E-Paper
Advertisement

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి
Advertisement

Shoaib Akhtar on Kohli vs Babar:   విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పవాడు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఏ వేదికైనా సరే బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీలు చేసి పాకిస్తాన్ జట్టును గెలిపిస్తాడని పేర్కొంటున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ విరాట్ కోహ్లీ ఆల్ టైం గ్రేటెస్ట్ బ్యాటర్ అంటూ కితాబు ఇచ్చారు. విరాట్ కోహ్లీని కొట్టే మొనగాడు ఎవడు లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కాదని విరాట్ కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చేవాళ్ల‌ను మొదట పిచ్చాసుపత్రిలో వేయాల్సిందేనని హాట్ కామెంట్స్ చేశారు షోయబ్ అక్తర్. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తేనే విరాట్ కోహ్లీ దేవుడిలాగా కనిపిస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో విరాట్ కోహ్లీపై షోయబ్ అక్త‌ర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ కాలి గోటికి కూడా బాబర్ ఆజం పనికిరాడు

విరాట్ కోహ్లీ ఆల్ టైం గ్రేటెస్ట్ ఆటగాడని మరోసారి మాజీ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ల రికార్డులను కూడా అవలీలగా బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడని వ్యాఖ్యానించారు. సెంచరీలలో కూడా సచిన్ రికార్డులు 2027 వన్డే వరల్డ్ కప్ లోపే విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనబడుతున్నాయని వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల వయసులోనూ విరాట్ కోహ్లీ యంగ్ క్రికెటర్ లాగా దూసుకు వెళ్తున్నాడని ప్రశంసించారు. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ అద్భుతమని కొనియాడారు. వెస్టిండీస్ తో జరిగే మరో రెండు వన్డేల్లో కూడా వరుసగా విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేసినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. విరాట్ కోహ్లీ కాలి గోటికి కూడా బాబర్ ఆజం పనికిరాడు అంటూ అక్త‌ర్ ప‌రువు తీసారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

2022 త‌ర్వాత బాబ‌ర్ ఆజం కెరీర్ నాశనం

విరాట్ కోహ్లీ అంత గొప్పవాడు కావాలని బాబర్ ఆజం నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడని షోయ‌బ్ అక్త‌ర్ వెల్లడించారు. అయితే 2022 వరకు బాబర్ ఆజం అద్భుతమైన ప్రదర్శన చేశాడని గుర్తు చేశారు. అప్పటి బాబర్ అత్యంత భయంకరమైన ఆటగాడని కితాబిచ్చారు. అప్పట్లో బాబర్ ఊపు చూసి విరాట్ కోహ్లీ రికార్డులు కూడా బద్దలు కావడం గ్యారెంటీ అని తాను కూడా అనుకున్నట్టు గుర్తు చేశారు. కానీ 2022 తర్వాత ఫామ్ కోల్పోయిన బాబర్ ఆజం కోలుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ బాబర్ ఆజం గాడిలో పడకపోవడం దారుణమన్నారు. కానీ విరాట్ కోహ్లీ అలా కాదని కచ్చితంగా ప్రతి ఇయర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

టీమిండియాకు నరకం చూపించైనా 2027 వరల్డ్ కప్ గంభీర్ అందించేలా ఉన్నాడు

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్

ఫైనల్స్ లో టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్స్ నేల‌కేసి కొట్టండి

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో దిక్కుమాలిన రూల్స్…వర్షం పడితే టీమిండియా పని గోవిందా ?

రియాలిటీ షో చేయాలంటూ రూ.12 కోట్ల ఆఫర్..ఛీ కొట్టిన విరాట్ కోహ్లీ ?

విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రికార్డులు చూసి..సచిన్ కుళ్లుకుంటున్నాడు!

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

Big Stories

Advertisement
×