E-Paper
Advertisement

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో ఈ వారం ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా, సంతోషంగా, సరదాగా సాగుతోంది అనుకునేలోపే బిగ్ బాస్ ఇచ్చిన సరికొత్త టాస్క్ లో అల్టిమేట్ గోట్ గా అవతారం ఎత్తడానికి కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ముఖేష్ కోపంలో మిగతా కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతుండడం చూసి.. కెప్టెన్సీ కోసం ముఖేష్ పడుతున్న తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోపంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే విచక్షణ కూడా కోల్పోతున్నారు అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడ్డ గోట్స్..

54వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని విడుదల చేయగా.. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా మారడానికి ఇచ్చే ఛాలెంజ్ అల్టిమేట్ గోట్. ఈ ఛాలెంజ్లో ఒక బాల్ ను ఫోల్ పై బ్యాలెన్స్ చేస్తూ హర్డిల్స్ ను దాటుకొని అవతల వైపుకు ముందుగా చేరుకొని, ముగ్గురి సపోర్టర్స్ లో ఎవరైనా ఒకరికి తమ బాల్ ని అందించాలి. వారు బోర్డుని కదిలిస్తూ కింద ఉన్న అవుట్ కమ్స్ లో ఆ బాల్ ను ఏదో ఒక దానిలో పడేలా చేయాలి అని టాస్క్ గురించి వివరించారు. ఎవరైతే తమ కటౌట్ ను ముందుగా ఎండ్ పాయింట్ లో ఉన్న అల్టిమేట్ గోట్ స్థానానికి చేర్చుతారో.. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా మారడంతో పాటు అల్టిమేట్ గోట్ గా నిలుస్తారు అంటూ వివరించారు.

శివను కొట్టడానికి వెళ్లిన ముఖేష్..

Advertisement

టాస్క్ ప్రారంభం అవ్వగానే గోట్స్ గా ఉన్న ఏడుగురు సభ్యులు తమ టాస్క్ ప్రారంభించారు. అందులో ముఖేష్ పరిగెత్తుకుంటూ వస్తూ అమన్, అమన్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ బాల్ ఎక్కడ పడిపోతుందోనని శివ ఆ బాలు తీసుకున్నాడు. ఇంతలో ఫైర్ అయిన ముఖేష్ శివాను కొట్టడానికి వెళ్ళాడు. ఏయ్.. బుద్దుందా? అంటూ అరిచాడు . ఇక శివ ఆ యాక్షన్ ఏంటి ముఖేష్ సార్.. కొట్టేస్తారా ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు.

also read: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

ముఖేష్ ప్రవర్తన పై మండిపడ్డ వంశీ..

Advertisement

ఇక తర్వాత వంశీ అన్న ప్లీజ్ నేను నిన్ను నమ్ముతున్నాను అంటూ తన బాల్ ను అందించాడు. అయితే వంశీ బోర్డు తిప్పడంలో బాల్ మిస్సయింది. రెండవసారి కూడా వంశీకి ఇచ్చాడు. కానీ ఆ బాలు కూడా మిస్ అయింది. దీంతో ఫైర్ అయ్యాడు ముఖేష్. వంశీ మాట్లాడుతూ.. అయితే నీ బాలు నాకు ఇవ్వకు అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అందుకే నువ్వు నీ ఆటలో గెలవలేక పోయావు దేవుడు ఉన్నాడు అంటూ ముఖేష్ వంశీ పై కామెంట్ చేయగా.. వంశీ మండిపడుతూ..” అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు” అంటూ ముఖేష్ ప్రవర్తన పై విరుచుకుపడ్డారు. అలా మొత్తానికైతే కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ లో వివాదం చోటుచేసుకుంది. మరి ఎవరు కెప్టెన్ గా బాధ్యతలు చేపడతారో తెలియాల్సి ఉంది.

Related News

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి.. శ్రీముఖికి సీరియల్ నటుడు సలహా!

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!

పెళ్లి కాకుండా కర్వా చౌత్.. నీ ‘అతి’ తట్టుకోలేకపోతున్నాం అక్కా!!

పెళ్లి పీటలెక్కాల్సిన శివ.. ప్రియాంకను మోసం చేస్తున్నాడా?ముఖేష్ షాకింగ్ కామెంట్స్!

కష్టపడ్డా అమన్ కి దక్కని ఫలితం.. కంటెస్టెంట్స్ సపోర్టు కూడా లేదా?

“బాసింగ బలాలు” పాటకి 11 లక్షలు ఖర్చుపెడితే ఎంత వచ్చిందో తెలుసా?

ఈ వారం కూడా వర్షిణి సేఫ్.. డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?

Big Stories

Advertisement
×