Intinti Ramayanam Today Episode august 26th: అక్క నేను బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నాను నాన్న ఇచ్చిన చెక్కుని నేను అకౌంట్లో వేయాలి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అంటూ పల్లవి అన్న మాట విని అవని వాళ్ళందరూ షాక్ అవుతారు. నీ ఎదుగుదల కోసం నాన్న ఇచ్చిన చెక్ ను నువ్వేమైనా చేసుకోవచ్చు. అది నీ ఇష్టం అని అవని అనగానే సరే అక్క నేను వెళ్తాను అని నన్ను ఆశీర్వదించండి అంటూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది.. అవని చెప్పినట్లుగానే పల్లవి బ్యాంకుకు వెళ్లి ఆ చెక్కుని డిపాజిట్ చేయాలని అనుకుంటుంది. అక్కడ ఆ బ్యాంక్ అతను రెండు కోట్ల అమౌంటు ఒకేసారి ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది అని అంటాడు. కానీ పల్లవి మాత్రం ఎలాగోలాగో చూడండి ఒక అర్జెంటు పని ఉంది అని అంటుంది.. అటు శ్రీధర్ కోసం ఒక ఆవిడ వచ్చి తన జీవితం గురించి చెప్పి బాధపడుతుంది. ఆవిడని చూస్తుంటే జనాలకి కాస్త అనుమానం వచ్చేలా ఉంది కానీ ఏం జరుగుతుందో అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి. ఇక అశ్విన్ పల్లవి నన్ను జైలుకు పంపించడానికి కారణం అని తనపై ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు..
చెక్కు డిపాజిట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని పల్లవి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంది. అయితే అప్పటివరకు సాఫ్ట్ గా సాధు జంతువు లాగా ఉన్న పల్లవి ఒక్కసారిగా మోడరన్ లుక్ లో కనిపించడంతో టీవీ ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. చేతిలో మందు గ్లాసు చిల్ మూడులో కనిపించిన పల్లవిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో మంచిది అనిపించుకోవడానికి పల్లవి చేసిన అన్ని ప్లాన్లు వర్కౌట్ అయ్యాయి. అయితే పల్లవి పక్క ప్లాన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి అందరిని మంచిది అని అనిపించుకునేలా నమ్మించింది. డబ్బు చేతిలో పడగానే అసలు స్వరూపం బయటపడింది.. పల్లవి నేను మళ్ళీ ఇలా చూడడం కొంతమందికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా పల్లవి అసలు క్యారెక్టర్ ఇదే అని మరికొందరు సరిపెట్టుకుంటారు.
పల్లవి ఇంతగా మారిపోతుందని అస్సలు ఊహించలేదు అంటూ ఇంట్లోని వాళ్ళందరూ కూడా తన గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. పల్లవిలో ఈ మార్పు రావడం నిజంగా ఆశ్చర్యంగానే ఉన్నా కూడా నిజంగా తను మారిపోయింది అంటే చాలా సంతోషంగా ఉంది అని అందరూ అనుకుంటారు. అవని కమల్ పల్లవిని ఎలా కోరుకున్నాడో అలానే మారిపోయింది నిజంగా పల్లవి ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు అంటూ కమల్ అనుకుంటాడు. అయితే అవని, మీనాక్షి, పార్వతి పల్లవిలో ఇలాంటి మార్పు వస్తుంది అని అస్సలు ఊహించలేదు. ఎవరి ఊహకు అందని విధంగా పల్లవి మారిపోయింది అంటూ అందరూ కూడా చాలా సంతోషంగా పల్లవిని పొగడ్తల వర్షంతో ముంచేత్తుతో కనిపిస్తారు. కానీ పల్లవి మాత్రం మత్తులో తూలుతూ తేలుతూ కనిపిస్తుంది.
పల్లవి పిల్లాడిని కిడ్నాప్ చేయించిన వాళ్లకి డబ్బులు ఇస్తుంది.. పల్లవి ప్లాన్ ప్రకారం లేడీ కిలాడీలు బాబుని కిడ్నాప్ చేసేందుకు వస్తారు. అంతేకాదు పల్లవి అశ్విన్ కి ఇస్తున్న డబ్బులు నీకు కొట్టేయమని చెప్పడంతో ఒక వ్యక్తి కొట్టేస్తాడు ఆ విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ లో రివిల్ చేస్తుంది పల్లవి. కేవలం డబ్బు కోసమే తను ఇంతగా మంచిది అని అనిపించుకునేలా మారిపోయిందని అర్థమైంది. నేను మారిపోయానని ఇంట్లోని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అంతే కాదు నా గురించి మంచిగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్లు నాశనం అవ్వడమే నాకు కావాలి అని పల్లవి అనుకుంటుంది. నా చేతికి డబ్బులు వచ్చాయి కదా ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను అని పల్లవి ఒక్కసారిగా తన విశ్వరూపం చూపిస్తుంది.
పల్లవి డబ్బులు ఉన్న బ్యాగులు తీసుకుని ఇంటికి వస్తుంది. పల్లవి వెళ్లిన పని ఏమైంది? చెక్కు డిపాజిట్ చేస్తానని అన్నావు కదా చేసావా అని అవని అడుగుతుంది.. చేశాను అక్క డబ్బులు కూడా తీసుకుని వచ్చాను మా ఫ్రెండ్ తో మాట్లాడి తనకి కూడా సెటిల్మెంట్ చేసి వచ్చాను అని అనగానే పల్లవి పై అనుమానం మొదలవుతుంది.. అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటే లేదక్కా తనకి ఐడియా ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలి కదా అని ఇచ్చాను. ఇక తర్వాత అవనికి మందు వాసన వస్తుంది అని అనుకుంటుంది. పల్లవి నా దగ్గర మందు వాసన వస్తుంది అన్ని పెగ్గులు తాగాను కదా అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. తన ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ఇలా ఉంది అని చెప్పగానే అవని నువ్వు వెళ్లి శారీ మార్చుకొని రా వాసన భరించలేకపోతున్నాను అని అంటుంది. వాసనని నువ్వు భరించలేవు మరి నేను కొట్టే దెబ్బ నేను ఎలా భరిస్తావు అంటూ పల్లవి మనసులో అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :యష్ ‘టాక్సిక్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?