Illu Illalu Pillalu Today Episode April 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి జరిగేట్టు లేదని.. పెళ్లికి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతుంటారు. ఇంతలో చందుని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు ధీరజ్, ప్రేమలు. వాళ్ల రాకతో రామరాజు పొలంలో మొలకలు వచ్చేస్తాయి. అతనికైతే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. పోనీ వస్తే వచ్చాడని అనుకోకుండా.. ఈ నాన్నా ఆశలపై నీళ్లు చల్లావ్ కదరా.. ఈ నాన్నని నువ్వు కూడా మోసం చేశావా? అని అంటాడు రామరాజు. నాన్న నేను కొడుకుని నాన్న నేను నీ పరువు తీసేలా ఏ రోజు చేయను నా వెనకాల పెద్ద కుట్ర జరిగింది. ఇదంతా ఆ విశ్వకాడే చేశాడు. నేను మానసికంగా చంపేయాలని అనుకున్నాడు కుమిలిపోయేలా చేయాలని నీ పరువు తీయాలని అనుకున్నాడు అని చందు నిజం చెప్తాడు. నావల్ల నీ పరువు పోయేది కానీ తమ్ముడు నీ పరువుని నిలబెట్టడు నాన్న తమ్ముడు లేకుండా నేను కచ్చితంగా చచ్చిపోయే వాడిని చందు టిఆర్ఎస్ గురించి గొప్పగా చెప్తాడు. ఇక పంతులు పెళ్లి ముహూర్తానికి సమయమైంది అనగానే చందు పెళ్లి పీటలు మీద కూర్చుని రామరాజు చెప్తాడు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి పెద్దోడు పెళ్లి అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం మాత్రం తన కూతురికి ఇంటిని మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకోవాలని క్లాసు పీకుతుంది.. ఇంకా చందు చేతిలో శ్రీవల్లిని పెట్టి అప్పగిస్తారు.. తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి కన్నీళ్లు పెట్టుకుంటారు. వీరిద్దరినీ చూసి అక్కడ వాళ్లు అందరు ఎమోషనల్ అవుతారు. ఇక వేదవతి ఇద్దరి కోడళ్లనీ ఇంటికి పంపిస్తుంది. ఇంట్లో పెద్దోడు శ్రీవల్లి వచ్చేలాగా హారతిని ఏర్పరిచాలని ఇంటికి పంపిస్తుంది అయితే తోడుగా ధీరజ్ ను పంపిస్తుంది. ధీరజ్ ప్రేమ గొడవ చూసి నర్మదా షాక్ అవుతుంది. ఏమైంది అంటే ఏం కాలేదు అని అంటారు. కానీ మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటారా అని నర్మదా అడుగుతుంది.
శ్రీవల్లిని అప్పగిస్తూ భాగ్యం కన్నీళ్లు పెట్టుకుంటుంది. వీళ్ళను చూసి సాగర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా చూసిన వారంతా సాగర్ పై సెటైర్స్ వేస్తారు. ఇక శ్రీవల్లిని చందు చేతిలో పెడుతుంది. మా అమ్మిని కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలని అప్పగించి పక్కకు తీసుకెళ్లి నువ్వు చక్రం తిప్పాలి. నేను చూసుకుంటాను అని భాగ్యం అంటుంది.. ఇక వాళ్లను చూసి భాగ్యం పెళ్లి అయితే చేశాను. ఇక పెత్తనం మొత్తం నా కూతురి చేతికి వచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఆనందరావు మాత్రం నువ్వు ఏదైనా చేస్తావు అని అంటాడు..
నర్మదా ప్రేమ ఇద్దరూ ఇంట్లో హారతి ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తూ ఉంటారు. శ్రీవల్లి చాలా అదృష్టవంతురాలు కదా అక్క మనకి దక్కనిది శ్రీవల్లికి దక్కింది సాంద్రతను ఇంట్లో అడుగుపెడుతుంది అనేసి నర్మదా ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటారు. నీకు ఎవ్వరు హారతి ఇవ్వలేదు కదా అని మాట్లాడుకుంటారు.. అవును అక్కా.. నీకు నేను హారతి ఇస్తాను నువ్వు నాకు హారతి ఇవ్వు మన కోరిక తీరుతుంది కదా అంటుంది ప్రేమ..
ఎవరైనా చూస్తే బాగోదు ప్రేమ.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని నర్మద అంటే ఏం పర్లేదు అక్క వాళ్ళు వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది కదా ఆ లోపల నేను నీకు హారతి ఇస్తాను నీ కోరిక తీరుస్తాను నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చదు అనేసి ప్రేమ ఉంటుంది. నర్మద గూడ ముందు వద్దన్నా కూడా ఆ తర్వాత సరదాగా ఉంది కదా అని ఓకే అంటుంది. ఇక ఇద్దరు అనుకున్నట్లుగానే ఒకరికి మరొకరు హారతి ఇవ్వడంతో పాటుగా బ్యాగ్రౌండ్ లో సాంగ్ కూడా వేసుకుంటారు.
ఒకరికి ఒకరు హారతించుకున్న తర్వాత ఎమోషన్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటారు వీళ్లిద్దరిని చూసినా ధీరజ్ మీరిద్దరేంటి ఇందాక నుంచి కౌగిలించుకుంటున్నారు సాంగ్ వేసుకుంటున్నారు ఏడుస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చే టైం అయింది. మీరు హారతి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అనేసి అంటారు.. ఇక కారణం శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నంలో సాగర్ కూడా ఏడుస్తాడు.. మొత్తానికి సరదాగా ఇంటికి చేరుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..