Illu Illalu Pillalu Today Episode july 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ఇంటికి భాగ్యం సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఏంటి చెల్లెమ్మ కబురు కూడా లేకుండానే సడన్ గా ఇచ్చారు అంటే ఏకాదశి కదండీ మీ ఇద్దరికీ బట్టలు పెడదామని వచ్చామండి అని అంటుంది. నర్మదా ప్రేమలను దారుణంగా అవమానించాలని భాగ్యం ఫిక్స్ అయ్యే ప్లాన్ ప్రకారం ఇంట్లోకి అడుగుపెడుతుంది.. నర్మదను పీటలు తీసుకురమ్మని చెప్పి దానిమీద దుమ్ము దులపాలని చెప్తుంది. మీ అమ్మ వాళ్లు మీకు ఇదే నా పద్ధతులు నేర్పించిందని ఇద్దరినీ నానా మాటలు అంటుంది. ప్రేమ పీటల మీద ఉన్న దుమ్మును దులిపి భాగ్యంకు దిమ్మదిరిగిపోయేలా చేస్తుంది. మీరిద్దరిని అవమానించాలని నేను ఇక్కడికి వచ్చాను అని భాగ్యం అనుకుంటుంది. మీకు చెప్పడానికి చేయడానికి తల్లిదండ్రులు లేరు కదా మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా అని భాగ్యం నర్మదా ప్రేమలను అవమానిస్తుంది.. ఆ మాట వినగానే నర్మద ప్రేమ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ప్రేమ తన పుట్టింటి వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం వెళ్ళేది వెళ్లకుండా నర్మద దగ్గరికి వెళ్లి నా కూతుర్లకు ఏం జరిగినా నేను చూసుకుంటాను. నీకు ఎవరున్నారు చూసుకోవడానికి అని ఇంకా బాధపెడితే వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నర్మద కూడా నువ్వు అన్నదానికి ఇంకాస్త ఎక్కువ చేసి చూపిస్తానని భాగ్యంతో ఛాలెంజ్ చేస్తుంది. ఇంకొకసారి నా కూతురు జోలికొస్తే మర్యాదగా ఉండదు ఏంటమ్మాయి అర్థం అవుతుందా అని భాగ్యం సైలెంట్ గాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది.. నర్మదా మొదట సైలెంట్ గా ఉన్న భాగ్యం వెళ్ళిపోతుంటే చిటికేసి మరి పిలుస్తుంది.
ఏంటి పిన్ని గారు ఏదో అంటున్నారు.. ఇప్పటివరకు నాకు కేవలం అనుమానం మాత్రమే ఉంది ఇప్పటినుంచి ఆ అనుమానం నిజమా కాదా అని తెలుసుకొనే పనిలోనే ఉంటాను అని నర్మదా అంటుంది. ఇది నా ఇల్లు ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళకి ద్రోహం చేయాలని చూసినా మోసం చేయాలని చూసినా నేను అస్సలు సహించను అని నర్మదా అంటుంది.. మీరు ఏదో చేస్తున్నారని నాకు అర్థం అయిపోయింది మా వాళ్ళని కాపాడుకోవడానికి నేను ఎంతవరకైనా తెగిస్తాను అని నర్మదా బాగ్యం కు వార్నింగ్ ఇస్తుంది.. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి పిన్ని గారు అని నర్మదా అనగానే నవ్వుతూ అక్కడి నుంచి జారుకుంటుంది భాగ్యం..
వేదవతిని చూసి చాలా రోజులైంది అని వాళ్ళ అమ్మ గార్డెన్లోకి వచ్చి వేదవతిని పిలుస్తుంది. ముగ్గురు కోడలు వచ్చారు కదా నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావ్ నీ మొహం లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని అంటుంది. సంతోష్ మా నా బొంద ఒకరేమో గాలి, మరొకరు నిప్పు, ఇంకొకరు నీరు.. వీళ్ళ ముగ్గురి మధ్యలో నేను ఇరుక్కున్నాను. వీళ్ళ గొడవలతో నాకు తలపోటు రాని రోజు అంటూ లేదమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తుంది వేదవతి.
ఇప్పుడే కదా ముగ్గురు కోడళ్ళకి అత్తయ్యవు ఇంకోది రోజులు పోతే వాటిని చూసి నువ్వే సరదాగా నవ్వుకుంటావులే అలవాటైపోతుందని వాళ్ళ అమ్మ అంటుంది.. ఇక సేన రావడంతో ఇద్దరూ ఏమీ తెలియనట్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అతను అటు వెళ్ళగానే మళ్లీ మాటలు మొదలుపెడతారు. ప్రేమ నీలాగే తింగరిది. నడిపి కోడలు నర్మదా ఉంది కదా అది మా గడుసుది.. తనకే కాదు తన ఇంట్లో వాళ్లకి ఏదైనా అపాయం తలపెట్టాలని చూస్తే వాళ్ళ భరతం పడుతుంది. నువ్వేం బాధపడకు భయపడకు అని వేదవతి వాళ్ళమ్మ సర్ది చెబుతుంది.
ముందుగా అన్నట్లుగానే నర్మదా బాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అక్కడ గేటు చూస్తే తాళం వేసి ఉంటుంది.. ఆ పక్కనే ఒక పేపర్లో ఇంటిని అద్దెకి ఇవ్వబడును అని నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్నీ తెలుసుకుంటుంది నర్మదా. భాగ్యం వాళ్లది అసలు ఇల్లు ఇది కాదని ఈ విషయాన్ని వల్లి అక్క తోనే కన్ఫామ్ చేసుకోవాలని అనుకుంటారు..
వెంటనే వేదవతి కి ఫోన్ చేసి నర్మదా వల్లి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోమని అడుగుతుంది. అదేంటి గవర్నమెంట్ కోడలు గారు వాళ్ళతో మీకేం పని అని వేదవతి అడుగుతుంది. ఏదో చిన్న పని మీద ఇటుగా వచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించకపోతే మర్యాదగా ఉంటుందా? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్నారో లేదో కనుక్కోండి నేను వెళ్లి పలకరిస్తాను అని నర్మదా అంటుంది. శ్రీవల్లి దగ్గరికి వెళ్లి మీ అమ్మ వాళ్లు ఇంట్లోనే ఉన్నారా అమ్మ అని అడుగుతుంది..
Also Read :భర్తను కాపాడిన అవని.. భానుమతి వీక్నెస్ పై కొట్టిన కమల్.. ప్లాన్ వర్కౌట్ అయ్యినట్లే..?
శ్రీవల్లి మొదట ఇంట్లోనే ఉన్నారండి అని అంటుంది. ఆ విషయం నీ వేదవతి నర్మదా వాళ్లకు చెప్పడం విని షాక్ అవుతుంది శ్రీ వల్లి. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి వల్లి అక్క దగ్గరికి ఇవ్వరా అని నర్మదా ప్రేమ అంటారు.. అక్క పనిమీద మీ ఇంటి దగ్గరికి వచ్చాము మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకసారి ఫోన్ చేసి బయటికి రమ్మనవా కలిసి వెళ్తాము అని నర్మదా అంటుంది. శ్రీవల్లి అడ్డంగా ఇరుక్కుపోయానని టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినట్లు డ్రామాలు మొదలు పెడుతుంది. బాలు ఇంట్లో లేరంట అత్తయ్య గారు నర్మదా ఇంట్లో లేరంట అని చెప్తుంది. నర్మద వాళ్ళు సరే అక్క మేము వచ్చేస్తాం లెండి ఇంకొకసారి వెళ్లి కలుస్తామని అంటారు. శ్రీవల్లి వాళ్ళు నిజంగానే అక్కడ పని మీద వెళ్ళారా కావాలనే నా గురించి తెలుసుకోవాలని వెళ్లారని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..