Hyderabad : వాడో కామ పిశాచి. 30 ఏళ్లకే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండో భార్య చాలా అందంగా ఉంటుంది. అతనికి అసూయ పుట్టింది. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తనతోనేనా? ఇంకెవరితోనైనా? అంటూ నిఘా పెట్టాడు. అప్పటికే ఆమెతో ముగ్గురు పిల్లలను కూడా కన్నాడు. అయినా, ఏదో డౌట్. ఆ అనుమానం రోజురోజుకూ పెను భూతంగా మారసాగింది. ఇక లాభం లేదని.. ఇంకో ఇల్లు అద్దెకు తీసుకుని సెకండ్ వైఫ్‌ను అక్కడికి షిఫ్ట్ చేశాడు. కొత్త ఇంట్లో కొత్తగా కాపురం పెట్టినా.. అతడి అనుమానపు పిచ్చి మాత్రం వదలలేదు. అక్కడా భార్యకు తెలీకుండా ఇంటిపై నిఘా ఉంచాడు.
ఇల్లు మార్చి.. ఏమార్చి..
అతడ పేరు జాకీర్ అహ్మద్. రెండో భార్య నాజియాబేగం. రెండు వారాల క్రితమే గోల్కొండ నుంచి జల్‌పల్లి కొత్తాపేట కాలనీకి మకాం మార్చాడు. వచ్చినప్పటి నుంచి భార్యకు డౌట్ రాకుండా ఇంటి చుట్టుపక్కల నక్కి పరిస్థితులను గమనించసాగాడు. తాను లేని టైమ్‌లో ఇంటికి ఎవరైనా వస్తున్నారా? భార్య తనకు తెలీకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తోందా? అంటూ కొన్ని రోజుల పాటు ఆరా తీశాడు. తన రెండో భార్యకు మరొకరితో ఎఫైర్ ఉందని కన్ఫామ్ చేసుకున్నాడు. ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
భార్య చేతి నరాలు కోసేసి..
ఆ రోజు అర్థరాత్రి 11 గంటలకు ఇంటికొచ్చాడు. వచ్చీ రాగానే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ బూతులు తిట్టాడు. భార్య సైతం తిరగబడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతే.. జాకీర్ అహ్మద్ ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. కోపంతో పిచ్చెక్కిపోయాడు. కర్రతో భార్య తలపై గట్టిగా కొట్టాడు. దెబ్బకు ఆమె తల పగిలింది. రక్తం కారి కింద పడింది. అతని కోపం తగ్గలేదు. పక్కనే ఉన్న కిటికీ అద్దాన్ని పగలగొట్టాడు. పగిలిన గాజు ముక్క తీసుకుని.. భార్య చేతి నరాలను కోసేశాడు. రక్తం మడుగులా మారింది. అయినా.. వాడి ఉన్మాదం కంట్రోల్ కాలేదు. చున్నీని ఆమె గొంతుకు బిగించి.. గాలి ఆడకుండా చేసి దారుణంగా చంపేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు అక్కడే ఉన్నారు. ఆ ఘాతుకాన్ని చూడలేక బోరున ఏడ్చారు. వెంటనే అమ్మమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read : ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య..