BigTV English

Spain flash floods : స్పెయిన్‌లో వరద బీభత్సం.. 95 మంది మృతి.. కొట్టుకుపోయిన కార్లు, ఇళ్లు..

Spain flash floods : స్పెయిన్‌లో వరద బీభత్సం.. 95 మంది మృతి.. కొట్టుకుపోయిన కార్లు, ఇళ్లు..

Spain flash floods | యూరోపియన్ దేశమైన స్పెయిన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో స్పెయిన్ లోని వెలెన్షియా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లు, ఇళ్లు, కొట్టుకుపోతుండగా.. పట్టాణాలు మొత్తం నీటమునిగిపోయాయి. ఈ భారీ వినాశనం కారణంగా తాజా వార్తలు అందేవరకు 95 మంది మరణించారు. సోషల్ మీడియాతో డజన్ల సంఖ్యలో వరదల వీడియోలు దర్శనమిస్తున్నాయి. చాలా మంది వరదల్లో చిక్కుక్కుపోయి ఉన్నారు. కొంతమంది వరదల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు చెట్లు ఎక్కారు.


వేలెన్షియా నగర మేయర్ కార్లోస్ మాజోన్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “వరదల వల్ల పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. చలా మంది ఇళ్ల పైకప్పులు, చెట్లపై ఎక్కి కూర్చున్నారు. గత 24 గంటల్లో వారు అదే స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రెస్కూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెస్కూ సిబ్బంది వెళ్లలేక పోతోంది. పౌరులందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దు. ప్రయాణాలు చేయొద్దు. ఇళ్లు కోల్పోయిన వారి కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.” అని చెప్పారు.

Also Read: ‘లైఫ్ జాకెట్ వేసుకుంటే సెల్ఫీ చెడిపోతుంది’.. సముద్రంలో మునిగిపోయిన ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు


స్పెయిన వాతావరణ విభాగం Spain AEMET.. వేలెన్షియా నగరంలో రెడ్ అలర్డ్ ని ప్రకటించింది. దేశంలో గత 8 గంటల్లోనే ఒక సంవత్సరానికి సరిపడ వర్షం కురిసిందని వాతావరణ విభాగం అంచనా వేసింది. వేలెన్షియా లోని టురిస్, చీవా, బ్రునోల్ ప్రాంతాలలో 400 mm (15-3/4 inches) వర్షం నమోదైంది.

రెస్కూ టీమ్స్ తమ వెంట మొబైల్ మార్గ్స్ (శవాల వాహనాలు) తీసుకెళుతున్నాయి అంటేనే తెలుస్తోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని. టురిస్ ప్రాంతంలోని ఒక పౌరుడు డెనిస్ లవాటీ మాట్లాడుతూ.. “మా ఇంటి పరిసరాల్లో వరదలు కాదు.. ఒకే నది ఉధృతంగా ప్రవహించినట్లు కనిపించింది. మేము పక్కింటి వాళ్లు అంతా ఇళ్లపై ఎక్కి చూస్తూ ఉండగానే పదుల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. అంతా మట్టి నీరు ఉధృతంగా ముంచుకొచ్చింది. ఆ ధాటికి పరిసరాల్లోని పెద్ద పెద్ధ చెట్లు వేర్లతో సహా పెకిళి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్ల గోడలు కొట్టకు పోవడం చూశాను. నేను ఒక పెట్రోల్ పంప్ లో పనిచేస్తాను. మా ఇల్లు కూడా కొట్టుకు పోయింది. నేను నా కుటుంబం నేను పనిచేసే పెట్రోల్ స్టేషన్ లో తలదాచుకున్నాం. రాత్రంతా అక్కడే గడిపాము. కానీ ఆ సమయంలో పెట్రోల్ స్టేషన్ డోర్లు ఊడిపోయాయి. చుట్టూ 2 మీటర్ల లోతు నీరు వచ్చేసింది. ఇక ఇదే మా చివరి రోజు అని నిరాశగా ఉన్న సమయంలో సహాయక సిబ్బంది వచ్చి మమల్ని కాపాడింది.” అని చెప్పాడు.

వరదల ధాటికి పంటలు నాశనమయ్యాయి. నిమ్మ, దానిమ్మ, ఆరెంట్ తోటలు నీటమునిగాయి. ప్రధానంగా దేశంలోని 2/3 వంతుల తోటలు నీట మునిగాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు మలాగా ప్రాంతానికి సమీపంలో వెలెన్షియా నుంచి మాడ్రిడ్ నగరానికి వెళ్లే హై స్పీడ్ ట్రైన్ పట్టాలు తప్పి కింద పడింది. అందులో 300 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు.

స్పెయిన్ (SPAIN) ప్రధాన మంత్రి వరదల పరిస్థితిపై స్పందించారు. “వరదల వల్ల స్పెయిన్ నగరాలు నాశనమయ్యాయి. కానీ వాటిని తిరిగి నిర్మిస్తాం. బ్రిడ్జీలు, రోడ్లు అన్ని పున:నిర్మిస్తాం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి పట్ల సానుభూతి తెలియజేస్తున్నాను. వరదల్లో (Floods) చిక్కుక్కుపోయిన వారి కోసం 1000 మంది సైనికులు స్పెయిన్ ఎమర్జెన్సీ రెస్కూ టీమ్స్ తో కలిసి శ్రమిస్తున్నారు. ఇంటి పై కప్పులపై, చెట్లపై ఉన్నవారిని హెలికాప్టర్లతో లిఫ్ట్ చేస్తున్నాము.” అని తెలిపారు.

స్పెయిన్ లో కురిసిన భారీ వర్షాలు వాతావరణంలోని వచ్చే ప్రమాదకర మార్పులకు వల్లే సంభవించాయని యూరోపియన్ వాతావరణ నిపుణులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తరుచూ ఇలాంటి వర్షాలు కురుస్తున్నా తాజాగా కురిసిన భారీ వర్షాలు చాలా తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×