E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: కామాక్షికి షాకిచ్చిన పెళ్లికొడుకు.. పెళ్లి సంబంధం క్యాన్సిల్.. మూడు జంటల రొమాన్స్..

Illu Illalu Pillalu Today Episode: కామాక్షికి షాకిచ్చిన పెళ్లికొడుకు.. పెళ్లి సంబంధం క్యాన్సిల్.. మూడు జంటల రొమాన్స్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నాకు ధీరజ్ కి పెళ్లి చూపులు జరగలేదు కదా అని సిగ్గు పడిపోతూ ఉంటుంది.. ఒకవేళ మా ఇద్దరికి పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది.. వాళ్ళిద్దరికీ వాళ్ల ఇంట్లో పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకుంటుంది.. ప్రేమ ఊహల్లో పెళ్లిచూపులు సరదాగా ఉంటాయి. రామరాజు కుటుంబం సేన కుటుంబం ఇద్దరు కలిసి ప్రేమగా ధీరజ్ కు పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్లు ప్రేమ ఊహించుకుంటుంది.. ప్రేమ తన ఇంట్లో ఎలా ఉంటుందో అన్నది ఈ సీన్లో చూపిస్తారు.. ఇక ప్రేమ ఏమి రావని చెప్పినా కూడా ధీరజ్ పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ ఒప్పుకోకపోయినా సరే ధీరజ్ మాత్రం తన వెంటపడి మరి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆ తర్వాత కామాక్షిని తీసుకొచ్చిన శ్రీవల్లి అమూల్య పెళ్లిచూపులు చెడగొట్టడానికి ప్లాన్ చేస్తుంది.. కామాక్షిని పెళ్లికూతురు లాగా రెడీ చేస్తుంది.. పెళ్ళికొడుకు ఆమెని పెళ్లికూతురని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కామాక్షిని అక్కడ కూర్చొన్న పెళ్ళికొడుకు ఈ అమ్మాయిని పెళ్లికూతురని అనుకుంటాడు.. వేదవతి మాత్రం ఈ అబ్బాయి చూపే మన వంకర ఏంటి పెళ్లికూతురు ఇక్కడ ఉంటే అటు చూస్తున్నాడేంటి అని అనుకుంటుంది.. ఇక కామాక్షి వెళ్లి కూల్డ్రింక్స్ తీసుకురమ్మని వేదవతి చెప్తుంది.. ఆ కూల్ డ్రింక్స్ తీసుకురాగానే అమూల్యని వేదవతి ఆ కూల్ డ్రింక్స్ ఇవ్వమని చెప్తుంది. కానీ పెళ్ళికొడుకు వద్దు ఆ అమ్మాయి కాదు ఈ అమ్మాయి ఇవ్వాలి అని అంటాడు. పెళ్లికూతురు అమ్మాయి అయితే ఈ అమ్మాయి ఎలా ఇస్తుంది అని వీళ్ళు అనుకుంటారు.. రాబోయే భార్య చేత తీసుకోవడంలో తప్పులేదు కదా అని అతను అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కాబోయే భార్య ఏంటి..? అరె దొంగ సచ్చినోడా నాకు ఆల్రెడీ పెళ్లయిందిరా..? ఎల్కేజీ చదివే కూతురు కూడా ఉంది రా నీ కామాక్షి అంటుంది..

Advertisement

ఏంటి పెళ్లికూతురు ఈమె కదా ఆమెనా అని పెళ్ళికొడుకు షాక్ అవుతాడు. పెళ్లికూతురు ఈ అమ్మాయి అని అందరూ అనగానే అతను షాక్ అవుతాడు. ఏదో పొరపాటు పడ్డాడు కదండీ. ఈ అమ్మాయి మాకు బాగా నచ్చింది మిగతా విషయాలను మాట్లాడుకుందామని పెళ్లి కొడుకు వాళ్ళ తల్లి మాట్లాడుతుంది. కానీ రామరాజు మాత్రం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపొండి నాకు దీని గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లి భాగ్యం ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషంగా ఉంటారు. బయటికి వెళ్లి విశ్వంకి పెళ్లిచూపులు క్యాన్సిల్ అయ్యాయని చెప్తారు.. విశ్వం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.

తర్వాత ఇంట్లోనే వాళ్ళందరూ కూర్చొని పెళ్లి సంబంధం చెడిపోయినందుకు బాధ పడిపోతూ ఉంటారు.. ఇప్పుడు జంటలు కలిసి వాడు అలాంటి వాడని తెలిస్తే బాగా అసహ్యం వేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్లు ఎక్కడో ముద్దుల సౌండ్ వినిపిస్తుంది. ఏంటి ఆ సౌండ్ మనం బాధపడుతుంటే ఏంటి ఆ సౌండ్ అని అక్కడ వెతుకుతారు. అయితే తిరుపతి ఫోన్లో మాట్లాడుతూ ముద్దులు ఇస్తూ ఉంటాడు.. అది చూసి ఏంటి మామ నీ సౌందర్యలహరిని ఒకసారి చూడాలనిపిస్తుంది రమ్మని చెప్పవా అని అడుగుతారు. తిరుపతి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. మొత్తానికి మూడు జంటలు కలిసి ఆ సౌందర్యలహరిని పట్టుకుంటారు. తిరుపతి ఆమె పేస్ ని చూసి షాక్ అవుతాడు..

Advertisement

ఇక రామరాజు తన కూతురికి పెళ్లి అవుతుందా లేదా అని బాధపడుతూ ఉంటాడు. జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. పెళ్లంటే చాలామందికి సంతోషంగా ఉంటుంది. నాకు మాత్రం భయంగా ఉంది.. ఏం చేయాలో అర్థం కావట్లేదు బుజ్జమ్మ అనేసి రామరాజు అంటాడు. బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదవతి మీరు బాధపడకండి మీ ఇష్టం వచ్చినట్లు ఆ పెళ్లిని చేయండి అని అంటుంది. ఒక సంబంధం గురించి వేదవతి చెప్తుంది. మీరు ఆ సంబంధం వెళ్లి అడిగి చూడండి ఒకసారి ఒప్పుకుంటారేమో అని అంటుంది.. నువ్వు చెప్పినట్లే వెళ్లి నేను ఆ సంబంధం గురించి మాట్లాడుతాను. సరైన సమయానికి సరైన నిర్ణయం చెప్పావు బుజ్జమ్మ అని వేదవతిపై రామరాజు ప్రశంసలు కురిపిస్తాడు.

Also Read :అవని పై అక్షయ్ ప్రశంసలు.. భరత్ ను ఇరికించిన పల్లవి.. మీనాక్షికి అవమానం..

ప్రేమ మాత్రం ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది.. వీడు నాతో బాగా బెట్టు చేస్తున్నాడు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ప్రేమ. వాడి వస్తువులన్నీ తెచ్చి నా దగ్గర పెడుకుంటాను అప్పుడు కచ్చితంగా వాడు చచ్చినట్టు నాతో మాట్లాడతాడని ప్రేమ ప్లాన్ చేస్తుంది.. అటు అమూల్య విశ్వంతో మాట్లాడుతూ ఉంటుంది.. అయితే ఆ పెళ్లి సంబంధం చెడిపోవడానికి నేనే కారణం అని చెప్తాడు. ప్రేమ మాత్రం ధీరజ్ వెతుక్కుంటూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వేదవతి నా బిడ్డను ఏడిపిస్తున్నారా అని అంటుంది. అది ఏడిపించడం ఏంటి భార్యాభర్తల మధ్య ఉన్న రొమాన్స్ కదా అని నర్మదా అంటుంది. మీ ముసలి వాళ్లకి అర్థం కాదులే అని నర్మదా అనడంతో వేదవతి ఫీల్ అవుతుంది.. ప్రేమ దగ్గర తన వస్తువులు ఉన్నాయని తెలుసుకున్న ధీరజ్ ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×