ఈ మధ్య నేరగాళ్లు నేరాలలో కొత్త దారులు వెతుకుతున్నారు. సినిమా రేంజ్ లో ప్లాన్లు వేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు. ఆన్ లైన్ మోసాల్లోనే కాకుండా ఆఫ్ లైన్ మోసాల్లోనూ కొత్త మార్గాలను వెతుకుతూ ప్రజలకు వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఇన్ కమ్ టాక్స్ అధికారులం అంటూ ఓ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేశారు. అక్కడితో ఆగకుండా కిడ్నాప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది.
Also read: తిరుపతిలో విషాదం.. ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలు కూడా?
పూర్తి వివరాల్లోకి వెళితే.. రామకుప్పం మండలంలోని కురబనపల్లికి చెందిన గోవిందప్ప ఇంటికి కొంతమంది వచ్చి తాను ఇన్ కమ్ టాక్స్ అధికారులమని బెదింరిచి కుటుంబం మొత్తాన్ని ఏకంగా మూడు కార్లలో ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన తరవాత తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని, సమాచారం అందడంతోనే దాడులు చేశామని బెదిరించారు. దీంతో గోవిందప్ప కుటుంబ సభ్యులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఏం చేయాలో తెలియన స్థితిలో ఉండిపోయారు.
చివరికి వారిని కిడ్నాపర్లకు పోలీసులు కనిపించడంతో వెంటనే రామకుప్పం మండలం కేంద్రంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద గోవిందప్ప కుటుంబాన్ని కారు నుండి దింపేశారు. అనంతరం అక్కడ నుండి వెంటనే పారిపోయారు. ఈ ఘటన జిల్లాలోనే సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నింధితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఇంటికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.