E-Paper
Advertisement

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!
Advertisement

Amardeep Chowdary: బుల్లితెరపై ప్రసారమైన జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary). ఈ సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెరపై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన అనంతరం బిగ్ బాస్ సీజన్ సెవెన్(Bigg Boss 7) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో అమర్ అద్భుతమైన ఆట తీరును కనబరిస్తూ వచ్చారు. కచ్చితంగా అమర్ కప్పు గెలుస్తారని అందరూ భావించినప్పటికీ ఈయన మాత్రం రన్నర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

బిగ్ బాస్ వల్ల మార్పు ఏం లేదు…

ఇక ఈ సీజన్ లో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ తర్వాత అమర్ ఎలాంటి బుల్లితెర సీరియల్స్ లో నటించలేదు కానీ పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు అలాగే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ ముందు తరువాత అంటూ ఒక కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది అలా మీకు బిగ్ బాస్ ఏ విధంగా ప్లస్ పాయింట్ అయిందనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

బిగ్ బాస్ వెళ్లడానికి ముందే నాకు గుర్తింపు ఉంది…

Advertisement

ఈ ప్రశ్నకు అమర్ సమాధానం చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారందరూ కూడా కొద్దో గొప్పో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారేనని తెలిపారు. నాకు బిగ్ బాస్ వల్ల ఎలాంటి పేరు రాలేదు నాకు పేరు వచ్చిన తర్వాతే బిగ్ బాస్ లోకి వెళ్ళానని తెలిపారు. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తనకు చాలా మంచి గుర్తింపు వచ్చిందని, ఈ సీరియల్ అయిపోయేసరికి నన్ను తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారని అమర్ తెలిపారు. ఇలా బిగ్ బాస్ వెళ్లడానికి ముందే నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది అయితే బిగ్ బాస్ వెళ్లిన తర్వాత కొంచెం కెరియర్ పరంగా రీచ్ వచ్చిందని తెలిపారు.

డబ్బు సంపాదించాలంటే బిగ్ బాస్ వెళ్ళాలి..

బిగ్ బాస్ వెళ్లకు ముందు రెండు రాష్ట్రాలకు తెలిసిన నేను ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తెలిసాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యధావిధిగా నా పనులు నేను చేసుకుంటున్నాను. బిగ్ బాస్ వెళ్లక ముందు నేను యాక్టింగ్ చేసే వాడిని ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నాను. బిగ్ బాస్ వల్ల చాలా మారతాయని అందరూ అనుకుంటారు కానీ ఏది మారదు. అది హౌస్ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది. బిగ్ బాస్ వెళ్లడం మంచిదా? కాదా? అనే ప్రశ్న ఎదురవడంతో అది వాళ్ళ పర్సనల్ విషయమని, బిగ్ బాస్ వెళ్తే డబ్బులు మాత్రం సంపాదించుకోవచ్చు తెలిపారు. డబ్బులు కావాలంటే హౌస్ లోకి వెళ్ళాలి, పేరు పోగొట్టుకోవాలన్నా, లేదా పేరు తెచ్చుకోవాలన్నా బిగ్ బాస్ వెళ్తే చాలు అంటూ అమర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?

Related News

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

Big Stories

Advertisement
×