BigTV English

Revanth Simplicity: రేవంత్ అందరివాడు.. జనం మెచ్చిన నేత.. ప్రజల హనుమంతు..

Revanth Simplicity:  రేవంత్ అందరివాడు.. జనం మెచ్చిన నేత.. ప్రజల హనుమంతు..

Revanth Simplicity: హంగు లేదు. ఆర్భాటం లేదు. అధికార దర్పం లేదు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం చాలా సింప్లిసిటీతో బాధితులందరికీ దగ్గరికీ వెళ్లారు. చీఫ్ మినిస్టర్ అని కాకుండా కామన్ మ్యాన్ లా అందరినీ పలకరించారు. చుట్టూ పోలీసులు, బారికేడ్లు లేనే లేవు. అడ్డుగోడలన్నీ తొలగించేశారు. నాయకులు, అధికారుల మధ్య ఆయన ఇరుక్కుపోలేదు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లిపోయారు. బాధితులను తన వద్దకు పిలుపించుకోలేదు. ఆయనే బాధితుల వద్దకు వెళ్లిపోయారు. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి పర్యనటలో కనిపించిన సీన్లు.


అధికారుల రిపోర్ట్ పై ఆధారపడకుండా గ్రౌండ్‌కు

ఏసీ రూముల్లో కూర్చుకుని అధికారుల నుంచి రిపోర్టులు తెప్పించుకుని.. అక్కడే రివ్యూలు చేసి సహాయం చేయండని చెప్పేయొచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తీరే వేరు. అధికారుల రిపోర్టులపై ఆధారపడలేదు. వరదలతో ఇబ్బంది పడ్డ కామారెడ్డి ప్రజలు, రైతుల దగ్గరికి నేరుగా వచ్చారు. కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ బస్సు చూశారా.. పేరు ప్రజా సంక్షేమ రథం. ఇది కూడా చాలా సింపుల్ బస్సే. పెద్దగా అధికార దర్పాలు ప్రదర్శించేది లేదు. ఇందులోనే కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు తిరిగారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి పర్యటనలు అంటే భారీ సెక్యూరిటీ, కాన్వాయ్, పోలీసులు, అధికారుల హడావుడి ఇలా చాలానే ఉంటాయ్. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కామారెడ్డిలో మామూలు బస్సులో ప్రయాణించి, అధికారుల రిపోర్టులపై ఆధారపడకుండా స్వయంగా బాధితులతో మాట్లాడారు. ఇది ఆయన్ను పీపుల్స్ సీఎంగా మరో మెట్టు ఎక్కించింది. ఎందుకంటే ఆయన అధికార హోదాను దూరం పెట్టి, ప్రజల కష్టాలను దగ్గరగా చూసే ప్రయత్నం చేశారు.


సీఎం స్వయంగా కాలనీలోకి రావడంతో సంతృప్తి

సీఎం రేవంత్ తన పర్యటనను తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో ప్రారంభించి, లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. బుడిగిడ గ్రామంలో పంట నష్టాన్ని స్వయంగా చూశారు. పొలాల్లోకి వెళ్లారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కామారెడ్డి టౌన్ లోని జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో వరద బాధితులను కలిసి, వారికి ధైర్యం చెప్పారు. జీఆర్​ కాలనీలో నీట మునిగిన ఇండ్లను చూశారు. దివ్యాంగురాలు రమ్యతో మాట్లాడారు. జీఆర్ ​కాలనీ, కౌండిన్య, ద్వారకనగర్​ కాలనీలకు చెందిన పలువురు బాధితులు వరదల్లో తాము పడ్డ కష్టాలను నేరుగా సీఎంకు చెప్పుకునే వీలు కల్పించారు. అధికారిక అడ్డుగోడలను పక్కన పెట్టారు. వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కొడంగల్‌తో సమానంగా కామారెడ్డి: రేవంత్

వరదల కారణంగా ఇండ్లు కోల్పోయినవారికి కొత్త ఇండ్లు, పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం, మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం, పశుసంపద కోల్పోయినవారికి సహాయం అందిస్తామని సీఎం రేవంత్ స్వయంగా భరోసా ఇవ్వడం చాలా మందికి సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత కామారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, వరద నష్ట నివేదికలు రెడీ చేయాలని, శాశ్వత పరిష్కారాల కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంతేకాదు సీఎం రేవంత్ స్వయంగా ఓ మాట అన్నారు. కామారెడ్డిని తన సొంత నియోజకవర్గంతో కొడంగల్ సమానంగా చూస్తానని, కొడంగల్‌కు ఎంత సాయం చేస్తానో, కామారెడ్డికి అంతే సాయం చేస్తా అని చెప్పడం కామారెడ్డి వాసులను ఆకట్టుకుంది. ఎందుకంటే ప్రజల సమస్యలను తన సొంత సమస్యగా తీసుకున్నారు.

ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించిన సీఎం

మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు సీఎం రేవంత్ స్వయంగా హాజరయ్యారు. అందరినీ సంతోషపెట్టారు. గృహప్రవేశాలకు స్వయంగా సీఎం హాజరవడంతో లబ్దిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సీన్ చూస్తే చాలు.. లబ్దిదారుల ఇంట్లో కింద కూర్చుని మాటా మంతి చాలా మందిని ఆకట్టుకుంది. ఆగస్ట్ లో సీఎం రేవంత్ అమీర్‌పేట పరిధిలోని బుద్దనగర్, గంగూభాయి బస్తీల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ ఏరియాలు వరదలతో ఇబ్బంది పడ్డాయి. సీఎం వెళ్తారని ఎవరూ ఊహించలేదు. కానీ ఆల్ ఆఫ్ సడెన్ గా వెళ్లారు. స్థానికంగా నివాసం ఉండే ఓ పిల్లాడితో కలిసి గల్లీల్లో తిరిగారు సీఎం. ఏడో తరగతి చదివే జస్వంత్ అనే బాలుడి భుజంపై చేయి వేసి కలిసి తిరిగారు. కాలనీ వాసుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి బాలుడ్ని అడిగి తెలుసుకున్నారు. వరద ఇంట్లోకి రావడంతో తన పుస్తకాలు మొత్తం తడిచిపోయాయని బాలుడు సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సో సీఎం అంటే ఏసీ రూములు, సెక్రటేరియట్ ఇది కాదు అని నిరూపించారు.

గతంలో జనంలో పెద్దగా కనిపించని కేసీఆర్

సింప్లిసిటీ విషయంలో ప్రస్తుత సీఎం రేవంత్ కు, మాజీ సీఎం కేసీఆర్ కు చాలా తేడా ఉంది. అప్పట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బయటకు రావడమే చాలా అరుదుగా జరిగేది. ఏదో పెద్ద కార్యక్రమాలు ఉంటే తప్ప బయటకు రాని సందర్భాలు. అయితే ప్రగతి భవన్. లేదంటే ఫాంహౌజ్. ఇక్కడే ఎక్కువగా గడిపిన పరిస్థితి. కొత్త సచివాలయం కట్టే వరకు సెక్రటేరియట్ కే వెళ్లలేదు కేసీఆర్. హైదరాబాద్ కు భారీ వరదలు వచ్చినప్పుడు కూడా కాలు తీసి బయటకు అడుగు వేయలేదు. ఇలాంటి విమర్శలెన్నో ఎదుర్కొన్న పరిస్థితి. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఆప్యాయంగా పలకరించిన సీన్లు. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో చర్చ ఏం జరుగుతోందేంటంటే కేసీఆర్ హయాంలో ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందన్న కంపారిజన్ జరుగుతోంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు పని చేశారు. ఆ టైంలో ఆయన పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో ఉండేవన్న విమర్శలు వచ్చాయి. సీఎం హోదాలో బయటకు రావడమే అరుదు. వస్తే మాత్రం మరో లెవెల్ లో ఉండేది. పైగా జనాన్ని అతి సమీపం నుంచి మాట్లాడించే పరిస్థితి అసలే చేయలేదు.

అదే ఆప్యాయత, అదే కలుపుగోలుతనం

నిజానికి కామారెడ్డిలో వరద బాధితులతో తిరగాల్సింది.. వారి మధ్య ఉండాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అంటే కేసీఆర్. కానీ ఆయన ఫాంహౌజ్ నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. కానీ సీఎంగా, ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఇలా రెండూ రేవంత్ రెడ్డే పోషిస్తున్నారా అన్నట్లుగా కామారెడ్డి పర్యటనలో జనంతో మమేకం అయ్యారు. పెద్ద పదవి రాగానే ప్రజలను దూరంగా ఉంచే పరిస్థితులు ఇవాళ్టి రాజకీయాల్లో ఉన్నాయ్. కానీ రేవంత్ మాత్రం సీఎం అయినా అదే ఆప్యాయత, అదే కలుపుగోలుతనంతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. సో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యత ఏంటంటే.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేలా ఉండాలి. కానీ సీఎంగా ఉన్నప్పుడూ అడుగు బయటపెట్టక, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోనూ అడుగు బయటపెట్టక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కు 2020, 2021 సంవత్సరాల్లో భారీ వరదలు వచ్చాయి. చాలా ఇండ్లు నీట మునిగాయి. మూసీ మహోగ్రరూపంతో ప్రవహించింది. NDRF, ఆర్మీ కూడా వరద సహాయాల్లో పాల్గొన్నాయి. ఆ టైంలో తానున్నానని నాటి సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వలేకపోయారు. ప్రగతి భవన్ నుంచి అడుగు బయటపెట్టలేదు. కేసీఆర్ బయటకు ఎందుకు రాలేదని రిపోర్టర్లు ప్రశ్న అడిగితే.. ఆయన సీఎం మస్తు పనులుంటయ్ అని ఆనాడు కేటీఆర్ సమాధానం చెప్పడం తీవ్ర విమర్శల పాలైంది. అదీ సిచ్యువేషన్.

2023లో భారీ కాన్వాయ్‌తో సోలాపూర్ టూర్

అదే పార్టీ పరమైన కార్యక్రమం ఇది చూడండి.. 2023 జూన్ 26న భారీ కాన్వాయ్ తో కేసీఆర్ సోలాపూర్ వెళ్లారు. ఆ కాన్వాయ్‌లో 600 వాహనాలు వెళ్లాయి. 6 కిలోమీటర్ల పొడవునా ఇదే కాన్వాయ్ కనిపించింది. పార్టీ కార్యక్రమాలకైతే ఒకలా.. ప్రజా సమస్యలకైతే మరోలా ట్రీట్మెంట్ ఏంటని అప్పట్లోనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కేసీఆర్ బయటకు రావాలని, ప్రజల గోడు వినాలని, అందుకు సమయం కేటాయించాలని 2021లో రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చెబుతూ వస్తున్నారు. అయినా సరే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. సో గతంలో కేసీఆర్ పెద్ద కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలు అయితేనే వెళ్లారు. ప్రజల్ని పరామర్శించిన ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. 2021 జూన్ 22న నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో సహపంక్తి భోజనం చేశారు. 23 ఎకరాల్లో 23 రకాల ఫుడ్ ఐటమ్స్ చేశారు. 2,600 మంది గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు. సీన్ కట్ చేస్తే వారి ఇండ్లు పాతవయ్యాయని చెప్పి కూల్చేయించి.. మళ్లీ కట్టించలేని పరిస్థితి. ఈ గ్రామం కూడా ఎర్రవల్లి ఫాంహౌజ్ కు వెళ్లే రూట్లోనే ఉండడంతో ఈ మాత్రం ప్రోగ్రామ్ చేశారన్న విమర్శలు నాడు వచ్చాయి. ఆ తర్వాత ఆ గ్రామస్తులను పట్టించుకోలేదని చాలా సందర్భాల్లో వాపోయారు.

జనంతోనే ఉంటానని బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటన

ఇక ఇప్పటి సీన్ కు వద్దాం.. మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత ఇక జనంలో ఉంటానన్నారు కేసీఆర్. ప్రజల తరపున కొట్లాడుతా అని ఆవేశంగా చెప్పారు. కానీ మళ్లీ సేమ్ సీన్. ఫాంహౌజ్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. వరదలకు కామారెడ్డి, మెదక్, సిద్ధిపేటల్లో తీవ్ర ప్రభావం చూపినా అడుగు బయట పెట్టలేకపోయారు కేసీఆర్. జనం కష్టాలను అడిగి తెలుసుకోలేని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడూ బయటకు రాలే.. ప్రధాన ప్రతిపక్ష నేతగానూ బయటకు రాలేదన్న విమర్శలు పెరుగుతున్నాయ్. పైగా ఇప్పుడు కుటుంబ సమస్యలు పెరిగాయ్. గణపతి హోమం చేసుకుంటున్న పరిస్థితి.

Story By Vidya Sagar, Bigtv

Related News

Bandlaguda Laddu: రికార్డులు బ్రేక్.. బండ్లగూడ జాగీర్ లడ్డూ ఏకంగా రూ. 2.31 కోట్లు

Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం.. రికార్డు బ్రేక్ చేస్తుందా?

Hyderabad: గణేశ్ శోభాయాత్రకు భారీ భద్రత.. 40 లక్షల మంది భక్తుల పాల్గొంటారని అంచనా

Ganesha immersion: గణేష్ నిమజ్జనం.. ఈ మార్గాల్లో అసలు వెళ్లొద్దు.. క్లియర్ కట్ వివరాలు ఇదిగో

CM Revanth Reddy: కేసీఆర్ పాపాలు బయటకు వస్తాయనే.. వీఆర్వో, వీఆర్ఏలను తొలగించాడు: సీఎం రేవంత్

Big Stories

×