Gundeninda GudiGantalu Today episode September 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను స్పెషల్ గా వంట చెయ్యమని అడుగుతుంది. అయితే ఆ లిస్ట్ చూసి షాక్ అవుతుంది. బాలు ఇవన్నీ చేయడం నీకు సమస్యగా ఉందా ఏదో ఒకటి చేసి పడేయ్ అనేసి అంటాడు.. నాకు వంట చేయడం ఇబ్బంది కాదండి వాడి నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను అని అంటుంది. ఒక్కొక్కటిగా వంటలు చేసావా అని అడుగుతుంది. మీనాకు ఆర్డర్ వేయడం చూసిన సుశీల అన్ని ఒక్కటే ఎలా చేస్తుంది? నీ అల్లుడికి నువ్వే చూసుకోవాలి కదా కోడలు ఎవరైనా చేస్తారా అని అడుగుతుంది. మీ అల్లుడు నీకు గొప్ప అయినప్పుడు నువ్వే చేసుకోవాలి అంతేకనీ మీనా చేయాల్సిన అవసరం లేదు కదా అని సుశీల అంటుంది..ఆ మాటకి ప్రభావతి షాక్ అవుతుంది. ఇక సంజయ్ కి గది ఇవ్వడం గురించి మాట్లాడుకుంటారు. ఆ రోహిణి మా గదిలో మనోజ్ కి కింద పడుకుంటే నిద్ర రాదు అత్తయ్య. గది ఇవ్వడం కుదరదు. సంజయ్ భోజనాల దగ్గర మౌనిక కుటుంబాన్ని అవమానించిన తీరు అందరికి కోపాన్ని తెప్పించింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ బాలుకు షాక్ ఇవ్వాలని అనుకుంటాడు. కానీ మనోజ్ గదిలోకి వెళ్లి మనోజ్ కి షాకిస్తాడు.. మౌనిక మాత్రం తన కుటుంబంతో సంతోషంగా గడపాలని అనుకుంటుంది.. పైన అందరు ముచ్చట్లు పెట్టుకుంటారు. అక్కడ అందరూ సంతోషంగా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంజయ్ గురించి అందరూ మాట్లాడటం విన్న సంజయ్ మౌనికను కోపంగా రమ్మని పిలుస్తాడు. మొహం మీదే తలుపు వేస్తాడు ఈ క్రమంలో మౌనిక చెయ్యి తలుపు సందులో పడి నలిగిపోతుంది..
అప్పుడే బాలు మీనా అక్కడికి వస్తారు. సంజయ్ ని ఎంత పిలిచినా సరే మౌనిక మాట వినడు. నీకు ఇంటికి పోయిన తర్వాత చుక్కలు చూపిస్తానని లోపలికి వెళ్లి బలవంతంగా తలపెసుకుంటాడు.. ఈ క్రమంలో మౌనిక చెయ్యి తలుపు సందులో పడి నలిగిపోతుంది.. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మీనా అది చూసి నీ చెయ్యి నలిగిపోవడానికి కారణం వాడే కదా వాడంత చూస్తాను అని సంజయ్ పై కోపంతో రగిలిపోతాడు బాలు.. ఆయన ఏదో చూసుకోకుండా వేసాడు అన్నయ్య ఇందులో ఆయన తప్పేమీ లేదు అని మౌనిక అంటుంది.
అది కాదమ్మా వాడి సంగతి నేను చూస్తాను అని బాలు అంటాడు.. ఇదంతా మొగుడు పెళ్ళాలు ఎవ్వరం మనం ఎందుకండి మధ్యలో రండి పైకి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళిపోతాడు.. ఆ సంజయ్ మౌనిక చేయని నలిగేలా చేసాడు. వాడి అంతు చూస్తాను అని బాలు అంటాడు. మాట వినగానే రవి కూడా కోపంతో రగిలిపోతూ వాడికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలి రెచ్చిపోతున్నాడు అని అంటాడు.. మీ ఇద్దరి ఆగండి రా అని సుశీల అంటుంది. ఇద్దరు కాదు ముగ్గురు వాన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాల్సిందే అని శృతి అంటుంది..
Also Read: ఈ వారం దారుణంగా పడిపోయిన సీరియల్స్ రేటింగ్.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?
మౌనిక మనకు చెప్పకుండా వాడు హింసిస్తుంటే ఎందుకు భరిస్తుందిరా.. అలా అయ్యి ఉండదు.. మీనా చెప్పిందే కరెక్ట్.. చూసుకోకుండా తలుపు వేసి ఉంటాడు.. వేళ్లు నలిగి ఉంటాయి.. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు అని సుశీల ఇద్దరు మన వల్ల ఆవేశాన్ని తగ్గిస్తుంది. మౌనికను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఈ విషయం కనుక ఈయనకు తెలిస్తే ఖచ్చితంగా వాడిని ఇక్కడే చంపేస్తాడని మీనా కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే పెళ్లి రోజు గురించి అందరూ సంతోషంగా వెయిట్ చేస్తూ ఉంటారు. సంజయ్ మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..