Gundeninda GudiGantalu Today Episode 31 st : నిన్నటి ఎపిసోడ్లో.. సత్యం కు సీనియర్ డాక్టర్ పలు పరీక్షలు చేసి అతని కండిషన్ను చెక్ చేస్తాడు . అతనికి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్తాడు. గుండెకు రక్తం సరఫరా చేసే రెండు నాళాలు బ్లాక్ అయ్యాయి అని ప్రస్తుతం అయితే ఒక నాలం అలా స్లోగా వెళుతుందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్తారు . ఈ ఆపరేషన్ చేయాలంటే మొత్తం నాలుగు లక్షల ఒకేసారి కట్టాలి అప్పుడే చేస్తామని డాక్టర్ చెప్తాడు. నాలుగు లక్షల అంటే మాటలు కాదు అని అందరూ మాట్లాడుకుంటారు. ఇంటి పత్రాలను పెట్టి డబ్బులు తీసుకొని రావాలని చెప్తారు. ఇంటికి పత్రాలు లేవు.. దాంతో మళ్లీ హాస్పిటల్ కు వెళ్తాడు బాలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులను తీసుకురావాలని బాలు వెళ్తాడు. సాయంత్రం కల్లా 4 లక్షలు డబ్బులు తీసుకురావాలంటే ఎలా అని ఆలోచిస్తారు.. ప్రభావతి ఏడుస్తుంది. డబ్బు కోసం ప్రభావతి అందరిని అడుగుతుంది. కానీ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తానని బాలు ఇంటికి వెళతాడు. కానీ ఇంటి డాక్యుమెంట్స్ కనిపించవు. కోపంగా హాస్పిటల్‌కు వస్తాడు. ఇంటి పత్రాలను మనోజ్ దొంగతనం చేశాడని బాలు అనుమానపడతాడు. అతడిని నిలదీస్తాడు. ఇంటి పత్రాలను నాన్న నీ భార్యకు ఇస్తే నన్ను అడుగుతావేంటి అని బాలుపై మనోజ్ ఫైర్ అవుతాడు. నలభై లక్షలు పట్టుకొని పారిపోయినోడివి…ఇంటి పత్రాలు ఎత్తుకుపోలేదని గ్యారెంటీ ఏంటి? ఇంట్లో జరిగే ప్రతి తప్పుకు మూల కారణం నువ్వే అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు. ఇద్దరు హాస్పిటల్ లో గొడవ పడతాడు.
మీనానే ఎక్కడో పెట్టింది అని రోహిణి అంటుంది. ప్రతిసారి మనోజ్‌తో గొడవపడటానికి నీకు కారణం కావాలా అంటూ భర్తకు రోహిణి సపోర్ట్‌చేస్తుంది. నా జోలికి వస్తే చంపేస్తానని మనోజ్ కూడా బాలుకు వార్నింగ్ ఇస్తాడు. ఇంటి డాక్యుమెంట్స్ తీయాల్సిన అవసరం నా భర్తకు లేదని రోహిణి అంటుంది.. ఇక అందరు బాలును డబ్బులు తీసుకురావాలి అని అంటారు. ఇక మీనాక్షి కూడా మీనా ఇంటికి వెళ్లి అడుగురా అని అంటుంది. ఇక మీనా కోసం బాలు వెతుకుతూ ఇంటికి వెళ్తాడు.. ఆ తర్వాత గుడికి వెళ్తాడు. అక్కడ కనిపించిన వారిని అడుగుతాడు.
ఇకపోతే మీనా జాతకం చూపించేందుకు జ్యోతిష్యురాలిదగ్గరకు ఆమెను తీసుకొస్తుంది తల్లి. నాకు ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తాను కానీ…నా తండ్రిలాంటి మావయ్యకు ఏం జరగకూడదని జ్యోతిష్యురాలితో అంటుంది మీనా. ఆయన కోలుకుంటారు అందులో సందేహం లేదని జ్యోతిష్యురాలు చెబుతుంది. నీ వల్ల ఎవరికైనా మంచే జరుగుతుందని, కాలమే నిన్ను పరీక్షిస్తుందని అంటుంది. మీనాకు ధైర్యంగా ఉండాలని అంటుంది. ఇక మీనా నాకు ఏమైనా పర్వాలేదు. మా నాన్న స్థానంలో ఉండే మామయ్య కు ఏం కాకూడదని అనుకుంటుంది. ఇక జ్యోతిష్యురాలు మీనాకు ఒక కంకణం ఇచ్చి ఆయనకు కట్టమని చెబుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉంటాడని చెబుతుంది. కంకణం మావయ్య చేతికి ఎలా కడతావు అని మీనాను సుమతి అడుగుతుంది. వాళ్లు నిన్ను హాస్పిటల్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదా అని అంటుంది. ఆ దేవుడే నాకు ఏదో దారి చూపిస్తాడని మీనా అంటుంది. బాలు కొట్టిన, తిట్టిన పట్టించుకోనని, ఎన్ని కష్టాలు పడైనా మావయ్య చేతికి కంకణం కట్టి తీరుతానని హాస్పిటల్‌కు మీనా బయలుదేరుతుంది.
ఇక బాలు డబ్బుల కోసం సేటు దగ్గరకు వెళ్తాడు. అక్కడకు సేట్ మాటలతో బాలు కోపం కంట్రోల్ చేసుకోలేకపోతాడు. మా నాన్న బతకడని ఇంకోసారి అంటే ఊరుకోనని సేట్‌ను కొట్టడానికి వస్తాడు. సేట్ మనుషులు బాలును ఆపేసి బయటకు పంపిస్తారు. తనను కొట్టడానికి వచ్చిన బాలు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతానని అంటాడు.. ఇక బాలు దేవుడు కనిపిస్తే అక్కడకు వెళ్లి ఎమోషనల్ అవుతాడు. మా నాన్నను కాపాడే దారి చూపించమని వేడుకుంటాడు.బాలు కారు కొనడానికి ఓ బేరం వస్తుంది. మూడు లక్షలకు కొంటానని ఓ వ్యక్తివస్తాడు. తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి మౌనిక ద్వారా తెలుసుకొని రవి హాస్పిటల్‌కు వస్తాడు. తండ్రి ఆపరేషన్‌కు అయ్యే డబ్బు తాను కడతానని అంటాడు. రవి ఎంత చెప్పిన వినకుండాఅతడిని హాస్పిటల్ నుంచి గెంటేస్తాడు మనోజ్. ఇక రెండు లక్షలు దొరికాయని చెబుతాడు. మిగిలిన వాటికోసం నా బంగారం ఇస్తాను ప్రభావతి అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..