావతి కూడా రోహిణిని ఇంటికి వెళ్లమని అడుగుతాడు. దానికి రోహిణి మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ మాటలతో ప్రభావతికి మండుతుంది. ‘మీది ఫలక్నామ ప్యాలెస్ మరి..మీరు ఉండడానికి చోటు ఉండదు. నలుగురు వస్తే ఎక్కడు ఉంటారు’అంటూ పార్వతిని ఎగతాళి చేస్తుంది ప్రభావతి. ఆ మాటలతో సైలెంట్ గా వెళ్లిపోతుంది పార్వతి. ఇలా మీనా అమ్మ వెళ్లగానే..మౌనిక మాట్లాడుతూ.. మీనా వదిన వాళ్ళ అమ్మ అన్నట్లుగా.. మీరు కూడా పండుగకు మలేషియా చూసినట్లు ఉంటుందని అంటుంది. రోహిణి అక్కడ లేని వాళ్ళను ఎక్కడ నుంచి తీసుకురావాలని అంటుంది. లోపలికి వెళ్లిన రోహిణి దగ్గరకు ప్రభావతి, మనోజ్ వెళ్లి అడుగుతారు. రోహిణి భయపడుతుంది. రేపు మా నాన్నతో మాట్లాడి చెబుతాను అని అంటుంది. ఇక రేపు ఉదయం లేవగానే మీనా, బాలు ఇద్దరి పార్వతి ఇంటికి వెళ్తారు. మార్గమధ్యంలో ఆపి.. షాపింగ్ చేస్తారు. ఈ సమయంలో షాప్ కీపర్.. మీనా ను పొగుడుతుంటే.. బాలు కి కోపం వస్తుంది. వాడిని గట్టిగా క్లాస్ పీకుతాడు. షాపింగ్ పూర్తి అయినా తరువాత.. కారులో బయలు దేరుతారు. హ్యాపీగా కారులో వెళ్లుంటే.. సడెన్ గా ఫైనాన్స్ వాళ్లు కారును ఆపుతారు. ఫైనాన్స్ డబ్బులు కట్టలేదనీ, ఆ రోజు సెట్ తో గొడవపడి చాలా పెద్ద తప్పు చేశావ్. అందుకే .. నీ జీవితం రోడ్డుపై పడేలా.. కారు తీసుకరమ్మని సెట్ చెప్పాడని బౌన్సర్స్ చెప్పుతారు..
తన భార్యను వదిలేసి వస్తానని చెప్పిన వినిపించుకోకుండా.. కారును తీసుకుని వెళ్లిపోతారు. ఆరోజు ఇంటి పత్రాలు నాన్నకు ఇచ్చినట్లు చెబితే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని, అంతా నీ వల్లేనే ఇలా జరిగింది. నీ వల్లనే కొట్టాల్సి వచ్చిందనీ, అన్నింటికీ కారణం నువ్వేనంటూ మీనాను బాలు అవమానిస్తాడు. కారును వాళ్ళు తీసుకెళ్లడంతో ఇంటికి వెళ్తే ఇంట్లో అందరు తిడతారు.. అటులో ఇంటికి వెళ్తారు. ఇక పార్వతి ఇంటికి వెళ్ళగానే బాలు సెటైర్స్ వేస్తాడు.నేనేమైనా కొత్త అల్లుడినా దిష్టి తీయడానికి .. కావాలంటే మీ అమ్మాయికి తీయండి దిష్టి.. సాధించింది కదా.. ప్రేమించిన వారికి పెళ్లి చేసింది. ఓ ఇంటి పరువు రోడ్డున పడేసింది’ అంటూ మీనాను మరోసారి అవమానిస్తాడు బాలు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రోహిణి పెద్ద ప్లాన్ వేసిస్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి..