Virender Sehwag Criticized Hardik Pandya: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తర్వాత టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా (Hardik Pandya), వరుసగా గాయాల బారీన పడుతున్నాడు. తాజాగా హార్దిక్ పాండ్యాకు కుడి మోకాలి గాయం తెరపైకి వచ్చింది. దీంతో టీమిండియా ఏ వర్సెస్ ఆసీస్ ఏ జట్ల మధ్య జరుగనున్న వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. ఇలాంటి తరుణంలో హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ఎగబడిన ఆడిన పాండ్యా..టీమిండియాకు ఆడమంటే పారిపోతున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మొన్నటి వరకు ఐపీఎల్ టోర్నమెంట్ రెస్ట్ లేకుండా ఆడిన పాండ్యాకు ఇప్పుడు వరుసగా గాయాలు అవుతున్నాయని ప్రశ్నించారు. టీమిండియా అంటే బోరు కొట్టిందా ? లేక గాయాల పేరుతో డ్రామాలు ఆడుతున్నావా ? అంటూ మండిపడ్డారు. పాండ్యాకు నిజంగానే గాయం అయిందా ? లేక గేమ్స్ ఆడుతున్నాడా ? దీనిపై బీసీసీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో హార్దిక్ పాండ్యా గాయంపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా ఏ వర్సెస్ ఆసీస్ ఏ మధ్య త్వరలోనే జరుగనున్న వన్డే సిరీస్ నేపథ్యంలో పాండ్యా గాయపడటంపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియాకు నువ్వు పనికిరావు..వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా దిట్టంగా, 100 శాతం ఫిట్ గా ఉన్న నువ్వు…ఇప్పుడు ఎలా గాయపడ్డావు అంటూ నిలదీశారు. టీమిండియా ఏ వర్సెస్ ఆసీస్ ఏ సిరీస్ కోసం సెలక్ట్ అయిన పాండ్యా, చివరి క్షణంలో గాయం బారీన పడటం అనుమానాలకు తావిస్తోందని ఆరోపణలు చేశారు. వన్డే సిరస్ లో 10 ఓవర్లు వేయడానికి పాండ్యా భయపడుతున్నాడా ? లేక టీమిండియా ఆడొద్దని డిసైడ్ అయ్యాడా ? అనే డౌట్ తనకు వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్.
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తర్వాత టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా, మరోసారి గాయం బారీన పడ్డాడు. అతడి కుడి మోకాలి కింద గాయం అయినట్టు తెలుస్తోంది. దీంతో టీమిండియా ఏ వర్సెస్ ఆసీస్ ఏ సిరీస్ నుంచి పాండ్యాను తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మరో మూడు వారాల పాటు పాండ్యా రెస్ట్ తీసుకుంటేనే కోలుకుంటాడని అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2027 వన్డే వరల్డ్ కప్ లో పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఫైనల్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.