Hrithik Roshan.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తన అద్భుతమైన నటనతో, పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. భిన్న విభిన్నమైన పాత్రలతో అంతకుమించి అద్భుతమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడం లో ఎప్పుడు ముందుంటారు. అందుకే హృతిక్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఒక్క బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హృతిక్ రోషన్ కి ప్రత్యేక అభిమానులు ఉన్నారనడం లో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఈయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా వైరల్ గా మారుతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారని, ఒక వార్త బయటకు రావడంతో ఈ విషయం కాస్త ఒక్కసారిగా గుప్పుమంది. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ స్వయంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారా..
అసలు విషయంలోకి వెళితే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా హృతిక్ రోషన్ “హ్యాపీ యానివర్సరీ పార్టనర్” అంటూ ఒక పోస్ట్ పెట్టడమే కాదు ఒక అమ్మాయి ఫోటోని కూడా జత చేశారు. అసలు విషయంలోకెళితే హృతిక్ రోషన్ సుస్సానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ , సబా ఆజాద్ కి దగ్గరయ్యారు. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి హృతిక్ ఒక పోస్ట్ పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. హ్యాపీ యానివర్సిరీ పార్టనర్ అంటూ ఒక పోస్ట్ పెట్టడమే కాదు సబా ఆజాద్ తో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. పైగా ఇద్దరు వెకేషన్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో కావడం గమనార్హం.
పార్టనర్ అని సంబోధించడం వెనుక రహస్యం ఏంటి..?
దీంతో ఫోటో షేర్ చేయడం పక్కన ఉంచితే , పార్టనర్ అంటూ సంబోధించడం పైగా యానివర్సరీ కూడా చెప్పడంతో అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఇది అక్టోబర్ నెల. ఇప్పుడు యానివర్సరీ చెప్పాడంటే.. గత ఏడాది అక్టోబర్లో రహస్యంగా వీరు వివాహం చేసుకున్నారా..? అందుకే హృతిక్ ఇలా అన్నాడా..? అందుకే ఈ విషెస్ చెబుతున్నాడా? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గత అక్టోబర్ లోనే వీరి పెళ్లి జరిగి ఉండాలి అని కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
సబా ఆజాద్ గతంలోనే హింట్ ఇచ్చిందా..
ఇదిలా ఉండగా గతంలోనే సబా ఆజాద్ అందరికీ త్వరలో గుడ్ న్యూస్ చెబుతానని ఒక పోస్ట్ పెట్టింది. అయితే అప్పుడు ఎవరూ కూడా దీనిపై పెద్దగా ఆరా తీయలేదు. కానీ తాజాగా హృతిక్ చేసిన పోస్ట్ కి.. గతంలో సబా పెట్టిన పోస్ట్ కి లింక్ ఇదేనా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ గుట్టు వీడాలంటే నిజంగానే వీరికి పెళ్లి జరిగిందా? లేక మరో సందర్భాన్ని ఉద్దేశించి హృతిక్ ఇలా స్పందించాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక మరో పక్క సుస్సానే ఖాన్ ఆర్స్ లాన్ గోనీ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram