Illu Illalu Pillalu Today Episode September 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆ చెంబు మేటర్ ఎలాగైనా తేల్చాలని ఆనంద్ రావు సడన్గా ఆ ఇంటికి వస్తాడు. అమ్మాయిని చూడడానికి ఆ ఇంటికి వచ్చాను అని చెప్తాడు. పొద్దయింది కదా మీరు ఇక్కడే ఉండండి అని రామరాజు అంటాడు. ముందుగా శ్రీవల్లి ఆనందరావు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటాడు. ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గర లక్ష రూపాయలు తీసుకొని చందుకి ఇవ్వాలని ఫిక్స్ అవుతాడు.
ప్రేమ మాత్రం కళ్యాణ్ చెప్పినట్లుగా బయటకు వస్తుంది. వీధులన్నీ కాళ్లు అరిగేలా పరుగులు పెడుతుంది ప్రేమ. కళ్యాణ్ ఫోన్ చేసి నాకోసం నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావ్ అయినా నువ్వు టెన్షన్ లో కూడా చాలా అందంగా ఉన్నావ్.. అంటూ కోపం తెప్పించేలా మాట్లాడతాడు..ప్రేమ రాత్రిపూట రోడ్డు మీద తిరగడం చూసిన ధీరజ్ ఏమైంది నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది అదేంటో నాకు చెప్పు అని అంటాడు. కానీ ప్రేమ మాత్రం నీకెందుకు చెప్పాలి రా నువ్వేమైనా పట్టించుకుంటున్నావా అని అంటుంది. విశ్వం ను ప్రేమ కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తిరుపతి మెల్లగా నిద్రలోకి జారుకోవడంతో ఆనంద్ రావు తన పనిని మొదలు పెడతాడు. మొత్తానికి తెల్లవారుజాము కల్లా ఆ చెంబు ని బయటకు తీస్తాడు. అందులోని నగలని శ్రీవల్లి తీసుకుంటుంది కానీ ఆ చెంబుని మాత్రం ఆనందరావు బయటపడేసి వస్తాడు. ఉదయం లేవగానే తిరుపతి చెంబులోంచినా చెయ్యొచ్చేసింది అని ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు. ఇంట్లోనే వాళ్ళందరినీ సంతోషంగా కేకలు వేస్తూ పిలుస్తాడు. నా చెయ్యి చెంబు లో నుంచి బయటకు వచ్చేసింది అని ఆనందంతో గంతులు వేస్తాడు..
అయితే చెంబులోని నగలేవి రాణి రామరాజు అడుగుతాడు.. చెంబు అయితే వచ్చింది బావ నగలు ఎక్కడ పోయాయో నాకు తెలియదు అని అంటాడు. పక్కనే ఉన్న ఆనందరావు తమ్ముడు గారు బయటికి నడుచుకుంటూ వెళ్లడం నేను చూశానండి అక్కడే ఎక్కడ పోయి ఉంటది అని అనడంతో అందరూ ఇల్లంతా వెతుకులాటం మొదలు పెడతారు. అందరూ ఇల్లంతా వెతికి ఎక్కడా లేదని అనుకుంటారు. సాగర్ నర్మద మాత్రం ఈ వెతుకులాట కార్యక్రమంలోని రొమాన్స్ మొదలు పెట్టేస్తారు..
అటు ప్రేమ ధీరజ్ ఇద్దరి మధ్య కోపతాపాలు మొదలవుతాయి. ప్రేమను ఏమైంది అని ధీరజ్ అడుగుతాడు. నీకు నేనంటే ఇష్టం లేదు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా మరి నీకెందుకు చెప్పాలి నేను చెప్పను అని ప్రేమ అంటుంది.. ఇంట్లోని వాళ్లందరూ ఎంత వెతికినా ఆ చెంబు కనిపించదు.. ఆనంద్ రావు శ్రీవల్లి మన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడతారు.. ఆ చెంబు ఇప్పట్లో దొరకదు చెరువులో వేసాను కదా అని ఆనందరావు అంటాడు..
ఇదిగో అమ్మడు నా వంతు నేను చేశాను నీ డైలాగ్ లతో నువ్వు రెచ్చిపో అని ఆనందరావు శ్రీవల్లిని లోపలికి పంపిస్తాడు. అందరూ చెప్పు పోతే పోయింది అందులోని ఖరీదైన నగలు పోయాయి ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం కూల్ గా వచ్చి ఆ నగలను పెట్టుకొని అదృష్టం నాకు లేదు పోతే పోనివ్వండి ఏం చేద్దామని బాధపడుతుంది. ఆ తర్వాత ఆనందరావు కూడా నువ్వేం బాధపడకమ్మా ఎదవ నగలు పోతే పోయినయి అని అంటాడు. కానీ రామరాజు మాత్రం అవేమైనా చిన్నాచితక వస్తువుల నగలు లక్షలు ఖరీదు చేసే నగలు అని అంటాడు.
Also Read : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
ఈ దొంగతనం వెనుక ఏదో కుట్ర ఉంది నాకు అర్థమవుతుంది. కచ్చితంగా ఈ నగలను దొంగతనం చేసిన వ్యక్తిని నేను కచ్చితంగా పట్టుకుంటాను అని రామరాజు చాలెంజ్ చేస్తాడు.. నగలను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను అని రామరాజు అనడంతో ఆనందరావు శ్రీవల్లిలకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..