E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లో బాంబ్ పేల్చిన ప్రేమ.. శ్రీవల్లి చెంప చెల్లు.. అమూల్య ప్రేమలో పడిందా..?

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లో బాంబ్ పేల్చిన ప్రేమ.. శ్రీవల్లి చెంప చెల్లు.. అమూల్య ప్రేమలో పడిందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 26th :నువ్వు నిజాయితీగా పని చేసుకుంటున్నావని అనుకున్నాను. కానీ ఇలా లంచం తీసుకుని దొరికిపోతావని నేను అసలు ఊహించలేదు అని నర్మదా అనగానే సాగర్ ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటాడు.. అయితే ఇది నేను లంచం తీసుకోలేదు. ఆఫీస్ కోసం ఫండ్స్ కి నేను అప్పు చేశాను. వాటికి వచ్చిన డబ్బే ఇది అని చెప్పగానే నర్మదా మొదట నమ్మకపోయినా ఆ తర్వాత నమ్ముతుంది.. మీ మీద ఒట్టు నర్మదా నేను లంచం తీసుకోను అని చెప్తాడు. మొత్తానికి నర్మద అయితే నమ్ముతుంది. కానీ తనని మోసం చేస్తున్నాడు అని తన ఫ్రెండు సాగర్తో చెప్పిన సరే ఏమి పట్టించుకోడు సాగర్..

ధీరజ్ ను కొట్టడానికి రామరాజు ప్లాన్..

ప్రేమ చాలా ఆవేశంగా ఇంటికి రాయి పట్టుకొని వస్తుంది. అరె ధీరజ్ గా ఎక్కడ చచ్చావ్ రా అరేయ్ సచ్చినోడా అంటూ తిడుతూ లోపలికి రావడం చూసినా వేదవతి నర్మదా ఏమైంది ఈ పిల్లకి అనుకుంటూ బయటకు వస్తారు. ఎందుకు ప్రేమ అంతగా అరుస్తున్నావ్ చేతిలో రాయి ఏంటి ఏం జరిగింది అని వేదవతి అంటుంది.. కానీ ప్రేమ మాత్రం ఏమి చెప్పకుండా ధీరజ్ గాడు ఎక్కడ చచ్చాడు. ఇంకా ఇంటికి రాలేదా లేదా మీరే ఇంట్లో దాచిపెట్టి బయటికి తీసుకు రాకుండా చేస్తున్నారా అని అడుగుతుంది.. ధీరజ్ ఏం చేసాడు? అంతగా ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది అని వాళ్ళిద్దరూ అడుగుతున్న సరే ప్రేమ మాత్రం మీకు ఏం తెలీదా కోపంగా అరుస్తూ ఉంటుంది.. వాడు స్వాతిముత్యం ఏమీ కాదు.. వాటి గురించి మీరు ఏదేదో అనుకుంటున్నారు ఎక్కడ వాడు పిలవండి అంటూ ప్రేమ ఆవేశంగా మాట్లాడడంతో నర్మదా ఎందుకు ప్రేమ అంత ఆవేశం ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది.

ప్రేమ మాటతో నవ్వుకున్నా అత్తాకోడళ్లు ..

Advertisement

ఆ ధీరజ్ గాడు ఆ ముక్తతో తిరుగుతున్నాడు గాలి కూడా చొరబడినంత దగ్గరగా కూర్చొని మరీ తనతో రొమాన్స్ చేస్తున్నాడు అంటూ ప్రేమ చెప్తుంది . ఆ మాట వినగానే వేదవతి అలాగే నర్మద ఇద్దరు ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఇదంతా నిజమే నీ నమ్మావా. వాడు ఇలా చేయడం మీకు నవ్వుగా ఉందా ఎందుకు మీ ఇద్దరు నవ్వుతున్నారు అని ప్రేమ సీరియస్గా అడుగుతుంది. ఆ అమ్మాయిని పొగిడేస్తూ తనతో తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది అని ధీరజ్ గురించి చెప్పి ప్రేమ చాలా సీరియస్ అవుతుంది. అసలు ఎందుకు నువ్వు వింత సీరియస్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు అదంతా చేసింది నీకోసమే కదా నువ్వెందుకు మీ ఆయనకు దూరంగా ఉన్నావు అని నర్మదా అంటూ ఉంటే శ్రీవల్లి మాత్రం ఈ పొట్టిది మళ్లీ ఇంట్లో అడుగు పెట్టింది ఏమో అని కంగారు పడిపోతూ ఉంటుంది.

వల్లికి దిమ్మతిరిగే షాక్..

శ్రీవల్లి ప్రేమ నర్మదా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా నవ్వుతుంది. ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? లేకపోతే నన్ను చూస్తే నీకు పిచ్చి పిచ్చిగా ఉందా ఆలోచిస్తున్నావ్ ఏంటి అని ప్రేమ దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అదేమీ లేదు మీరిద్దరూ దూరంగా వెళ్లిపోయారు కదా మళ్లీ అతను ఎవరితో తిరిగితే నీకెందుకు అమ్మ.. అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకేంటి అంటూ వల్లి అనడంతో వేదవతితో పాటుగా నర్మదా ప్రేమ కూడా షాక్ అవుతారు. నా మొగుడు గురించి నన్ను పట్టించుకోవద్దు అని చెప్తావా అసలు ఎవరివే నువ్వు ఆ మాట అనడానికి అంటూ కోపంలో ఉన్న ప్రేమ శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. వేదవతి నర్మదా ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం అస్సలు మాట వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శ్రీవల్లి నోటి దూలతో మళ్ళీ వేదవతి చేత రెండు చెంప దెబ్బలు తింటుంది..

అమూల్య దెబ్బకు విశ్వం అవుట్..

Advertisement

అమూల్యను కలవాలని చెప్పిన విశ్వం ఒకచోట తనని కలిసి ఎందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే అమూల్య ధీరజ్ ప్రేమల గురించి మాట్లాడుతూ ఉండగా.. విశ్వం మాత్రం తనని ప్రేమిస్తున్నానని ఎమోషనల్ అయిపోయి చెప్పేస్తాడు. ఐ లవ్ యు అమూల్య అని చెప్పగానే అమూల్య కోపంతో రగిలిపోతుంది. నీ మీద నాకు మొదటినుంచి డౌట్ గానే ఉంది కానీ ఇప్పుడు నువ్వు బయటపడ్డావు చూడు ఇప్పుడు నీ బుద్ధి ఏంటో అర్థం అవుతుంది అని అమూల్య అంటుంది. నీ గురించి ఇప్పుడే మా అన్నయ్య వాళ్లకి చెప్తాను ఆగు అని చెప్పగానే నేను నిన్ను చెప్పడం లేదు ధీరజ్ ప్రేమలు ఇలా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు అని చెప్తున్నాను అని విశ్వం దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.

వల్లి మాస్టర్ ప్లాన్..

తిరుపతి సుకన్య మాట్లాడడం లేదని మొదటి ఫీల్ అవుతాడు. కానీ ఆ తర్వాత సుకన్య మాట విని కాస్త కూల్ అవుతాడు. రేపు నా పుట్టిన రోజు కాబట్టి నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టుగా తిరుపతి మాట్లాడుతాడు. కానీ అది విన్న వల్లి ఆరు లక్షల మేటర్ ని తిరుపతి మీదికి తోసేయాలి అని అనుకుంటుంది. భద్ర కి ఫోన్ చేసి మీ తమ్ముడు పుట్టినరోజు కదా ఒక ఆరు లక్షల విలువ చేసే చైన్ ని మీరు తీసుకురావాలి అని అంటుంది. కానీ భద్ర మాత్రం ఆ రామరాజు కుటుంబం నుంచి నా కుటుంబ సభ్యులనే విడగొట్టడానికి వల్లి బ్రహ్మాస్త్రంగా దొరికింది అని అనుకుంటుంది.. వల్లి ఏం చెప్తే భద్ర అది చేయడానికి రెడీ అవుతుంది. ఇక నర్మదా ప్రేమ ధీరజులని ఎలా కలపాలి అని బాధపడుతూ ఉండగా సాగర్ వస్తాడు.. వాళ్ళిద్దర్నీ కలపాలని ఆలోచన కూడా నీకు రావడం లేదా అని నర్మదా అనగానే సాగర్ షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవని కామెంట్స్.. పల్లవి రంగు బయటపడిందా..? అక్షయ్, అవని కాపురంలో చిచ్చు..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×