Britain Soldier Ukraine War| రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండగా ఒక యువకుడు తన ప్రియురాలి కోసం యుద్ధం రంగంలో దూకాడు. ఉక్రెయిన్‌కు చెందిన ఒక యువతి కోసం ఆ దేశం తరపున పోరాడేందుకు నిర్ణయించుకున్నాడు. అతిపెద్ద రష్యా సైన్యంతో తలపడ్డాడు. ఆ యువకుడి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ లోని లుటన్ పట్టణానికి చెందిన జేమ్స్ స్కాట్ ఆండర్సన్ అనే 23 ఏళ్ల యువకుడు గత నాలుగేళ్లుగా (2019 నుంచి 2023 వరకు) బ్రిటన్ సైన్యంలో సైనికుడిగా ఉద్యోగం చేశాడు. అయితే సైన్యంలో అతను క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఉద్యోగం కోసం వెతుకుతుండగా.. కొంతమంది బ్రిటన్ మాజీ సైనికులు డబ్బుల కోసం ఉక్రెయిన్ సైన్యంలో పనిచేసేందుకు వెళ్లుతున్నట్లు తెలిసింది.
జేమ్స్ కూడా వారిలాగే ఉక్రెయిన్ సైన్యంతో తాత్కాలికంగా పనిచేసేందుకు నిర్ణయించుకున్నాడు. కానీ ఈ విషయం అతని ఇంట్లో తల్లిదండ్రులకు తెలియడంతో వారు అందుకు ఒప్పుకోలేదు. అతని తండ్రి ఆండర్సన్ సీనియర్ ఉక్రెయిన్ వెళ్లవద్దని ఎంత చెప్పినా జేమ్స్ తాను అనుకున్నదే చేశాడు. అయితే ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్నందున అక్కడికి వెళ్లడానికి ప్రస్తుతం బ్రిటన్ పౌరులకు అనుమతి లేదు. దీంతో జేమ్స్ లుటన్ నుంచి విమానం మార్గంలో పోలాండ్ లోని క్రాకో నగరానికి చేరుకున్నాడు.
ఆ తరువాత క్రాకో నుంచి బస్సులో ప్రయాణించి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నాడు. 2024 మార్చిలో జేమ్స్ ఉక్రెయిన్ లోని అంతర్జాతీయ వాలంటీర్స్ సైనికుల విభాగంలో చేరాడు. అయితే అతను రష్యాతో యుద్ధంలో పాల్గొనలేదు. కేవలం ఉక్రెయిన్ సైనికులకు యుద్ద రంగంలో సాయం అందించే పని చేసేవాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రజలకు చేరువయ్యాడు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని కళ్లారా చూశాడు. అక్కడ ఓ అందమైన యువతితో స్నేహం చేశాడు. ప్రతిరోజు ఆమెతో సమయం గడిపేవాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.
Also Read: ఓలా కస్టమర్‌కు షాక్.. స్కూటర్ ధర రూ.లక్ష.. రిపేరు బిల్లు రూ.90,000..
జూలై 2024లో జేమ్స్ ఉక్రెయిన్ నుంచి బ్రిటన్ లోని తన ఇంటికి నెల రోజులు సెలవు మీద వెళ్లాడు. అక్కడ తన తల్లిదండ్రులతో ఉక్రెయిన్‌లోని తన ప్రియురాలి గురించి చెప్పాడు. ఆ తరువాత ఆగస్టులో తిరిగి ఉక్రెయిన్ వచ్చాడు. కానీ అప్పటికే అతని ప్రియురాలు రష్యా మిస్సైల్ దాడికి చనిపోయింది. దీంతో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉక్రెయిన్ కమాండర్ వద్దకు వెళ్లి తాను రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెప్పాడు.
అలా ఆగస్టు 6న రష్యా భూభాగమైన కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులు చేసి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అయితే ఉక్రెయిన్ కు ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. నెల రోజుల క్రితం ఉత్తర కొరియా నుంచి దాదాపు 10000 మంది సైనికులు రష్యా సైన్యంతో కలిసి కుర్స్క్ పట్టణంలో యుద్ధం చేశారు. ఈ దాడుల్లో జేమ్స్ ఆండ్సన్ ని రష్యా సైనికులు అరెస్టు చేశారు. ఆ తరువాత అతను బ్రిటన్ పౌరుడని తెలుసుకొని.. రష్యా సైన్యం అతనితో ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో జేమ్స్ చేత బలవంతంగా అతని గుర్తింపు గురించి తెలిపి అతడిని విడుదల చేయాలంటే స్వయంగా బ్రిటన్ ప్రభుత్వం చర్చలు జరపాలని రష్యా సైన్యం షరతులు విధించింది. వీడియోలో జేమ్స్ ఏడుస్తూ తనను విడిపించాల్సిందిగా కోరుతున్నాడు.
ఈ వీడియో టెలిగ్రామ్ యాప్ లో వైరల్ కావడంతో జేమ్స్ తండ్రి ఈ వీడియో చూశాడు. ఆ తరువాత బ్రిటన్ ప్రభుత్వంతో తన కొడుకుని విడిపించడానికి సాయం చేయమని కోరాడు. బ్రిన్ ఫారిన్ సెక్రటరీ డేవిడ్ ల్యామీ కూడా ఈ అంశంపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. “జేమ్స్ స్కాట్ ఆండర్సన్ ఒక బ్రిటన్ పౌరుడు, అయితే ప్రస్తుతం అతను రష్యా సైన్యం వద్ద బందీగా ఉన్నాడు. అతడిని విడిపించడానికి ప్రయత్నిస్తాం. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపి.. బందీల విడుదల గురించి నిర్ణయిస్తామని తెలిపారు.