Guppedantha Manasu Rishi: బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్లలో స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. గతంలో ప్రారంభమైన సీరియల్స్ ఎన్నో కూడా ఇప్పటికీ అంతే విధమైన టాకుతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి హిట్ సీరియల్స్లలో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో హీరోగా నటించిన రిషి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర.. కన్నడ స్టార్ అయిన ఈ హీరో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగోన్నాడు. తాజాగా ఆయన స్టార్ మా ఛానల్‌లో మళ్లీ మెరిశాడు. కొత్తగా సీరియల్ ఏమీ చేయడం లేదు. కానీ ఓ ఈవెంట్లో సందడి చేశాడు. ప్రస్తుతం ఆ షో ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న ముకేష్..
స్టార్ మా ఛానల్ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు స్పెషల్ ప్రోగ్రాం లను నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈసారి స్టార్ మా చానల్లో మదర్స్ డే సందర్భంగా లవ్ యు అమ్మ అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం లో సీరియల్స్లలో నటిస్తున్న సెలబ్రిటీలు అందరూ తమ తల్లితో హాజరయ్యారు. ఈ ప్రోగ్రాం ప్రోమో ని తాజాగా స్టార్ మా రిలీజ్ చేసింది.. ఆ ప్రోమోలో ముకేష్ మాట్లాడుతూ.. తండ్రి గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవడంతో నెటిజన్లు వీడియోని చూసి కామెంట్లు చేస్తున్నారు..
ముఖేష్ గౌడ వల్ల నాన్న ఈమధ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. మదర్స్ డే నాడు.. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. తన తల్లిలోనే తండ్రిని చూసుకుంటున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ముఖేష్ మాట్లాడుతూ.. నా తండ్రి ఈ మధ్య మరణించాడు. నా తండ్రికి పక్షవాతం వచ్చింది. దాదాపు మూడేళ్ల వరకు ఆయన ఇంట్లోనే మంచానికే పరిమితమయ్యారు. నేను చూపించని డాక్టర్లు అంటూ లేరు అయినా కూడా ఆయన్ని కాపాడుకోలేకపోయాను అంటూ ముఖేష్ ఎమోషనల్ అయ్యాడు.. లైవ్ లోనే తన తల్లిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక ఏజ్‌కి వచ్చిన తరువాత తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నాకు నాన్న లేరు.. మా అమ్మే నా నాన్న అని తన భాధను బయటకు చెప్పి ఏడ్పించాడు. ఆ షోలో ఉన్న వాళ్ళందరూ అతని బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.. మొత్తానికి ఆ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
గుప్పెడంత మనసు సీరియల్..
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు కన్నడ నటుడు ముఖేష్ గౌడ. ఈ సీరియల్‌లో రిషి పాత్రలో ఎమోషన్స్ పండేశాడు. తల్లి జగతితో రిషి కాంబినేషన్ సీన్లు గుండెల్ని పిండేశాయి. ఇక తండ్రి మహేంద్రతో అయితే అసలు వీళ్లిద్దరూ నటిస్తున్నారా? జీవిస్తున్నారా? అనేట్టుగానే ఉండేవి. నిజమైన తండ్రీ కొడుకులు, కొడుకు కోసం ఆరాటపడే తల్లి, మధ్యలో ప్రేమ.. ఇవన్నీ ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకున్నాయి. అందుకే సీరియల్ సక్సెస్ అయ్యింది..