Intinti Ramayanam Today Episode july 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి వెళ్లడానికి ఆటోని బుక్ చేయబోతుంటాడు అక్షయ్. అత్తయ్య గారు మీరు నా బండి మీద రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం అస్సలు వినదు. వెళ్లకుండా అయినా ఉంటాను కానీ నీతో పాటు నేను ఎక్కడికి రాను అని అంటుంది. అక్షయ్ కూడా అమ్మ కోసం నేను ఆటో బుక్ చేస్తున్నాను నీ అవసరం మాకు ఏం అవసరం లేదు అని మొహం మీదే చెప్పేస్తాడు.. అయితే ఈరోజు ఆటోలు క్యాబ్లు అన్ని బంద్ మీరు మీ అబ్బాయి బుక్ చేసినట్లుగానే నా బండి మీద రండి అని అవని అంటుంది. పార్వతిని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అవనిని చూసి ఇద్దరు షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ ఇలా ఇస్తావని అనుకోలేదు అని పల్లవి, శ్రీయా అంటారు.. నా ఇంటికి నేను వస్తే నీకేంటి ప్రాబ్లం అని పల్లవిని అవని అడుగుతుంది. నా ఇల్లు అన్న సంగతి మీరు మర్చిపోయినట్లున్నారు అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది.. నేనేమీ ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. అత్తయ్య తీసుకుని వచ్చాను అని అంటుంది.. అత్తయ్య అని పిలవగానే పార్వతి ఇంట్లోకి వస్తుంది.. అవని అక్కతో వచ్చారేంటి అత్తయ్య అని పల్లవి అంటుంది ఆ తర్వాత విషయం తెలుసుకొని సైలెంట్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ ఫుడ్ తినకపోవడంతో బయట ఏదైనా తినాలని అనుకుంటాడు. బయట ఫుడ్డు తిన్న తర్వాత బయటికి వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అవని చూసి అక్షయ్ కు నీళ్లు ఇస్తుంది. ఏమైందండీ ఏం జరిగింది అని అవని టెన్షన్ పడుతూ అడుగుతుంది. నాకేం కాలేదు పర్లేదు నువ్వు వెళ్ళు అని అక్షయ్ అంటాడు. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి నేను ఎలా వెళ్తాను ఏమైంది చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది. ఇక వాంతులు ఎక్కువ అవడంతో అక్షయ్ ని తన బండిపై తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుంది అవని.
రాజేంద్రప్రసాద్ అవని వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. పార్వతిని డ్రాప్ చేసి వస్తానని వెళ్ళింది. అక్కడ ఏమైనా గొడవ జరిగిందా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అని అనుకుంటాడు. అంతలోకే అవని అక్షయ్ ని బండి మీద ఎక్కించుకొని ఇంటి దగ్గరికి వస్తుంది. ఏమైందమ్మా అంటే మావయ్య గారు కాస్త సాయం చేయండి అని అవని అడుగుతుంది.. ఏమైందో తెలియదు మావయ్య గారు బయట వాంతులు చేసుకొని నీరసంగా ఉంటే బండిమీద ఎక్కించుకొని వచ్చానని అంటుంది.
ఇక అక్షయ్ ని తీసుకొని లోపలికి వెళ్ళగానే భానుమతి టెన్షన్ పడుతుంది. ఉదయం బాగా వెళ్ళినాడు ఇప్పుడు ఇలా నీరసంగా పడిపోయి రావడమేంటి నాకేదో టెన్షన్ గా ఉంది అని అంటుంది. అవని డాక్టర్ని పిలిపించి చూపిద్దామని రాజేంద్రప్రసాద్ ని డాక్టర్ని తీసుకురమ్మని చెప్తుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి వడదెబ్బ తగిలింది బయట కొద్ది రోజులు వెళ్ళనివ్వకండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని మందులు రాసిస్తాడు.
అవని మా ఇంటికి రండి నేను చూసుకుంటాను మళ్లీ తగ్గిన తర్వాత ఈ ఇంటికి రావచ్చు అని ఎంత చెప్పినా సరే.. అక్షయ్ మాత్రం నేను ఇక్కడే ఉంటాను నానం ఉంది కదా అని అంటాడు.. రాత్రి జ్వరం ఎక్కువ పోవడంతో భానుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఉదయం లేవగానే అక్షయ్ నీరసంగా పడుకోవడంతో అవని, ఆరాధ్య, రాజేంద్రప్రసాద్ లో ఇంటికి వస్తారు. నువ్వు ఇంత నీరసంగా పడుకో ఉంటే ఎలా రా నువ్వు ఒక మంచి సాయం లేకుండా ఉంటేనే లేవలేకపోతున్నావు..
Also Read : ప్రభావతికి షాకిచ్చిన బాలు.. మనోజ్, రోహిణికి దెబ్బ..మౌనికకు సంజయ్ గుడ్ న్యూస్..
అందుకే నేనే అవని వాళ్ళని రమ్మని చెప్పాను అని భానుమతి అంటుంది. అక్షయ్ ని ఎలాగైనా ఒప్పించాలని భానుమతి ప్రయత్నిస్తుంది కానీ అక్షయ్ ఒప్పుకోడు.. ఇక రాత్రి కమల్ ఇంటికి నేను రాను అని చెప్పాను కదా అని కమలాకర్ వేషంలో వచ్చి చెప్తాడు. నేను నా కొడుకు మనవరాలు దగ్గరే ఉన్నాను నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయ్ ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను భానుమతి అని అంటాడు. నీకోసం నేను అక్కడికి వచ్చేస్తాను అని భానుమతి కూడా అంటుంది. ఇక ఉదయం భానుమతి నాకు వయసు అయిపోయింది నడుము నొప్పులు ఎక్కువ సేపు నిలబడుకోలేను ఏది చేయలేను నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను అని అంటుంది. నేను ఈయనకు తోడుగా ఇక్కడే ఉంటాను అంటే ఏం అవసరం లేదు నేను అక్కడికి వస్తానని అక్షయ్ అవనితో అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..