Gundeninda GudiGantalu Today episode November 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా వాళ్ళ అమ్మ పార్వతి ఇంటికి వస్తుంది.. అల్లుడు, కూతురుని పండుగకు రమ్మడంతో సత్యం సంతోష పడ్డాడు. అది ఆనవాయితీ, మన సంప్రదాయం. దాంట్లో తప్పేముందమ్మ.. తప్పకుండా బాలు, మీనాలను పండుగకు పంపిస్తానని సత్యం మాటిస్తాడు. ఇరకాటంలో పడతాడు. తనకు వెళ్లడం ఇష్టం లేకుండా.. తన తండ్రి ఫీల్ అయితాడేమోననీ.. వస్తానని చెబుతాడు. దీంతో మీనా తల్లి సంతోషపడుతుంది.. నాన్నకు ఆరోగ్యం బాగోలేదని అందుకే ఒప్పుకున్న అని అంటాడు బాలు. ఇక పార్వతి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ రోహిణి కొత్తగా పెళ్లయింది కదా వెళ్తున్నావా అని అడుగుతుంది. దాంతో రోహిణి అడ్డంగా బుక్ అవుతుంది. ప్రభావతి ఇద్దరినీ వెళ్లమని అడుగుతుంది.. రేపు చెప్తానని చెప్తుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మీనాను తీసుకొని అత్త ఇంటికి వెళ్తాడు. మధ్యలో చీర కొనుక్కోమని సత్యం డబ్బులు ఇస్తాడు. అక్కడ చీర కొనుక్కొని బాలు మీనా ఇద్దరు బయలు దేరతారు. అయితే షాప్ నుంచి బయట రాగానే షేటు మనుషులు కారును తీసుకొని వెళ్తాము అని అంటారు. ర్యూడ్ గా బిహేవియర్ చేస్తారు. ఇక మీనా పోనివ్వండి అని కారు కీసును ఇస్తారు. ఇక ఆటోలో మీనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. పార్వతి వాళ్ళు అల్లుడు వచ్చాడని హడావిడి చేస్తారు. బాలు మీనా ఇంట్లోనే పరువు తీస్తాడు. మీనాను అబద్దాలు చెప్పేలా ట్రైనింగ్ ఇప్పించారా అని చురకలు అంటిస్తారు. ఇక మీనా పక్కకు తీసుకొని వెళ్తుంది. మీరు నాతో బాగున్నారని అందరు అనుకుంటున్నారు. మీరు ఇలా అనకండి అని అంటుంది. మన ఇంటికి వెళ్ళాక ఎన్ని అయిన తిట్టండి అంటుంది. సరే అలాగే అని అంటాడు. ఇక బాలు సేటు దగ్గరకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాడు..
మీనా లోపలికి రాగానే పార్వతి మొన్న ఫోన్ చేసినప్పుడు అంత బాగానే ఉందన్నావు మరి ఇప్పుడు ఏమైందమ్మా అల్లుడుగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఆయన ఉప్పులంటాడు అమ్మ ఎప్పుడు చిటపట అంటాడు ఎప్పుడు సర్రమని ఉంటాడో తెలియదు అవన్నీ మీరు పట్టించుకోకండి నాకు అలవాటే ఏదైనా కానీ సర్దుకుని బతకడం అలవాటైపోయింది అనేసి మీనా అంటుంది. ఇక బాలు కారును సేటు తీసుకెళ్లడంతో సేటు దగ్గరికి బాలు వెళ్తాడు. అక్కడ అతని మనుషులు లోపలికి రానివ్వరు అది సేటు చూసి లోపలికి రమ్మని బాలుని అంటాడు. డబ్బులు కట్టకుండా నాకు కారును ఊరికే ఇవ్వడం వాళ్లకు నచ్చదు అందుకే కారుని తీసుకొని వచ్చారు నువ్వు నా వాళ్ళ ముందే నన్ను అవమానించావు నా కాళ్లు పట్టుకొని నా జీవితాంతం నాకు కాళ్ళ కింద బతుకుతానని సంతకం చెయ్ అప్పుడు నీకు కారుస్తాను అనేసి అంటాడు. బాలు చేతగానోడైతే నీలా ఉంటాడు నేను చేతనైననుండి నాకు ఏదో ఒక పని చేసుకుని బతుకుతాను నీ కారు వద్దు ఏం వద్దు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు.
ఇక దినేష్ రోహిణి కోసం ప్రభావతి ఇంటిముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. దినేష్ ఎన్నిసార్లు కాల్ చేసినా రోహిణి కాల్ కట్ చేస్తుంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ రోహిణికి ఇంత కూడా లేదు నా ఫోనే కట్ చేస్తుందని దినేష్ కోపంగా ఉంటాడు. ఈ రోహిణికి కి ఎక్కువయింది నా ఫోనే కట్ చేస్తుందా అనేసి అంటాడు.. అప్పుడు రోహిణి అక్కడికి వస్తుంది. అక్కడున్న దినేష్ ని చూసి షాక్ అవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు డబ్బులు ఇచ్చాను కదా అని రోహిణి అడుగుతుంది. వీరిద్దరు మాట్లాడుకోవడం ప్రభావతి చూస్తుంది అది చూసిన రోహిణి షాక్ అవుతుంది. ఇకనుంచి వెళ్ళిపో మా అత్తగారు చూశారు అని లోపలికి వస్తుంది. ఎవరమ్మా అతను అంటే ఎవరు అడ్రస్ కోసం అడుగుతున్నారు అత్తయ్య అనేసి అంటుంది. ఇక మనోజ్ వెళ్తుండగా ప్రభావతి అడుగుతుంది. నువ్వు కొడితే జాబ్ ఏం చేయట్లేదు ఏదో ఒక జాబ్ చూసుకో మీరు ఏంది పక్కన పెట్టేసి ముందు జాబ్ చూసుకో అందరి దగ్గర చులకన అయిపోయా మనము నేను అతిగా చేసి నేను ఇలా చేశాను అని నన్ను అందరూ అంటున్నారు అని ప్రభావతి మనోజ్ కి చివాట్లు పెడుతుంది. రోహిణికి యాక్సిడెంట్ అయిందని రోహిణి వాళ్ళ అమ్మకు దినేష్ ఫోన్ చేసి చెప్తాడు. ఇక మనోజ్ మలేషియా కి వెళ్ళాలా ప్రభావతి ఐడియా ఇస్తుంది. రోహిణిని ఎలాగైనా ఒపించి మలేషియా కెళ్ళమని చెప్తుంది. రోహిణి వింటుంది. ఇక రోహిణి దగ్గరకు వచ్చేసి ప్రభావతి మనోజ్ అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..