Intinti Ramayanam Today Episode june 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వెళ్ళిపోతుంటే అవని అడ్డుపడుతుంది. మీ తండ్రి కూతురు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది.. నువ్వు మీ నాన్న కలిసి ఇలాంటి ప్లాన్ వేశారని నాకు క్లియర్గా అర్థం అయిపోయింది అని అవని అంటుంది. నువ్వు తెలివైన దానివే అక్క కానీ ఎందుకిలా తెలిసి కూడా చెప్పలేకపోతున్నావు అని అడుగుతుంది. నేను కేవలం నీ గురించి ఆలోచించాను తప్ప వేరే ఆలోచన లేదు. కుటుంబం ముక్కలవ్వడానికి అందరూ దూరం అవడానికి కారణం నువ్వే అని తెలిస్తే కమల్ ఆవేశానికి నువ్వు బలవుతావు.. కమల్ కోపం గురించి నీకు తెలుసు కదా చంపేస్తాడు. నువ్వు ఇంతదాకా వచ్చిన తర్వాత నీ గురించి ఎలా చెప్పకుండా ఉంటానని అని అవని అంటుంది.. ఇకమీదట నుంచి నీ పప్పులు ఉడకవు నీ తప్పులని బయటపెడతాను అని అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎంత అనుకున్నా నీ వల్ల కాదు అని పల్లవి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. షర్ట్ కోసం దొంగగా ఇంటికొచ్చిన అక్షయ్ ను రాజేంద్రప్రసాద్ కర్రతో చితకబాదుతాడు. మధ్యలో అవని అడ్డుపడి అతను దొంగ కాదు మీ అబ్బాయే అంటుంది.. మీరెవరు మా ఇంటికి రాకూడదనే కదరా అవన్నీ అడ్డుపెట్టాం మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. గేటు దూకి లోపలికి వచ్చాను నా షర్ట్ ఇక్కడ పడిపోయింది అని అంటాడు అక్షయ్. రాజేంద్రప్రసాద్ మాత్రం వీడొక గజదొంగ అని పెద్ద క్లాస్ పీకుతాడు. ఇక పార్వతిని పిలిచి రాజేంద్రప్రసాద్ రచ్చ రచ్చ చేస్తాడు..
ఇక అందరూ ఇంట్లోకి వెళ్లిన తర్వాత రాజేంద్రప్రసాద్ మాత్రం అవని కోసమే అక్షయ్ వచ్చాడని చెప్పగానే అవని సిగ్గుతో మురిసిపోతుంది. అటు భానుమతి తన భర్త ఎక్కడున్నాడో కనిపించలేదు అంటూ తెగ బాధ పడిపోతూ ఉంటుంది. ఫోటో పట్టుకొని మాట్లాడుతూ నా కోసం మీరు రారా అని బాధపడుతుంది. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు మీరు కచ్చితంగా నాకోసం వచ్చే ఉంటారు. మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను ఆగండి అని భానుమతి ఇళ్లంతా వెతుకుతూ ఏవండీ అని అరుస్తూ ఉంటుంది..
బయట గార్డెన్ లోకి వెళ్ళిన భానుమతికి తన భర్త కనిపిస్తాడు. స్వర్గం నుంచి నా కోసం రాలేదా అనుకున్నాను మీరు వచ్చేసారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా ఇన్ని రోజులు కూడా నన్ను చూడడానికి రాలేదు అని భానుమతి బుంగమూతి పెట్టుకుంటుంది. అది చూసిన కమలాకర్ నువ్వు కళ్ళకు కాయలు కాసినట్లు ఎదురు చూస్తావని నాకు తెలుసు. కానీ ఇంట్లో వీళ్ళ పరిస్థితి తెలిసిందే కదా నాకు అందుకే రావాలని అనిపించలేదు అంటూ అంటాడు. మీరు అవని సపోర్ట్ చేయాలని చెప్పగానే నేను మీ మాటను విన్నాను. పల్లవి అవనిని ఏదో అనిందని దాన్ని దగ్గరికి వెళ్లి మరి క్లాస్ పీకాను. అవనీని ఎవ్వరూ ఏమీ అనకుండా చూసుకుంటున్నాను అని భానుమతి అంటుంది.
సరేగాని మీరెందుకు నాకోసం రాలేదు అని అడుగుతుంది. నేను రాకపోవడానికి కారణం ఒకటుంది. ఈ ఇంట్లో మీ పెద్ద మనవడు కోడలు అవనిపై అరుస్తూనే ఉంటారు. అందుకే నాకు ఇక్కడికి రావాలని లేదు అవని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అని అంటాడు. అక్కడి నుంచి మాయం అయిపోయి వెళ్ళిపోతాడు. కమలాకర్ ని వెతుక్కుంటూ భానుమతి అవని వాళ్ళ ఇంటికి వస్తుంది. మా ఆయన ఇక్కడికి వచ్చాడు ఎక్కడున్నాడు అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం మా నాన్న చనిపోయి 30 ఏళ్లు అయింది ఇప్పుడు రావడం ఏంటమ్మా పిచ్చి గాని పట్టిందా అని అరుస్తాడు.
మన ఇంటికి రావడం ఇష్టం లేకే అవని వాళ్ళ ఇంట్లో ఉంటానని ఆయనే చెప్పాడు అందుకే వెతుక్కుంటూ వచ్చాను అని భానుమతి అంటుంది. అటు పార్వతీ కూడా అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది ఈ టైంలో అంటూ బయటికి వచ్చి వెతుకుతూ ఉంటుంది.. ఆరాధ్య బామ్మ మా ఇంట్లో ఉంది అని చెప్తుంది. ఆ మాట వినగానే పార్వతి అత్తయ్య మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్లారు అని అరుస్తుంది. నేను ఊరికే ఏం రాలేదు మా ఆయన ఇంట్లో ఉంటానని చెప్తేనే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. మావయ్య గారు చనిపోయి చాలా కాలమైంది మీరు ఇప్పుడు వెతుక్కుంటూ రావడం ఏంటి అత్తయ్య అని అరుస్తుంది. అయితే భానుమతి పిచ్చి అంటే అసలు ఒప్పుకోదు. నీకేమో మీ ఆయన ఇంటి ఎదురుగానే ఉన్నాడు. వాడేమో షర్టు మీద వంక పెట్టుకుని వాడి పెళ్ళాన్ని చూడ్డానికి వచ్చాడు. నేను మా ఆయనను చూడ్డానికి రాకూడదా.. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Also Read: దారుణంగా పడిపోయిన ‘కుబేర’ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?
కమలాకర్ వేషంలో ఉన్న కమల్ని అవని చూస్తుంది. నువ్వేంటి కన్నయ్య తాతయ్య గారు గెటప్ లో ఉన్నావు అని అడుగుతుంది. బామ్మ నీ మీద ఊరికే అరుస్తుంది. ఆమెకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే నేను ఇలాంటి నాటకం ఆడాను దీని గురించి నువ్వు ఎవరితోనూ చెప్పకు అని మాట తీసుకుంటాడు. తర్వాత రోజు రాజేశ్వరి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే నేను అసలు నమ్మలేకున్నాను అన్నయ్య. నా గుండె తరుక్కుపోతుంది అని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..