BigTV English

Japan Trains In India: ఇండియాకు జపాన్ అదిరిపోయే గిఫ్ట్, రెండు బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Japan Trains In India: ఇండియాకు జపాన్ అదిరిపోయే గిఫ్ట్, రెండు బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Japan Gift: భారత్-జపాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ లో బుల్లెట్ రైలు టెస్టింగ్ కోసం రెండు హైస్పీడ్ షింకన్ సెన్ రైళ్లను గిఫ్టుగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. 2026 ప్రారంభంలో షింకన్ సెన్ E5, E3 సిరీస్ రైళ్లను ఇండియాకు పంపించనుంది. ఈ రైళ్లతో ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ లో ట్రైయల్ రన్స్ తో పాటు టెస్టింగ్ కు ఉపయోగించనున్నారు.


జపాన్ పంపించే రైళ్ల ప్రత్యేకతలు ఇవే!

ముంబై- అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే కారిడార్ ను 2030లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ రూట్ లో అత్యాధునిక E10 సిరీస్ షింకన్ సెన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 2027లోగా ఈ రైల్వే కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర రైల్వేశాఖ టార్గెట్ పెట్టుకుంది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఈ రూట్ లో కీలక ప్రయోగాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం జపాన్ E5, E3 రైళ్లను బహుమతిగా అందించబోతోంది.  E5 సిరీస్ అనేది తూర్పు జపాన్ రైల్వే అభివృద్ధి చేసిన ఆధునిక హై-స్పీడ్ రైలు. 2011లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తొలుత ఈ రైలును ఇండియాలో బుల్లెట్ రైలు సేవలకు ఉపయోగించాలని భావించింది. కానీ, ఆ తర్వాత అత్యాధునికి E10 సిరీస్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.


E10 సిరీస్ బుల్లెట్ రైలు ప్రత్యేకతలు

E10 సిరీస్ రైళ్లను ఆల్ఫా-X అని కూడా పిలుస్తారు. ఈ రైలు గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ జపనీస్ రైలు అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతోంది. ఈ అత్యాధునిక రైళ్లను భారత్ కు అందించేందుకు జపాన్ అంగీకరించింది. అత్యాధునిక టెక్నాలజీ, సేఫ్టీ, కచ్చితమైన వేగంతో ప్రయాణించే రైలు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఈ రైళ్ల ఎంట్రీ కంటే ముందు టెస్టింగ్ కోసం E5, E3 రైళ్లు ఇండియాకు రానున్నాయి. వీటి ద్వారా ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత E10 రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.

బుల్లెట్ రైళ్ల కొనుగోలులో జపాన్ సాయం

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA సాకారం అందిస్తుంది. ఈ సంస్థ తక్కువ వడ్డీతో నిధులు సమకూర్చనుంది. ఈ విధానం ద్వారా సదరు సంస్థ దాదాపు 80% ఖర్చులను భరిస్తుంది. తక్కువ వడ్డీ రేటుతో భారత్ 50 సంవత్సరాలలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా కాపాడుతుంది.

జపాన్ అంతర్జాతీయంగా షింకన్‌ సెన్ టెక్నాలజీని పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు.  గతంలో తైవాన్ హై-స్పీడ్ రైలు నెట్‌ వర్క్ కోసం ఫస్ట్ జెనరేషన్ షింకన్‌ సెన్ రైలును అందించింది. ప్రపంచ వ్యాప్తంగా హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ అభివృద్ధి కోసం మద్దతు ఇస్తోంది.  అందులో భాగంగానే జపాన్ దివంగత మాజీ ప్రధాని షింజో అబేతో భారత ప్రధాని నరేంద్ర మోడీ బుల్లెట్ రైళ్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో కాస్త ఆలస్యం అయ్యింది.

Read Also:  కత్రా- శ్రీనగర్ రూట్ లో కస్టమైజ్డ్ వందే భారత్ రైళ్లు, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×