E-Paper
Advertisement

పాకిస్తాన్ అంటేనే చిరాకు..ఇక జ‌న్మ‌లో నా దేశంలో అడుగు పెట్ట‌ను

పాకిస్తాన్ అంటేనే చిరాకు..ఇక జ‌న్మ‌లో నా దేశంలో అడుగు పెట్ట‌ను
Advertisement

Mohammad Amir On Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో వింత మనుషులు ఉంటారు. వాళ్ళు ఏది చేసినా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంటారు. అయితే తాజాగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ అమీర్ (Mohammad Amir) వ్యవహరించాడు. పాకిస్తాన్ దేశంలో పుట్టి పెరిగి… ఇప్పుడు ఆ దేశాన్ని అవమానిస్తున్నాడు. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వాన్ని అందుకున్న ఈ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ సొంత దేశాన్ని కించపరుస్తూ మాట్లాడాడు. ఇక జన్మలో పాకిస్తాన్ దేశంలో అడుగుపెట్టబోనని ప్రకటన చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేస్తానని వెల్లడించారు. పాకిస్తాన్ అంటేనే చిరాకు దొబ్బిందని… ఇక ఆ దేశంతో తనకు బంధం పూర్తిగా తెగిపోయినట్లు వివరించారు. దీంతో పాకిస్తాన్ పై మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

రూ.100 కోట్లు ఇచ్చి..నా కాళ్లు మొక్కినా..PSL ఆడ‌ను

Advertisement

ఇటీవలే బ్రిటిష్ పౌరసత్వం అందుకున్న మహమ్మద్ అమీర్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తన బంధం పూర్తిగా తెగిపోయిందని ఈ వివరించారు. మళ్లీ ఆ జట్టు తరఫున ఆడాలని ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. పాకిస్తాన్ తరఫున ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగివచ్చిన కూడా తాను ఆడేది లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు తనకు ఎలాంటి ఆఫర్ ఇచ్చిన ఆలోచించేది లేదని వివరించారు.

అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడే ఉద్దేశం కూడా తనకు లేదన్నారు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆదేశంలో అడుగు పెట్టేది లేదంటే వ్యాఖ్యానించారు. ఇకపై ఇంగ్లాండ్ లోనే ఉంటూ తన జీవనాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. అయితే ఇంగ్లాండులో జరుగుతున్న ది 100 లీగ్ లో పాల్గొంటానని పేర్కొన్నారు. దీంతోపాటు కౌంటింగ్ క్రికెట్ లో కూడా ఆడేందుకు తాను నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు మహమ్మద్ అమీర్. తనకు బ్రిటిష్ పౌరసత్వం వచ్చింది కాబట్టి… పాకిస్తాన్ దేశానికి వెళ్లదలుచుకోలేదని తెలిపారు.

అసలు బ్రిటిష్ పౌరసత్వం ఎందుకు తీసుకున్నాడు ?

Advertisement

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ కు 2026 మే లో బ్రిటిష్ పౌరసత్వం వచ్చింది. మహమ్మద్ అమీర్ భార్య నర్జీస్ ఖాన్ (Nargis Khan) ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన లేడీ. రూల్స్ ప్రకారం బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడి పౌరసత్వం భర్తకు వస్తుంది. ఈ క్రమంలోనే మహమ్మద్ అమీర్ రూల్స్ ప్రకారం పౌరసత్వం దక్కించుకున్నాడు. కాగా వీరి వివాహం 2016లో జ‌రిగింది.

 

 

 

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

Related News

వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ ను ఆడించాల‌ని, గిల్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందే

బాబ‌ర్ ఇండియాలో పుట్టింటే, విరాట్ కోహ్లీని మించిపోయేవాడు

పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్

ఐపీఎల్ లో పైస‌లు త‌ప్ప ఏం లేదు…PSLలోనే రియ‌ల్ టాలెంట్

బాబ‌ర్ ఆజం పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్…అబ్బాస్, మ‌సూద్ ల‌ను తొక్కేసి మ‌రీ

వైభ‌వ్ త‌ల‌రాత మార్చిన జింబాబ్వే..ర్యాంకింగ్స్ లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

దిగజారిన మ‌హిళా క్రికెట‌ర్లు..దీప్తి శర్మను గ‌ట్టిగా లాగి ముద్దు పెట్టిన అరుంధతి!

Big Stories

Advertisement
×