E-Paper

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను కాపాడిన ధీరజ్.. వేధవతికి షాకిచ్చిన నర్మదా.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను కాపాడిన ధీరజ్.. వేధవతికి షాకిచ్చిన నర్మదా.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 4th: ప్రేమ ఎక్కడుందో అని టెన్షన్ పడిపోతూ వెళ్లిన ధీరజ్ కి ప్రేమ కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటాడు.. అయితే ప్రేమను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రాజాపుష్పం.. ప్రేమని బయటికి రప్పియాలని కరెంటు పోయింది అని అబద్ధం చెప్తాడు.. అయితే ఆ ప్రేమ అది నిజమే అనుకోని నమ్ముతుంది. ఇక మెల్లగా బయటకు వచ్చి అక్కడ ఉన్న ఫోన్ని తీసుకోవాలనుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజపుష్పం ప్రేమని పట్టుకుంటాడు. ఇక ప్రేమ బలవంతంగా లోపలికి వెళ్లి తలుపు పెట్టుకున్న సరే తన అసిస్టెంట్ కలిసి తలుపు నీ బద్దలు కొడతాడు రాజ పుష్పం.. ఆ తర్వాత తనని బలవంతం చేయకపోతే వెంటనే వచ్చిన ధీరజ్  రాజపుష్పాన్ని దారుణంగా కొట్టేస్తాడు.  నా భార్య మీద చేయి వేస్తావా నీకు ఎంత ధైర్యం రాని రాజపుష్పాన్ని ధీరజ్ వెంటపడి మరీ కొట్టేస్తాడు.. మొత్తానికి ప్రేమని ధీరజ్ కాపాడతాడు.. అప్పటివరకు కంగారు పడిపోతూ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్ ను చూసి చాలా సంతోషంగా ఉంటుంది..

వేదవతికి నర్మద షాక్..

వేదవతి ధీరజ్ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ధీరజ్ ఇంకా రాలేదు అని బయట ఒక్కటే ఎదురు చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది.. చిన్నోడు ప్రేమ ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని వేదవతి అటు ఇటు తిరుగుతూ కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే వేదవతిని బయట చూసిన నర్మదా ఈవిడ ఎందుకు ఇక్కడ తిరుగుతుంది ధీరజ్ కోసమే అనుకుంటా అని అనుకుంటుంది.. అప్పుడే నర్మదా ధీరజ్ కి ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది. ప్రేమ కనిపించిందా అసలు ఏం జరిగింది అని నర్మదా అడుగుతుంది.. లేదు వదినా నేను వచ్చిన తర్వాత మీకు అన్ని వివరంగా చెప్తాను అని ధీరజ్ అంటాడు.. అయితే వేదవతి దీన్ని అడిగితే ఇంకాస్త టెక్కు చూపిస్తుంది.. ధీరజ్ గురించి ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని వేదవతి నర్మదని ఎక్కడున్నాడట చిన్నోడు అని వెటకారంగా అడుగుతుంది. ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నప్పుడు నేనెందుకు చెప్పాలి అని నర్మదా అనడంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగి కదా బాగా చదివానని పొగరు అంటూ వేదవతి నర్మదని తిడుతూ ఉంటుంది.

ప్రేమపై ధీరజ్ సీరియస్..

Advertisement

ప్రేమ అనవసరంగా ఇక్కడికి వచ్చి వాడి చేతిలో ఇరుక్కుంది అని ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు.. అయితే ప్రేమ మాత్రం నన్ను క్షమించు రా నీకు చెప్పకుండా రావడం తప్పే కానీ నేను వచ్చింది వేరు అని ప్రేమ అంటుంది. ధీరజ్ ఎంతగా కొట్టాలని ప్రయత్నించిన సరే ప్రేమ మాత్రం నన్ను క్షమించు రా అని దీనంగా అడగడంతో ధీరజ్ మాత్రం కొట్టకుండా ఆగిపోతాడు.. మైక్ లో ప్రేమ అని పిలవడం విన్న ధీరజ్ నీకేమైనా చెవుడా వచ్చిందా అక్కడ పిలుస్తున్నారుగా ఇంత దూరం వచ్చావుగా ఏదో ఒకటి తగలడు అని అంటాడు.. ధీరజ్ మాటలకి షాక్ లో ఉండిపోయిన ప్రేమ ఏం మాట్లాడుతున్నావ్ రా అని అడుగుతుంది.. ధీరజ్ ఇంత దూరం వచ్చావు కదా నీ కోతి డాన్స్ ఏదో అక్కడికి వెళ్లి వెయ్యి అని అంటాడు.. ప్రేమ డాన్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ధీరజ్ కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు.

ప్రేమను గెలిపించిన ధీరజ్..

ప్రేమ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని కాసేపు ఆకట్టుకుంటుంది.. అయితే డాన్స్ చేస్తున్న మధ్యలో తనకి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడంతో ధీరజ్ తనకి ఏమైందో అని కింద కూర్చుని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే ఇక ప్రేమకి సపోర్ట్ గా ధీరజ్ నిలవాలని స్టేజ్ మీదకు వెళ్లి తనతో పాటు డాన్స్ చేస్తాడు.. ఈ సీన్ఎ పిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది.. ధీరజు ప్రేమ ఇద్దరూ కలిసి చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు.. వీళ్ళిద్దరి డాన్స్ ని చూసి అక్కడున్న జడ్జిలు ఫిదా అయిపోతారు.. ఇక జనాలు మాత్రం వీళ్ళ డాన్స్ చేస్తునంత సేపు క్లాప్స్ కొడుతూ తెగ ఎంజాయ్ చేసేస్తారు.. ప్రేమ ధీరజులు విన్నర్ గాని అనౌన్స్ చేయడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేవు.. ఇద్దరూ కలిసి ఆ పది లక్షల ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ప్రేమ ధీరజ్ లు నిన్న అనగా వెళ్లారు ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. వేదవతి మాత్రం కాళ్లు చేతులు ఆడడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాక్షికి ఘోర అవమానం.. శ్రీయ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?

Podarillu Today Episode : విక్కీ మాటతో చక్రీ మైండ్ బ్లాక్.. మాధవ్ టీకి ఫిదా.. అయ్యో చక్రీ ఇజ్జత్ పోయిందిగా..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాక్షికి ఘోర అవమానం.. శ్రీయ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Gundeninda Gudigantalu Shruthi : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఏం చదివిందో తెలుసా..?

Intinti Ramayanam : ‘ ఇంటింటి రామాయణం ‘ సీరియల్ కు శుభం కార్డు.. చివరిల్లో ఊహించని ట్విస్ట్..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Kissik Talks: సోనియా – సిద్ధూ మధ్య బ్రేకప్.. టార్చర్ భరించలేకపోయా !

Big Stories

×