Illu Illalu Pillalu Today Episode April 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి కొడుకును తీసుకొని రమ్మని పూజారి చెప్తాడు. దాంతో అక్కడ పెళ్లి కొడుకు లేడని చూసి షాక్ అవుతారు. కానీ పెళ్లి ఆగిపోతుందని అందరు అనుకుంటారు. పెళ్లి ఇష్టం లేదు నా మనసులో వేరే అమ్మాయిని లెటర్లో రాసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విశ్వం క్రియేట్.. అది చూసిన వాళ్ళందరూ రామ్ రాజ్తో సహా అందరూ షాక్ అవుతారు. శ్రీవల్లి మెడలో తాళి కట్టడం ఇష్టంలేకే వెళ్లిపోతున్నట్టుగా చందు రాసినట్టు ఓ లెటర్‌ని క్రియేట్ చేసి.. దాన్ని పెళ్లి కొడుకు గదిలో పెట్టిస్తాడు విశ్వ. ఇక ఆ లెటర్ చూసిన తరువాత.. ఎంత పని చేశావ్ రా పెద్దోడా అని భోరున ఏడుస్తాడు రామరాజు. ఇక పీటలపై పెళ్లి ఆగిపోవడంతో శ్రీవల్లి బాధ అయితే వర్ణణాతీతం. నన్ను వదిలి వెళ్లిపోయాడా? అంటూ భోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇక రామరాజు అయితే.. ఆ పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోతాడు.. అన్నయ్య ఎప్పుడు తప్పు చెయ్యడు అని ధీరజ్ నేను వెళ్లి తీసుకొస్తానని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందుని కిడ్నాప్ చేశామని విషయం బయటపడకుండా చాలా తెలివిగా పథకం రచించాడు విశ్వ. ఈ పెళ్లి ఇష్టం లేదని.. శ్రీవల్లి మెడలో తాళి కట్టడం ఇష్టంలేకే వెళ్లిపోతున్నట్టుగా చందు రాసినట్టు ఓ లెటర్‌ని క్రియేట్ చేసి.. దాన్ని పెళ్లి కొడుకు గదిలో పెట్టిస్తాడు. ఇక ఆ లెటర్ చూసిన తరువాత.. ఎంత పని చేశావ్ రా పెద్దోడా అని భోరున ఏడుస్తాడు రామరాజు. ఇక పీటలపై పెళ్లి ఆగిపోవడంతో శ్రీవల్లి బాధ అయితే వర్ణణాతీతం. నన్ను వదిలి వెళ్లిపోయాడా? అంటూ భోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇక రామరాజు అయితే.. ఆ పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోతాడు..
విశ్వం కు ధీరజ్ ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయడు మీ భద్రతను కిడ్నాప్ చేశాను కావాలంటే కన్ఫామ్ చేసుకో అని మెసేజ్ చేస్తాడు. కానీ విశ్వం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత విశ్వం వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు అత్త ఉంటే ఇవ్వు ఒకసారి మాట్లాడాలని అంటాడు. అత్తలేదు ఇంట్లో చాలా సేపట్నుంచి కనిపించలేదని మీ అమ్మ నాన్నమ్మ చెప్పారు అనేసి చైనా అంటాడు. నిజంగానే టెన్షన్ పడిపోయిన విశ్వం ధీరజ్ కిడ్నాప్ చేశాడని ఆలోచిస్తూ ధీరజ్ కి ఫోన్ చేస్తాడు. మా అన్నయ్య ని కిడ్నాప్ చేసి మా కుటుంబ పరువు తీయాలని చూస్తావా నువ్వు మా అన్నయ్యని వదిలిపెట్టి నేను మీ అత్తయ్యని వదిలిపెడతా అనేసి అంటాడు.
అటు భద్రకు ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రేమ బయటకు వెళదామని అంటుంది. ఎక్కడికి అని చెప్పినా కూడా ప్రేమ చెప్పకుండా ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడూ.. విశ్వ రాగానే చందును తీసుకొని మండపానికి వచ్చేసారు. వాళ్లంతా వెళ్లిపోతుంటారు. ఇంతలో చందుని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు ధీరజ్, ప్రేమలు. వాళ్ల రాకతో రామరాజు పొలంలో మొలకలు వచ్చేస్తాయి. అతనికైతే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. పోనీ వస్తే వచ్చాడని అనుకోకుండా.. ఈ నాన్నా ఆశలపై నీళ్లు చల్లావ్ కదరా.. ఈ నాన్నని నువ్వు కూడా మోసం చేశావా అని అంటాడు రామరాజు..
నా చుట్టూ ఓ కుట్ర జరిగింది నాన్నా.. నాన్నని మానసికంగా చంపడం కోసం ఆ విశ్వక్ గాడు నన్ను కిడ్నాప్ చేశాడు.. సమయానికి తమ్ముడు వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే నేను మీ కళ్ల ముందు ఉండేవాడ్నే కాదు అని అంటాడు. కనీసం ఇప్పుడైనా రామరాజు కళ్లు తెరుచుకుని చిన్నోడు ధీరజ్‌ని క్షమిస్తాడో.. లేదంటే ఎప్పటిలాగే మొత్తం నీవల్లే జరిగింది అని కోడిగుడ్డుకి ఈకలు పీకుతూ నిందలు వేస్తాడో చూడాలి మరి. అన్నట్టు ఆ విశ్వక్ గాడు కిడ్నాప్ చేశాడు అని అనగానే.. సర్వ సమస్యలకు కారణమైన వేదవతి నోరెళ్ల బెట్టింది. అసలు వాళ్లని వీళ్లని కాదుకానీ.. వేదవతిని కిడ్నాప్ చేసి పారేస్తే అసలు ఆ కుటుంబంలో సమస్యలే ఉండవు.. ఇక విశ్వం అసలు విషయం తెలుసుకొని వేదవతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఎమౌతుందో చూడాలి..