E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాక్షికి ఘోర అవమానం.. శ్రీయ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాక్షికి ఘోర అవమానం.. శ్రీయ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Intinti Ramayanam Today Episode july 4th: బాబు ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా మా ఇంటికి వారసుడు వచ్చారు అని చాలా సంతోషంగా ఉంటారు.. అందరూ మధ్యలో కూర్చొని బాబుని పెట్టి సంతోషంగా నవ్వుతూ ఉండడం చూసిన పల్లవి కడుపు రగిలిపోతుంది అని కోపంగా అందరిని చూస్తుంది. ఈ బిడ్డ రాక వల్ల మళ్లీ అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అది నాకు నచ్చలేదు అని అనుకుంటుంది. ఆరాధ్య బాబుతో నేను మాత్రమే ఆడుకోవాలి ఎవరికి ఇవ్వను అని అనడం చూసి అందరూ నవ్వుకుంటారు. ఆవుని రెడీ చేయడానికి ఇవ్వమ్మా అని అవని చెప్పిన సరే ఆరాధ్య మాత్రం నేను పడుకున్న తర్వాతే మీరు బాబుని తీసుకోవాలి అప్పటివరకు నాతోనే ఉంటాడు అని అనడంతో అందరూ నవ్వుకుంటారు. ఇక చక్రధర్ బాబుతో ఆడుకుంటూ నేను రా మీ తాతయ్యని అని అనడంతో పల్లవి అతని చూసి మా మామ్చనిపోయింది అన్న బాధ కూడా ఈయనకి లేదు అని అనుకుంటుంది..

పల్లవికి చక్రధర్ షాక్..

పల్లవి ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని కుళ్ళు తో తెగ బాధ పడిపోతూ ఉంటుంది. బయట ఒంటరిగా ఉన్న పల్లవిని చూసి చక్రధర్ అక్కడికొస్తాడు. పల్లవి ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు కదా నువ్వు కూడా మారి అందరితో కలిసిపోయి సంతోషంగా ఉండొచ్చు కదా అని చక్రధరంటాడు. కానీ పల్లవి మాత్రం నాకు అన్ని దూరం చేసిన వాళ్లని నేనెందుకు దగ్గర చేసుకోవాలి అని అడుగుతుంది.. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుందాం మా నాన్న ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. మా అమ్మవా వీళ్లవల్లే దూరం అయిపోయింది అని పల్లవి మాట్లాడుతుంది. శ్రీయ కి బిడ్డ పుట్టడంతో చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా కమల్ తో సంతోషం గా ఉండి పిల్లల్ని కనడం మొదలు పెట్టు ఇంట్లో నువ్వు కూడా చాలా సంతోషంగా ఉంటావని చక్రధర అంటాడు..

చక్రధర్ పై పల్లవి సీరియస్..

Advertisement

నాకు నీతులు చెప్తే నాకు అస్సలు నచ్చదు. అవని ఆ మీనాక్షి వల్లే నేను ఇలా ఉన్నాను అని పల్లవి బాధపడుతుంది. నేను ఎప్పటికీ మారను నేను ఇంతే అని చక్రధర్ తో పల్లవి చెప్తుంది.. నువ్వు మాత్రం మారావు కదా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా ఇప్పుడు నా గురించి నీకెందుకు అని చక్రధర్ మంచిగా చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా అతనిని కూడా తిడుతుంది. నా బతుకు నేను ఇలానే బతుకుతాను నా గురించి నువ్వేం ఆలోచించొద్దు నాకు అన్ని దూరం చేసిన ఆ అవని మీనాక్షి మాత్రం అస్సలు వదిలిపెట్టను అని అంటుంది.. చక్రధర్ ఎంతగా బ్రతిమలాడాలని చెప్పినా కూడా తను మాత్రం అస్సలు వినకుండా పల్లవి చక్రధరికే వార్నింగ్ ఇస్తుంది.

మీనాక్షికి ఘోర అవమానం..

Advertisement

మధ్యాహ్నం అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు.. అందరూ సరదాగా భోజనం చేయడం చూసిన మీనాక్షి పల్లవి ఇంకా రాలేదేంటి బాబు అని కమల్ ని అడుగుతుంది.. కమలు దీన్ని స్కూల్లో గంట కొట్టినట్టు పిలుస్తే గాని రాదేమో అని అనుకుంటాడు. పల్లవి నీ పిలిస్తే నాకు ఇప్పుడు భోజనం వద్దు తర్వాత తింటాను భవాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఇక అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ అవని వెంటనే మెచ్చుకుంటూ ఉంటారు.. మీనాక్షి మాత్రం పల్లవి కోసం భోజనం తీసుకుని బయటికి వస్తుంది.. పల్లవి బయట ఆకలితో బాధపడుతుంది అని మీనాక్షి తన దగ్గరికి వెళ్లి అమ్మ పల్లవి అందరూ భోజనం చేస్తున్నారు కదా నువ్వు భోజనం చేయలేదని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను అని చేతులో పెడుతుంది. అయితే పల్లవి మీనాక్షిని చూడగానే ఎక్కడలేని కోపం కట్టలు తెంచుకుంటుంది.. మీనాక్షి చేతిలో ఉన్న ప్లేట్ ని విసిరి కొట్టేస్తుంది.. నువ్వు నా దగ్గరికి రావద్దు నాకు ఇలాంటి పనులు చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినవా నువ్వు అని దారుణంగా అవమానిస్తుంది.. కన్న కూతురు కడుపు మార్చుకొని అలా అనడంతో మీనాక్షి బాధ పడిపోతుంది..

మీనాక్షిని ఓదార్చిన అవని..

పల్లవి మీనాక్షిని తిట్టేసి లోపలికి వెళ్ళగానే అవని అక్కడికి వచ్చి మీనాక్షి బాధపడుతుంటే మాట్లాడుతుంది.. నువ్వేమీ బాధపడద్దమ్మా పల్లవి గురించి తెలిసిందే కదా. పల్లవి అలాంటి వాతావరణం లో పెరిగింది.. తను మారడం కాస్త కష్టమేనా మార్చేద్దాం అని అంటుంది.. నువ్వు భోజనం తీసుకుని వచ్చినప్పుడే పల్లవి కోసం తీసుకొస్తున్నావని అనుకున్నాను.. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అని అవని అంటుంది.. పల్లవి గురించి తెలిసింది కదా అమ్మ నువ్వేమీ బాధపడొద్దు తనే మెల్లగా మారుతుంది అని అవని మీనాక్షిని ఓదారుస్తుంది. ఎలాగైనా సరే పల్లవి మనసులో తల్లిగా స్థానాన్ని సంపాదించుకోవాలి అని మీనాక్షి అనుకుంటుంది. పల్లవి ప్రవర్తన చూస్తూ ఉంటే ఇప్పట్లో సాధ్యం కాదు అని మీనాక్షి బాధ పడిపోతుంది.. శ్రేయ బిడ్డ ఏడుస్తూ ఉంటే పల్లవి చిరాకు పడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘ ఇంటింటి రామాయణం ‘ సీరియల్ కు శుభం కార్డు.. చివరిల్లో ఊహించని ట్విస్ట్..

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×