The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). తన కెరీర్లో ఇప్పటివరకు చేయని సరికొత్త హార్రర్ కామెడీ జానర్లో ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయగా.. ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఇందులో ప్రభాస్ ని చూపించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పవచ్చు.
ది రాజా సాబ్ క్లైమాక్స్ అప్డేట్..
తాజాగా ది రాజా సాబ్ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. జూలై మొదటి వారంలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ఉండనుందట. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్ హైదరాబాదులోనే భారీగా నిర్మించిన ప్యాలెస్ సెట్ లోనే ఈ సినిమా చివరి షెడ్యూల్ మొత్తం జరగనుంది అని సమాచారం. ఇక్కడ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అంతేకాదు ప్రభాస్ ని కలిసే ఛాన్స్ వస్తుందేమో అని తెగ ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ భారీ ప్యాలెస్ సెట్ లోనే క్లైమాక్స్ చిత్రీకరించబోతున్నారు అని తెలియడంతో అభిమానులు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందని, ఫ్యాన్స్ తో పాటు సినీవర్గాలు కూడా కామెంట్ చేస్తున్నాయి.
ది రాజా సాబ్ సినిమా విశేషాలు..
మారుతి (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika mohanan), రిద్దీ కుమార్(Riddhi kumar) ముగ్గురూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ లోనే వీరి నటన ఏ రేంజ్ లో ఉందో అర్థమయిపోయింది. ఎవరికివారు తమ నటనకు ప్రాణం పోశారు అని చెప్పాలి. డిసెంబర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై మాత్రం అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ ఈ సినిమా తర్వాత.. సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్(Prashanth Neel)దర్శకత్వంలో ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో ‘కల్కి 2’చిత్రాలతో పాటు హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో ‘ఫౌజీ ‘ సినిమాలను లైన్లో ఉంచారు. ఇక ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవలే మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో 20 నిమిషాలే కనిపించినా.తన పాత్రతో సినిమా మొత్తాన్ని నడిపించాడని చూసిన ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు .అంతేకాదు ప్రభాస్ కోసమే ఈ సినిమా చూడడానికి వెళుతున్న ఆడియన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.
ALSO READ:Trisha Krishnan: ఆలయానికి త్రిష భారీ బహుమతి.. ఏంటో తెలిస్తే షాక్!