Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ప్రియాంక చోప్రా కూడా ఒకరు. బాలీవుడ్ బ్యూటీ అయిన ఈమె తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీగా ఇంటర్నేషనల్ వైట్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల పరంగా సక్సెస్ ని అందుకున్న ప్రియాంక చోప్రా కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంతకీ ఆమెకు దక్కిన ఆ గౌరవమేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
గ్లోబల్ బ్యూటీ కి మరో అవార్డు..
మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఒక్కో సినిమాతో స్టార్ ఇమేజ్ ని అందుకుంది. పలు యాడ్స్ కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలను సంపాదించిన ఈ మిస్ వరల్డ్ బ్యూటీ, అక్కడి టాప్ 3 స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సుమారుగా రెండు దశాబ్దాలు ఏలింది. కేవలం అందంతో మాత్రమే కాకుండా, అద్భుతమైన నటన కనబరుస్తూ మనసు దోచుకుంది. తాను నటించడం సినిమాలకు ఎన్నో అవార్డులు అందుకుంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీగా హాలీవుడ్ సినిమాల్లో కూడా తన హవాని కొనసాగిస్తుంది. తాజాగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచం లో వివిధ రంగాలకు సేవలు అందిస్తూ, గొప్ప ఆదరణ దక్కించుకున్న ప్రముఖలు గుర్తిస్తూ గోల్డ్ హౌస్ గాలా కొన్ని అవార్డ్స్ ని ప్రకటించింది. అందులో ప్రియాంక చోప్రా కు గ్లోబల్ వాన్ గార్డ్ హానర్ అవార్డు దక్కింది.. ఈమెకు అవార్డు దక్కడంతో ఇండియా మొత్తం సినీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రష్మిక పరువు తీసేసిన దీపికా.. రివేంజ్ తీర్చుకుంటాను..
ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే..
ప్రియాంక చోప్రా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కి మెల్లగా దూరమై హాలీవుడ్లో తన హవాని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేసింది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా కి, ‘బే వాచ్’ చిత్రం లో మెయిన్ విలన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఒక్కో సినిమాతో అక్కడ కూడా అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇక ఈమధ్య హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుంది. సినిమా మొత్తం ఆమె మహేష్ బాబు కలిసి సమానంగా స్క్రీన్ స్పేస్ ని పంచుకునేలా ఉంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.