Illu Illalu Pillalu Today Episode April 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ సరదాగా భోజనం చేస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం కింద కూర్చొని భోజనం చేస్తే బాగుంటుందని అంటుంది.. అందరూ సరదాగా కింద కూర్చొని భోజనం చేస్తుంటారు. రామరాజు ఇలా కింద కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత హాయిగా ఉందో అని శ్రీవల్లితో అంటాడు. నేలపై కూర్చుని భోజనం చేస్తారు. సీన్ అయితే చాలా చూడముచ్చటగా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి ఇలా ఒకేచోట కూర్చుని తింటుంటే భలే ఉందమ్మా.. ఇక నుంచి అంతా కలిసి ఇలాగే దిందాం అని అంటాడు రామరాజు. ఇక శ్రీవల్లి కొత్త మొగుడికి తొలి ముద్ద పెట్టి.. వయ్యారంగా వడ్డిస్తుంది. ముచ్చటగా మూడు ముద్దలు తినాలి అంటూ కొసరికొసరి తినిపిస్తుంది. అందరు ఆ సీన్ చూసి మురిసిపోతారు.. శ్రీవల్లి ప్రేమను దారుణంగా అవమానిస్తుంది. వాళ్ళందరూ ఇలానే ఉంటారా అని తిడుతుంది. అది విన్ని బాధపడిన ప్రేమ ధీరజ్ తో అంటుంది. ధీరజ్ మా వదిన దాంట్లో తప్పు లేదు అనడంతో ప్రేమ హర్ట్ అయ్యి వాళ్ళింటికి వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ వెళ్లాలని గీత దగ్గరకి రాగానే ఆగిపోతుంది. నువ్వు అగీత దాటి బయటికి వెళ్లలేవు అని ధీరజ్ అంటాడు. మనము ఇష్టం లేకపోయినా ఆ బంధంలోకి అడుగు పెట్టాము. ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి ఉండాలి నువ్వు వెళ్లాలనుకున్న వెళ్లలేవు అని ధీరజ్ అనగానే ప్రేమ ఆలోచించి లోపలికి వెళ్ళిపోతుంది.. మా వదిన స్థానంలో నువ్వుండి ఆలోచించు అని అనగానే దీరేస్ మాటల్ని ఆలోచించుకుంటూ ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది.
ఇక ధీరజ్ లోపలికి వెళ్ళిపోతుంటే రామరాజు తన మరిదితో మాట్లాడుతున్న విషయాలను వింటాడు.. ఈ పెళ్లి ఇంత బాగా జరగడానికి నా పరువు కాపాడింది నా చిన్న కొడుకే అని సంతోషంగా ఉంటాడు. నా కొడుకు వల్లే నేను ఇలా ఈరోజు ప్రాణాలతో మిగిలి ఉన్నాను. పెళ్లి ఆగిపోయిందని అందరూ నన్ను అవమానిస్తుంటే నేను ఎక్కడ కృంగిపోతాను అని నా చిన్న కొడుకు నేను పెళ్లి సమయానికి అన్నయ్యని తీసుకొస్తాను నాన్న అని వెళ్ళాడు మాట నిలబెట్టుకున్నాడు వాడే నా పరువు నిలబెట్టింది అని గొప్పగా చెప్పుకుంటాడు.
మరి ఈ విషయం ధీరజ్ చెప్పొచ్చు కదా బావ ధీరజ్ని దగ్గరికి తీసుకోవచ్చు కదా అని అంటారు. నా ఇంటి పరువును కాపాడాడు కానీ వాడు నా దగ్గర డబ్బులు తీసుకెళ్లి ఆ ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చాడు అదే నాకు ఇంకా బాధగా ఉంది వాడి మీద కోపం రావడానికి కారణం కూడా అదే రామరాజు అంటాడు. ధీరజ్ నాన్నకు నా మీద కోపం పోయిందని సంతోషంగా ఉంటాడు.
ఇక ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ ఎవరో చేసి ఉన్నారు అని నర్మదా అనుకుంటుంది. పూజ చేసి ఉండడంతో ఎవరు చేశారని ఆలోచించుకుంటూ ఉంటుంది. అటు వేదవతి కూడా ఇంట్లో పనులన్నీ ఎవరు చేశారు పూజ కూడా చేశారు బయట ముగ్గులు వేశారు బహుశా గవర్నమెంట్ కోడలు చేసిందేమో అని అనుకుంటుంది. లోపలికి వెళ్లి చూడగానే అక్కడ ఇంట్లో పనులన్నీ నేనే చేసిందని శ్రీవల్లి ఒప్పుకుంటుంది.
నాకు ఇంట్లో నాలుగు గంటలకు లేసి పనులన్నీ చేయడం అలవాటు అలానే ఇక్కడ కూడా చేశాను మా అమ్మ చెప్పినట్లే చేశాను అని అందరి దగ్గర మొదటి రోజే మార్కులు కొట్టేస్తుంది. శ్రీవల్లి చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ సరదాగా సంతోషంగా ఉంటారు. అందరిని తన తీరుతో బుట్టలో వేసుకుంటుంది శ్రీవల్లి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ధీరాజు ప్రేమను ఆటపట్టిస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..