E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో బాంబ్ పేల్చిన శ్రీవల్లి.. దొరికిపోయిన తోడికోడళ్ళు.. నర్మద, సాగర్ వెళ్ళిపోతారా?

Illu Illalu Pillalu Today Episode: ఇంట్లో బాంబ్ పేల్చిన శ్రీవల్లి.. దొరికిపోయిన తోడికోడళ్ళు.. నర్మద, సాగర్ వెళ్ళిపోతారా?
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ చాలా అద్భుతంగా పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. పక్కనే ఉన్న నర్మదా ప్రేమ డాన్స్ ని చూసి మురిసిపోతూ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేస్తుంది. అయితే ప్రేమ కోసం ఆ పిల్లల తల్లి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ధీరజ్ రావడం చూసి నర్మదా ప్రేమ ఇద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ధీరజ్ ఫుడ్ ఆర్డర్ చేశారు కానీ ఎవరు కనిపించలేదు ఇంతకీ మీ టీచర్ అమ్మ ఎక్కడ అని అడుగుతాడు. పిల్లలు ఇప్పుడే టీచర్ లోపలికి వెళ్లిందని చెప్తారు. ధీరజ్ లోపలికి వెళ్తుంటే ప్రేమ గొంతు మార్చి ఆగండి అని అరుస్తుంది. అక్కడున్న అద్దంలో ప్రేమను ధీరజ్ చూసేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ ని ఎలాగైనా పంపించాలని అనుకుంటుంది. ధీరజ్ ప్రేమను చూసేస్తాడు. ఇంట్లో తెలిస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ధీరజ్ ను చూస్తున్న నర్మదా ప్రేమకు ఈ విషయాన్ని చెప్తుంది.. దానికి ప్రేమ మేనేజ్ చేస్తే ధీరజ్ పంపిస్తుంది. ధీరజ్ వెళ్ళిపోగానే నర్మదా మెల్లగా ప్రేమ దగ్గరికి వస్తుంది. ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్లావు అక్క అని ప్రేమ అడుగుతుంది. నర్మదా ఎక్కడికి వెళ్లలేదు ఆ చెట్టు చాటున దాక్కొని ఇదంతా వింటున్నాను అని నర్మదా అంటుంది. అదేంటక్కా నన్ను ఇరికిచ్చేసి నువ్వు చెట్టు చాటున దాక్కున్నావా అనీ ప్రేమ అడుగుతుంది.. మీ ఆయన నన్ను కూడా చూసి వదిన నువ్వు కూడా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని నన్ను అడిగితే నేనేమని సమాధానం చెప్పాలా అని నర్మదా అంటుంది. ధీరజ్ కు తెలిస్తే సరిపోతుంది. కానీ శ్రీవల్లి చూస్తేనే ప్రాబ్లం అని ఇద్దరు అనుకుంటారు..

Advertisement

తన పుట్టింటి నుంచి వెళ్తున్న శ్రీవల్లి నర్మదా ప్రేమలను చూసి ఆగుతుంది. వీరిద్దరూ ఏంటి ఒకచోట ముచ్చట పెట్టారు అది కూడా ఇక్కడ ఉన్నారేంటి అని ఆలోచిస్తుంది. అయితే ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దని మామయ్య అన్న కూడా ఈ ప్రేమ ఇక్కడికి వచ్చి డ్యాన్సింగ్ క్లాసులు నేర్పిస్తుందా? ఈ ప్రేమ విషయాని కచ్చితంగా మావయ్య ముందు చెప్పాల్సిందే.. మా హనీమూన్ ని వీళ్లిద్దరు చెడగొట్టారుగా.. ఇప్పుడు వీరిద్దరిని మావయ్య ముందర ఎలా ఇరికిస్తాను అని శ్రీవల్లి మనసులో అనుకుని ఇంటికి వెళ్తుంది.

డాన్స్ క్లాసులు బాగా చెప్పామని నర్మదా ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతారు. అక్కడే ఉన్న రామరాజుకు డాన్స్ గురించి చెప్పబోతారు. మీరేం చెప్పాలనుకున్నారో నాకు తెలుసు అని రామరాజు షాక్ ఇస్తాడు.. ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా అని రామరాజు వేదవతితో అంటాడు. డాన్స్ క్లాసులకి వెళ్లి వస్తుందని అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. విషయం చెప్పద్దు అన్నందుకు ఇప్పుడు ఇంటికి వెళ్లి ఏకంగా డాన్సులు చెప్తుంది మీ కోడలు అని వేదవతిపై సీరియస్ అవుతాడు రామరాజు.

Advertisement

అది కాదు మావయ్య చెప్పేది వినండి అని ప్రేమ ఎంత వాదిస్తున్నా సరే.. రామరాజు వినకుండా కొంచమైనా బుద్ధి లేదా ఇంటి పరువు పోతుందని ఎంత చెప్పినా మీరు మారరా అని అరుస్తాడు. అయితే ప్రేమ చెప్పబోతుంటే రామరాజు వినకపోవడంతో నర్మదా ఈ రోజుల్లో కాలేజీలు జాబులు అంటూ అమ్మాయిలు ముందుకు వెళ్తున్నారు మామయ్య అని నర్మద అంటుంది. ఈ ప్రేమ ఇలా డాన్స్ క్లాసులకు వెళ్లి డాన్సులు చెప్పడానికి కారణం ఈ నర్మదనే. ప్రేమకి అంత ధైర్యం లేదు మొత్తం ఈ నర్మదనే చేసింది అంటూ రామరాజు సీరియస్ అవుతాడు..

ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ మొదలవుతుంది. గవర్నమెంట్ జాబ్ కదా అని వదిలేస్తుంటే మన నెత్తికె కూర్చుంది అని నర్మదకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు రామరాజు. ఈ అమ్మాయి వల్లే ఇంట్లో ప్రతి ఒక్క గొడవలు అనర్ధాలు జరుగుతున్నాయి. మీ సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఆడవాళ్ళు ఎప్పుడు ఎదిగారు అంటూ చులకనగా మాట్లాడుతాడు రామరాజు. శ్రీవల్లి వాళ్ళిద్దరిని రామరాజు తిడుతుంటే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.. నర్మద ఎంత చెప్పినా కూడా రామరాజు వినకపోవడంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో నర్మదా సాగర్ లు ఇంట్లోంచి వెళ్లిపోతారా? రామరాజు మనసు మార్చుకుంటాడా? చూడాలి…

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×