Illu Illalu Pillalu Today Episode April 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. తల్లిని చూసి.. నర్మద పరుగు పరుగున వెళ్తుంది. గుండెలకు హత్తుకుని భోరున ఏడుస్తుంది. అమ్మ నువ్వు నా కోసం వచ్చావా? నాకు ఇదంతా కలగా ఉంది.. నీ అంతట నువ్వే నా కోసం వచ్చావా? అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది నర్మద. ఆ మాటతో నర్మద తల్లి మీ అత్తయ్య రమ్మని చెప్పింది అని అంటుంది. పెళ్లికి మీ నాన్న తో కలిసి వస్తానని అంటుంది. ఆ సీన్ చూసి ప్రేమ వాళ్ళమ్మ కూడా ఆలోచిస్తుంది. నేను కూడా నా కూతురు దగ్గరికి ఇలానే వెళ్తే ఎంత బాగుంటుందో అని సంతోషపడుతుంది.. పాతకేళ్లు పెంచిన నా కూతురి మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లూ నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అయ్యేట్టు చెప్పారు. నా కూతుర్ని నాకు కొత్తగా పరిచయం చేశారు. ఈ తల్లి మనసు కన్న కూతురు కోసం పరుగుపెట్టుకుని వచ్చేలా చేశారు అని అంటుంది. చందు డబ్బుల కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే డబ్బులు కోసం తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు అడిగినా డబ్బులు లేవని చెప్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా తన నగలను చూపించి ప్రేమను ఎలా ఉంది ప్రేమ అని అడుగుతుంది. ప్రేమ చాలా అందంగా ఉన్నావ్ అక్క చాలా బాగున్నాయి నగలు అని బాధపడుతుంది. నర్మదా నువ్వేం బాధపడకు ప్రేమ మా అమ్మ నన్ను ఎలాగా అర్థం చేసుకుందో మీ అమ్మ నాన్నలు కూడా నిన్ను అలాగే అర్థం చేసుకుంటారని అంటుంది. మా అమ్మ నాన్నలు అర్థం చేసుకోవడానికి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదు అక్క మా ఇంటి మధ్య 25 ఏళ్ల పగ కూడా ఉంది ఈ రెండు కుటుంబాలు గత 25 ఏళ్ల నుంచి దూరంగానే ఉంటున్నారు అని బాధపడుతుంది.
అప్పుడే ప్రేమ అని ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. అది మా అమ్మే అని ప్రేమ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లిని గుండెలకు హత్తుకుని.. అమ్మా నువ్వు నా కోసం వచ్చావా? అంటూ ఉప్పొంగిపోతుంది. కూతుర్ని పట్టుకుని భోరున ఏడుస్తుంది ప్రేమ. ఇది కలో నిజమో తెలియడం లేదు.. నా వైపు చూడ్డానికే అసహ్యించుకునే నువ్వు నా కోసం వచ్చావ్.. నన్ను ప్రేమా అని ప్రేమ పూర్వకంగా పిలిచావ్.. చాలా సంతోషంగా ఉందమ్మా అని ఎమోషనల్ అవుతుంది ప్రేమ. అనంతరం..
రేవతి ప్రేమను కూర్చోబెట్టి.. కూతురుకి పసుపుకుంకుమలను అలంకరించి ఆమె కోసం తెచ్చిన నగలు, చీరని పెడుతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ప్రేమకు నగలు చీర ఇచ్చేసి బయటకు వచ్చేస్తుంది శారదాంబ కోడలు ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఇంకా రాలేదు ఆ భద్ర చూస్తే ఎంత గొడవ చేస్తుందని నేను టెన్షన్ పడుతున్నానని మాట్లాడుతుంది అప్పుడే సేన భద్ర అక్కడికి వస్తారు. నువ్వు ప్రేమను శాశ్వతంగా ఇంట్లో కోడలుగా చేయాలని అనుకుంటున్నావా ఇంటికి తీసుకురావాలని ఆలోచన నీకు లేదు కదా అని భద్ర అనగానే సేన నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్లి నగలు ఇచ్చేస్తావని రేవతిని దారుణంగా కొడతాడు.
మా శత్రువుల ముందు.. మమ్మల్ని తలదించుకునేలా చేసిన దీన్ని కొట్టడంలో తప్పే లేదు అని అంటాడు సేనాపతి. దాంతో రేవతి.. మీరు ఆ ఇంట్లో ఉన్న శత్రువునే చూస్తున్నారు కానీ.. నేను నా కూతుర్ని చూస్తున్నాను. ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే.. అందరూ నగలు, చీరలతో కళకళలాడుతూ కనిపిస్తున్నారు. కానీ నా కూతురు బోసిపోయి కనిపిస్తుంది’ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రేవతి. అన్న కూతురు నీ కనీసం చూసుకొని ఇవ్వని కూడా చూసుకొని ఇవ్వలేదు. మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అని రేవతి వాళ్ళ పై అరుస్తుంది. అటు చందు శ్రీవల్లికి డబ్బులు లేవని చెప్పి బాధపడతాడు. శ్రీవల్లి మాత్రం ఎలాగైనా డబ్బులు కావాలి అని ప్రేమతో చందు ని బ్లాక్ మెయిల్ చేస్తుంది.
తన తల్లి ఇచ్చిన నగలను అలంకరించుకొని అద్దం ముందు మురిసిపోతూ ఉంటుంది. ఈ నగలు ఎలా ఉన్నాయో ఒకసారి ధీరజ్ని అడిగి కనుక్కుంటాను అని ధీరజ్ ని పిలుస్తుంది. ధీరజు మొదట చంద్రముఖిలాగా చేస్తున్నావని ఎగతాళి చేసిన కూడా చివరికి నువ్వు బాపు బొమ్మ లాగా ఉన్నావ్ అంటూ మెచ్చుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చందు సేటు దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని అడుగుతాడు. రామరాజు అక్కడికి వస్తాడు. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి…