Indraganti Mohan Krishna : గ్రహణం సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ తర్వాత మాయాబజార్ అనే సినిమాను చేశారు. ఆ తర్వాత చేసిన అష్టాచమ్మా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే నాని యాక్టర్ గా పరిచయమయ్యాడు. నేడు నాని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో నానికి అదే రిలేషన్షిప్ ఉంటుంది. అష్ట చమ్మా తర్వాత సినిమా గోల్కొండ హై స్కూల్. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమంత్ కెరియర్ లో ఉన్న అతి తక్కువ హిట్ సినిమాలలో ఈ గోల్కొండ హై స్కూల్ కూడా ఉంటుంది. ఒక పుస్తకం నుంచి ప్రేరణగా తీసుకొని తీసిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణను తెలుగు ప్రేక్షకులు నుండి పొందింది.
ఇకపోతే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒపీనియన్స్ కూడా కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉంటుంది. కొన్ని సినిమాలను ప్రస్తావించినప్పుడు, పుస్తకాలు గురించి మాట్లాడినప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీరు అర్ధం అవుతుంది. రీసెంట్ గా ఒక డాన్స్ షో కి హాజరు అయ్యారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ డాన్స్ షో లో ఫేమస్ సాంగ్ “ఆహా నా పెళ్ళంట” పాటకు డాన్స్ చేసింది ఒక కంటెస్టెంట్. అయితే ఆ పాటకు అభినయంతో కాకుండా, బెల్లి డాన్స్ స్టెప్స్ వేసింది. అందరిలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఆ డాన్స్ ను ఎంజాయ్ చేసినట్లు ఒక ప్రోమో లో చూపించారు.
అయితే ఆ షో లో డిఫెరెంట్ గా ఉంది ఈ సాంగ్ అంటూ కామెంట్స్ కూడా చేసారు. అయితే ఈ కామెంట్స్ ఇంద్రగంటి మోహనకృష్ణ ను ఇష్టపడే వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించింది.
Also Read : Telugu Director : అసిస్టెంట్స్ ను కొడుతున్న డైరెక్టర్… హీరో పై ఫ్రస్టేషన్ ఇలా చూపిస్తున్నాడా..?
ఇంద్రగంటి రియాక్షన్
దీనిపై ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు. కొన్ని షోస్ కు అతిధులుగా వెళ్ళినప్పుడు మనం అన్ని చెప్పే అవకాశం ఉండదు. అలానే ఆ షోస్ లో మా రియాక్షన్స్ ఒకేసారి తీసుకుంటారు. ఆ రియాక్షన్స్ ను కొన్నిచోట్ల వాడుకుంటారు. వాస్తవానికి ఆ పాటకు కూడా ఆ అమ్మాయి చాలా కష్టపడి డాన్స్ చేసింది. అలానే నాకు ప్రత్యేకంగా బెల్లి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో కూడా నేను డిఫరెంట్ చేసారు అని చెప్పి ఉంటాను తప్ప. ఇంకోలా చెప్పి ఉండను అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : Prabhas: మే 20… ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సర్ప్రైజ్