Gundeninda GudiGantalu Today Episode October 2nd:నిన్నటి ఎపిసోడ్ లో మనోజ్ తెచ్చిన కుపన్స్ తో ప్రభావతి ఫ్యామిలీ షాపింగ్ కు వెళ్తారు. అదే షాప్ కు శృతి, రవి, సంజులు వెళ్తారు. శృతితో పెళ్లికి ఒప్పుకుంటాడు రవి.. ఇక ఇంట్లో వాళ్లకు తెలియకుండా కలుసుకుంటారు. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఇక బాలు హెల్ప్ తో ప్రభావతి వాళ్లు బిల్ కడతారు. ఇక శృతి రవిల విషయాన్ని శోభన తెలుసుకుంటుంది.. రవికి తన కూతురుతో తిరిగితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. శృతి రవికి ఫోన్ చేసి రెండు రోజుల్లో పెళ్లి అని చెబుతుంది. ఇక ప్రభావతి తో ఇంటర్వ్యూ కు వెళ్తున్న అని మనోజ్ అంటాడు. ఇంకెప్పుడు వస్తుందని ప్రభావతి అడుగుతుంది. ఇంటర్వ్యూ కు వెళ్ళాలి కారులోనే వెళ్ళాలి అంటాడు. దానికి డబ్బులు కావాలని అడుగుతాడు మనోజ్. ప్రభావతి మనోజ్ పై సెటైర్లు వేస్తుంది. నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో కానీ నిజం చెప్పు రోహిణికి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి దగ్గరకు మనోజ్ వచ్చి డ్యూటీకి వెళ్తున్న అన్నాడు. డ్యూటీ వెతుక్కోడానికి వెళ్తున్నా అని చెప్పు. ఇంకా ఎన్ని రోజులురా. నీకెప్పుడు జాబ్ వస్తుందిరా అని ప్రభావతి అంటుంది. ఎక్కడకు వెళ్లినా ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారమ్మా. నాకు మధ్యలో వదిలేసిన ఎక్స్‌పీరియన్స్ తప్పా ఏం లేదు. అయినా కొన్ని కంపెనీలు చూసి పెట్టాను. కారులో వెళ్లాలి. ఒక ఐదు వందలు ఇవ్వు. ఎండగా ఉంది. ఇంటర్వ్యూకి ఫ్రెష్‌గా వెళ్లాలి అని మనోజ్ అంటాడు. ఎంతకాలం అని రోహిణి దగ్గర నిజం దాస్తావ్. తను దొరకడం నీ అదృష్టం. నెల నెల జీతం ఏం చేస్తున్నావని తనకు డౌట్ రాదా.. ఏం చెబుతావు. నీ జీతం అడిగితే ఏం చెబుతావు అని అంటుంది. మనోజ్ సత్యం దగ్గరకు వెళ్తాడు. అప్పుడే బాలు అక్కడకు వస్తాడు..
సత్యం డబ్బులు లెక్కపెడతాడు. అవి చూసి మనోజ్ తెగ సంతోషంగా అదోలా చూస్తాడు. అది చూసిన బాలు మనోజ్‌ను పక్కకు తిప్పి నాన్న డబ్బులు బయట ఎందుకు లెక్కపెడుతున్నావ్. మటన్ షాప్ ముందు కుక్కలా ఎలా చూస్తున్నాడో చూడు అని బాలు అంటాడు.. వాడేం డబ్బు మొహం చూడనివాడు కాదని ప్రభావతి అంటుంది. దానికి 40 లక్షల మొహం, 17 లక్షల మొహం నువ్ ఎవడు చూడలేదని ఎవరైనా అన్నారా అని బాలు పంచ్ వేస్తాడు. తర్వాత బాలు నీ దగ్గర ఐదు వందలకు చిల్లర ఉందా అని సత్యం బాలును అడుగుతాడు. నేను ఆటోకి వెళ్లాలని అడిగాను అని సత్యం లవ్ లెటర్ గురించి మాట్లాడతారు. సత్యం లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిపోతుంది.
ఏంటి.. నీలవేణి అనే ఒకత్తిని మీరు లవ్ చేశారా అని ప్రభావతి అడుగుతుంది. లవ్ అంటే.. అది అని సిగ్గుపడిన సత్యం.. ఆ నీలవేణి పట్టు పరికిణి, ఓణి వేసుకుని మా ఇంటి ముందు పట్టీలతో గలగల వెళ్లేది. మా ఇంటి కిటికీలోంచి తొంగి చూసేవాడిని అని సత్యం అంటాడు. నువ్వేం తక్కోవాడివి కాదు నాన్నోయ్ అని బాలు అంటాడు. ఊరికే అన్నాను లే అని బాలుతో అంటాడు. ఇక నోట్ల మీద ప్రేమ ఇలానే ఉంటుంది అంటూ పెద్ద చర్చ జరుగుతుంది. నాన్న అని మనోజ్ పిలిస్తే.. ఏరా నువ్ ఆఫీస్‌కు వెళ్లలేదా అని సత్యం అడుగుతాడు. రోజు వెళ్తున్నాను. పది నుంచి సాయంత్రం వస్తున్నాను. ఐదు వందలకు చిల్లర ఉందా అని మనోజ్ అడుగుతాడు. నీకు ఇంకా జీతం రాలేదా అంటే.. ఇవాళ వస్తుందని అబద్ధం చెబుతాడు.
ఇక జీతం రాగానే డబ్బులు రోహిణికి ఇవ్వు అంతా ఖర్చు చెయ్యకుండా ఇవ్వు అంటాడు. ఇక మూడు వందలు ఇవ్వండి అని ప్రభావతి అంటుంది. దాంతో మనోజ్‌కు ఇస్తాడు సత్యం. ఇక వెంటనే మనోజ్ పారిపోతాడు. వీడేంటీ ఐదు వందల నోటు ఇవ్వకుండా వెళ్లాడు అని సత్యం అంటాడు. ఇక బాలును, మీనా ఆగు వెల్దువుకానీ అని ఆపుతుంది. ప్రేమ కథలు ఉన్నాయని బాలు అంటే.. మీనా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మాత్రం గుండెలో నువ్వే ఉన్నావ్ అని బాలు అనడంతో సంతోషిస్తుంది మీనా. తర్వాత బాలు వెళ్లిపోతాడు. కారులో ప్యాసెంజర్ తన భార్యతో ఆఫీస్‌కు వెళ్లి కష్టపడుతున్నట్లు మాట్లాడుతాడు.
ఇక బాలు క్యాబ్ కు మూడు వందలు అయ్యిందని చెబుతాడు. చిల్లర లేదని ప్యాసెంజర్ అంటాడు. ఏడో ఫ్లోర్‌లో ఎవరినైనా ఉంటే తీసుకురండి అని బాలు అంటాడు. ఉద్యోగం పోయి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడ్డాను. నాలాంటి అభాగ్యులు చాలామందే ఉన్నారు. ఎవరినైనా చిల్లర అడిగి తీసుకొస్తాను అని పార్క్‌లోపలికి వెళ్తాడు ప్యాసెంజర్. చిల్లర తీసుకొస్తాడా లేదా అని పార్క్‌లోకి వెళ్తాడు బాలు. అక్కడ అంతా జాబ్ చేస్తున్నట్లు ఫోన్‌లో భార్యలపై అరుస్తుంటారు. అది చూసి బాలు షాక్ అవుతాడు. బాలు ప్యాసెంజర్ వెళ్లి మనోజ్ దగ్గర చిల్లర అడిగి తీసుకుంటాడు.. అది వెళ్లి బాలుకు ఇవ్వగానే నోటు చూసి షాక్ అవుతాడు. ఆ లక్షలు మింగినోడు జాబ్ పోయి ఇక్కడే ఉంటాడా అని లోపలికి వస్తాడు. బాలును చూసిన మనోజ్ పారిపోతాడు. తర్వాత అడుక్కునే వాడి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని ముసుగు కప్పి కూర్చుంటాడు. అక్కడికే బాలు వస్తాడు. పక్కన ఉన్న అతను అడుక్కుంటాడు. అతనికి బాలు డబ్బులు వేస్తాడు..
ఇక పక్కనే ఉన్న వ్యక్తిని చూసిన బాలు ఈ దొరబాబుకు అడుక్కోవడం రాదా. మొహం చూపించట్లేదు అంటే పెద్దరోగమే వచ్చి ఉంటుందని బాలు అంటాడు. దాంతో మనోజ్ తల ఊపుతాడు. ఇంట్లో జీతం ఇవ్వాలి. వడ్డీకి పదివేలు ఇవ్వమని మనోజ్ అడుగుతాడు. ఇంటి అడ్రస్, పార్క్ అడ్రస్, మీ ఆవిడ పార్లర్ అడ్రస్ అన్ని దీంట్లో రాసి ఇవ్వమని అతను చెబుతాడు.. దొంగలకు ఫొటో తీసినట్లు ఏంటీ బ్రో అని మనోజ్ అంటాడు. రవి వార్నింగ్ ఇచ్చిన వినట్లేదని, తన అమ్మాయితో మాట్లాడుతున్నాడని సత్యంతో సురేంద్ర వార్నింగ్ ఇస్తాడు.. రేపటి ఎపిసోడ్ లో శృతి, రవిలు పెళ్లి చేసుకుంటారో చూడాలి..