Illu Illalu Pillalu Today Episode july 30th: వేదవతిని ఓదార్చేందుకు అందరూ ఎంత ప్రయత్నిస్తున్నా సరే.. తను మాత్రం తన భర్తకి దూరమైపోయాను అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇన్ని రోజులు నేను ఎవరికోసమైతే నా వాళ్ళని అన్ని వదులుకొని వచ్చాను వాళ్లే ఇలా అనడం ఏంటి అని కుమిలి కుమిలి ఏడుస్తుంది వేదవతి. వేదవది తన భర్త కోసం ఇంతగా ఏడుస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం నన్ను కొట్టినందుకు బాధగా కన్నా ఈవిడ గారు ఏడుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ తన మనసులో సంతోష పడిపోతూ ఉంటుంది.. ఇన్ని రోజులు ఇద్దరి కోడల్ని చూసి తెగ మురిసిపోయింది. కదా ఇప్పుడు ఈవిడ ఏడుస్తూ ఉంటే ఎంత బాగుందో అంటూ శ్రీవల్లి మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.. ఇకపోతే శ్రీవల్లి నా కాపురని కూల్చాలి అనుకున్న ఆ పొట్టి మిరపకాయ కాపురం ఇప్పుడు కూలిపోయింది అని అనుకుంటుంది.. ఇక ప్రేమ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు భద్ర మాత్రం నా మేనకడలు నా ఇంటికి వచ్చేసింది అని సంతోషపడుతుంది..
తన మేనకోడలు నీ తన ఇంటికి తీసుకొని వచ్చాను అని భద్రావతి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమని ఎలాగైనా సరే నా ఇంటికి తీసుకుని వచ్చాను. ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎన్ని బాధలు పడిందో ఇప్పుడు అర్థమవుతుంది ఆ పనోడి ఇంట్లో నా మేనకోడలు నుంచి ఇన్ని రోజులు తప్పు చేశాను. ఆ ధీరజ్ గాడు ఇన్ని రోజులు తనని ఎంత బాగా చూసుకున్నాడో ఇప్పుడే అర్థమవుతుంది. అసలు వాడు ఇలాంటి పనులు చేస్తాడని అస్సలు ఊహించలేదు. ప్రేమ మనసుని మార్చేసాడు ఇన్ని రోజులు ఈ పిచ్చిది తెలుసుకోలేక అక్కడే ఉండిపోయింది అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. భద్ర మాటలు విన్న ప్రేమ ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ శారదమ్మ మాత్రం నా పుట్టిన రోజు పేరుతో నాకు మనవరాన్ని జీవితన్ని నాశనం చేశాను అని బాధ పడిపోతూ ఉంటుంది. నేనే కనుక ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని తను బాధపడడానికి ఎందుకు బాధపడుతున్నావ్ అమ్మ ఇప్పుడు తను సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది కదా అని అంటుంది..
ప్రేమ తన అత్తగారి ఇంటిని చూస్తూ నాకోసం ఒక్కరుంటే ఒక్కరు కూడా రాలేదు అంటూ బాధ పడిపోతుంది.. అటు వేదవతి కూడా నా వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది. నావల్లే ఇదంతా జరిగింది నా మేనకోడలు జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని నేను ఇలా చేశాను కానీ వాళ్ళు అది ఆలోచించకుండా నేనే తన జీవితాన్ని నాశనం చేశాను అని నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ బాధపడుతుంది.. ఇన్నేళ్లు కాపురం చేసిన మీ నాన్న కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటూ ఎమోషనల్ అవుతుంది వేణువతి. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా నీ మేనకోడని జీవితాన్ని కాపాడాలి అనుకున్నావు కానీ వాళ్లే నిన్ను తప్పుగా అనుకున్నారు అంటూ ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నించిన సరే వేదవతి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇన్నేళ్లు మీ నాన్న నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అంటూ వేదవతి అనడంతో ధీరజ్ కూడా చాలా బాధపడతాడు.
నాను ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తానమ్మా అని వెళ్ళిపోతాడు.అయితే రామరాజు నా భార్య నన్ను ఇంతగా మోసం చేస్తుందని అసలు ఊహించలేదు అంటూ మందు తాగుతూ బాధపడిపోతూ ఉంటాడు. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా బుజ్జమ్మ నన్ను ఇంతగా మోసం చేస్తుందని అసలు ఊహించలేదు అంటూ రామరాజు చాలా బాధపడిపోతాడు. నన్ను అందరూ కలిసి మోసం చేశారు అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంత జరిగిన తర్వాత నేను ఏ మొహం పెట్టుకొని నా బుజ్జమ్మని చూడాలి అంటూ తిరుపతి తో చెప్పి బాధపడిపోతాడు రామరాజు. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలాంటి సిచువేషన్ వస్తుంది అని నేను అసలు ఊహించలేదు అని తిరుపతి కూడా బాధపడిపోతూ ఉంటాడు.. ఈ ఎపిసోడ్ కి ఇదే ఎమోషనల్ సీన్స్..
ఇంట్లో వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటే.. శ్రీవల్లి మాత్రం ఇంట్లోనే వాళ్ళందరూ ఇంత బాధ పడిపోతున్నారని చాలా సంతోషంగా ఉంటుంది. మహారాణిగా శ్రీవల్లి అదిరిపోయే ఎంట్రీ ఇస్తుంది. ఈ సీన్ కి ఇదే హైలెట్ సీను అలాగే ఓవరాక్షన్ సీన్ కూడా.. మహారాణిగా శ్రీవల్లి అలా నడుచుకుంటూ వస్తుంటే సుకన్య పువ్వులు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతుంది. అంతే కాదు.. ఇక ఆనందరావు తన తల మీద వల్లి కాలు పెట్టించుకుని అచ్చం బాహుబలి సీన్ ని రిపీట్ చేశాలా ని క్రియేట్ చేస్తారు.. బ్యాగ్రౌండ్ లో మహానటి సాంగ్ రావడము.. శ్రీవల్లి ఎంట్రీ ఇవన్నీ చూస్తుంటే కాస్త ఓవరాక్షన్ గా అనిపించినా కూడా చూసే జనాలకి కామెడీగా కూడా ఉంటున్నాయి..
నువ్వు ఇన్ని రోజులు కామెడీ పీస్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇలా సాధిస్తావని అస్సలు ఊహించలేదు అంటూ శ్రీవల్లి పై భాగ్యం ప్రశంసలు వర్షం కురిపిస్తుంది. మనము ఎప్పుడూ ఈ సీన్ నుంచి పక్కకు వెళ్లి కామెడీ సీన్ లాగా కాసేపు ఎంజాయ్ చేద్దామని శ్రీవల్లి అంటుంది. అందరూ కూడా నువ్వు పెద్దపులి అంటూ సాంగ్ కి అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేస్తారు. మొత్తానికి శ్రీవల్లి అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ప్రేమ ధీరధులను విడగొట్టాలి అనుకున్నా ఆమె ప్లాను అదిరిపోయేలా అమలవుతుంది. అలాగే నర్మదా సాగర్ లు గొడవ పడుతూ ఉంటారు.. ఎక్కడ చూసినా కూడా ప్రేమ తప్పు చేసింది అని నర్మదా మాట్లాడడంతో నువ్వు కూడా తప్పు చేశావు అంటూ సాగర్ తనపై నిందలు వేస్తాడు. వీళ్ళిద్దరూ ఎంతగా గొడవపడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…