OTT Movie : పూర్ణ (కౌషానీ ముఖర్జీ) అనే ఒక ప్రముఖ సినీ నటి కోల్‌కతాలో నివశిస్తుంటుంది. ఆమె తన వ్యక్తి గత జీవితంలో తీవ్రమైన నిరాశలో ఉంటుంది. ఆమె తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఆమె ఒక అసాధారణ మార్గాన్ని ఎంచుకుంటుంది. తనను తాను చంపడానికి ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమిస్తుంది. ఈ క్రమంలో ఆమె అనంద కర్ (పరంబ్రత చటర్జీ)ను కలుస్తుంది. ఇతను ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించేలా చేస్తాడు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ కాంట్రాక్ట్ కిల్లర్ ఎవరు? పూర్ణ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
పూర్ణ అనే సినీ నటి తన వ్యక్తిగత జీవితంలో బ్రేకప్ ల కారణంగా, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తనకు తానుగా ఆత్మహత్య చేసుకోకుండా, ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కు తనని చంపమని డబ్బులు కూడా ఇస్తుంది. ఈ స్టోరీ వాస్తవ ఘటన నుండి ప్రేరణ పొందింది. ఈ క్రమంలో పూర్ణ అనంద కర్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతను హెమ్‌లాక్ సొసైటీ ఇది వరకు పనిచేసి ఉంటాడు. ఇప్పుడు కొత్త సందర్భంలో కనిపిస్తాడు. అనంద సార్కాస్టిక్ వైఖరి, అతని ప్రవర్తన పూర్ణను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు పూర్ణ అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.
అయితే కాంట్రాక్ట్ కిల్లర్ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆమెకు బతుకు మీద మళ్ళీ ఆశ పుడుతుంది. ఇక స్టోరీ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. చివరికి ఈ కాంట్రాక్ట్ కిల్లర్ ఎవరు ? అతను పూర్ణ అభ్యర్థనను నెరవేరుస్తాడా? అనంద కర్, పూర్ణ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు? పూర్ణ విషాదం వెనుక కారణం ఏమిటి ? ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినమాను చూసి తెలుసుకోండి.
Read Also : చేయని నేరానికి 27 ఏళ్ల జైలు … డ్రగ్ మాఫియాకి చుక్కలు చూపించే లాయర్ … దుమ్ము దులుపుతున్న యాక్షన్ థ్రిల్లర్
ఈ బెంగాలీ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘కిల్‌బిల్ సొసైటీ’ (Killbill Society). 2025 లో విడుదలైన ఈ సినిమాకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది 2012లో విడుదలైన ‘హెమ్‌లాక్ సొసైటీ’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది. ఇందులో పరంబ్రత చటర్జీ, కౌషానీ ముఖర్జీ, బిశ్వనాథ్ బసు, సందీప్త సేన్, అనింద్య చటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని దీనిని నిర్మించారు.ఈ సినిమా పూర్ణ అనే సినీ నటి చుట్టూ తిరుగుతుంది. హోయ్‌చోయ్ (Hoichoi) ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.