Illu Illalu Pillalu Today Episode june 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో ఉదయం మాట్లాడిన మాటలు విని ఫీల్ అవుతాడు. ఆ విషయం ప్రేమ జీవించుకోలేక పోతుంది తన కోరికలు ఆశలు అన్ని ఆవిరైపోతున్నాయని బాధపడుతున్నట్లు ఉంది అని ధీరజ్ అనుకుంటాడు. ఎలాగైనా సరే ప్రేమ కోరికను కచ్చితంగా తీర్చాలి అని అనుకుంటాడు. అయితే ఆ మూడ్ లోంచి ప్రేమను బయటకు తీసుకురావాలని ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్లి ఏంటి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఏం లేదురా ఊరికే అలా ఉన్నాను అని ప్రేమ అంటుంది.. ప్రేమించిన వాళ్ల కోసం కష్టపడాలి అని అందుకే అంటారేమో అని ధీరజ్ నోరు జారతాడు. నేను నీకు చెప్పాను కాబట్టి ప్రేమ ఏమైందిరా నామీద ప్రేమ పుట్టిందా అని అమాయకంగా అడుగుతుంది. ప్రేమ లేదు ఏమి లేదు అని ఇద్దరు కొట్లాడుకుంటారు. ఏమండీ ప్రేమించిన అమ్మాయి ఏంటి అని ధీరజ్ ను అడుగుతుంది ప్రేమ. మా అన్నయ్య అని అంటాడు.. ఇటు సాగర్, అటు ధీరజ్ లు తమ భార్యల కోరికలను తీర్చేందుకు రెడీ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ చదువు కోసం ధీరజ్ చేస్తున్న త్యాగం గురించి చెప్తుంది. ప్రేమించే వ్యక్తి దొరకడం నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని నర్మదా అంటుంది. ప్రేమ నేను మాత్రమే కాదు నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి అని సాగర్ నిర్ణయం గురించి అంటుంది. ఆ మాట వినగానే నర్మదా నవ్వుతుంది. ఆయనకు రైస్ మిల్ లే మొదటి పెళ్ళాం అలాంటిది జాబ్ చేస్తాడా అని అడుగుతుంది. ఉదయం మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా అక్కడ మీ నాన్న వాళ్ళు నిన్ను బాధ పెట్టారంట కదా దానికి బావగారు బాధపడిపోయారట. జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడట అని ప్రేమ అంటుంది..
భార్య కోసం బావ అలాంటి పని చేయడం నిజంగా గ్రేట్ కదా కానీ ప్రేమ అంటుంది. మాట వినగానే నర్మదా సాగర్ పై ప్రేమతో సంతోషం ఉరకలు వేస్తూ పొంగిపోతుంది.. ఒక్కక్షణం తనని తానే మర్చిపోయి సాగర్ కోసం వెతుకుతుంది. ప్రేమ అక్క అని పిలుస్తూ ఉన్నా కూడా నర్మదా సాగర్ ని వెతుకుతూ గాల్లో తేలుతూ ఉంటుంది. ఎదురుగా సాగర్ కనిపించడంతో అస్సలు ఆగకుండా వెనక నుండి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అది చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి పిల్ల అందరూ ఉన్నా కూడా ఇలా చేసింది అని అనుకుంటారు.
అందర్నీ చూసినా సాగర్ మాత్రం వదలవే ఏం చేస్తున్నావ్.. అందరూ చూస్తున్నారు. నాన్న కూడా ఇక్కడే ఉన్నారు వదలవే ఏం చేస్తున్నావ్ అర్థం కావట్లేదు అని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం కాసేపు కళ్ళు మూసుకొని ఈ ప్రపంచాన్ని మర్చిపోండి అని అంటుంది. అది కాదు అని సాగర్ అంటున్న సరే ఇంకేం మాట్లాడద్దు అని నర్మదా అంటుంది. వీళ్ళిద్దరిని చూసిన శ్రీవల్లి చందు పై ప్రేమతో వచ్చి హగ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అని బుజ్జమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తున్నారా రామరాజు అక్కడ నుంచి మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు.
తిరుపతి మాత్రం వీళ్ళిద్దరికీ ఏమొచ్చింది షారుఖ్ ఖాన్ సినిమాలో లాగా ప్రేమలో మునిగి తేలుతున్నారే అని అనుకుంటాడు.. ఇక రామరాజు లోపలికి వెళ్లిన విషయాన్ని గమనించిన వేదవతి కూడా లోపలికి వెళ్లి రామరాజుని వెనకాల నుంచి హగ్ చేసుకుంటుంది. రామరాజు మాత్రం పిల్లలు ఉన్నారే వదలవే అని ఎంత అన్న కూడా మీరేం మాట్లాడద్దు కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి కళ్ళు మూసుకోండి అని అంటుంది. మూడు జంటల్ని చూసినా తిరుపతి మాత్రం ఇలాంటివి చూసినప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటాడు. ఇక ప్రేమ అందని చూసి ధీరజ్ కోసం వెతుకుతూ వెళ్తుంది.
Also Read : పిచ్చి పట్టిన భానుమతి.. అవనికి దొరికిన కమల్.. పార్వతికి రాజేశ్వరి క్లాస్..
ధీరజ్ని చూసి వెనకాల నుంచి హగ్ చేసుకోవాలని అనుకుంటుంది. ధీరజ్ చూసే లోపల తన ప్రయత్నాన్ని మానుకుంటుంది. ధీరజ్ రెడీ అవుతుంటే అర్థం వెనకాలకు వెళ్లి అక్కడ ధీరజ్ ని హగ్ చేసుకున్నట్లు వింతగా ప్రవర్తిస్తుంది. అది చూసిన ధీరజ్ ప్రేమకు కన్ఫామ్ గా పిచ్చెక్కిందని అనుకుంటాడు. ఈరోజు ఒకవైపు ఎంత తిడుతున్న సరే ప్రేమ మాత్రం తన మనసులోని ప్రేమను మనసులోనే పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…